చరిత్రనంగా పాటల రూపంలోనే వ్యక్తం చేస్తుండేవార?

దేశాలన్నింటికంటే ప్రాచీనమైనది ఏది?

ఆదిమజాతులు భారతీయ సామాజిక వ్యవస్థ తక్కిన దేశాలన్నింటికంటే ప్రాచీనమైనది, మహోన్నత మైనదని చారిత్రక పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటికి దాదాపు నాలుగు వేల ఏండ్ల క్రితమే, అనగా ఈజిప్టు, గ్రీసు, మెసపొటేమియా, సుమేరియా వంటి ప్రాచీన దేశాలు బ్రతికి బట్టగట్టక పూర్వమే, భారతదేశంలో అత్యున్నతమైన నాగరికతా! సంస్కృతులతో గూడిన సామాజిక వ్యవస్థ సమస్తమైన సిరిసంపదలతో విలసిల్లు తూండినట్లు చారిత్రక సత్యాలు ఋజువు జేస్తున్నవి.

ఆనాటి భారతీయ వ్యవస్థలో కులాలనేవి లేనేలేవు! ఆర్యుల దండయాత్రతో యీ పరిస్థితి తారుమారైంది . ఈ ఆర్యులనబడే వారు. మధ్య ఆసియా, మధ్య ఐరోపా ప్రాంతాల నుండి పొట్ట చేతబట్టుకొని భారతదేశానికి వలసలు బయల్దేరి వచ్చినట్లు చారిత్రిక పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్యుల సంతతికి ! చెందిన కాశ్యపముని కాస్పియన్ సముద్రతీర ప్రాంతీయుడనీ , అదే విధంగ దూర్వాసుడు తురేనియన్ వంశీయుడనీ చారిత్రక పరిశోధకుల వాదన.

అగస్త్యుడు అంటే వూరూ పేరు లేనివాడని అర్థం . ఆర్యుల పుట్టు పూర్వోత్తరాలపై సమగ్రమైన పరిశోధన జరిపిన మీదట వీరు నార్దిక్ తెగకు చెందినవారనీ , రైనునది , కాస్పియన్ సముద్రతీర ప్రాంతాల్లో నివసిస్తూండేవారని ప్రఖ్యాత చరిత్రకారుడైన హెచ్ . జి . వెల్స్ పేర్కొన్నాడు. ఆర్యుల ఆచార వ్యవహారాలను గూర్చి హెచ్ . జి . వెల్స్ యీంకా యిలా వ్రాశాడు. ఆర్యులకు మాటకారి , తనం అని అర్ధనగ్నంగా తయారై తపుత్రాగి పాటలు బాదుతు, గంతులు వేయడమంటే వీరికి ఆసక్తి ఎక్కువ ఆనాటి వీరి భాషకు లిపి అంటూ లేకపోవడం వల్లనే వీరి పూర్వ చరిత్రనంగా పాటల రూపంలోనే వ్యక్తం చేస్తుండేవారు.

డా ॥ అంబేడ్కర్ జీవిత చరిత్ర ఆర్యుల దండయాత్రకు పూర్వం ద్రావిడులనబడే జాతులవారు ఉత్తర భారతంలో నివసిస్తూ వుండేవారు.

ఆసియా మైనర్ ప్రాంతానికి జెందిన శ్రమీల్ జాతులవారే ఉత్తర భారతంలోని గంగా, సింధూ ప్రాంతాల్లో స్థిరపడి విశేష విజ్ఞాన సంపన్నులై గొప్ప పట్టణాలనే నిర్మించుకోగలిగారు. ఆ కాలంలో నాగులు, మోండులు, మంఖ్మేదులు, సంతాలులు అనే అదిమతెగలవారు దక్షిణ భారతదేశంలో నివసిస్తూ వుండేవారు. ఈ ఆదిమజాతుల వారికి మలయా, యిండోనేషియా, యిండో చైనా దేశీయులకు పోలికలున్నవని మానవశాస్త్ర పరిశీలకులు (Anthropologists) అభిప్రాయపడుతున్నారు. అప్పటికే నౌకా నిర్మాణంలోను, సముద్రయానం లోను ప్రసిద్ధిగాంచిన ఆదిమ జాతులవారే మసాలియా (మచిలీపట్నం), నికామా (నాగపట్నం) కమారా ( కావేరిపట్నం ) సముద్రపు రేవుల నుండి బయల్దేరి తూర్పు దేశాల్లో స్థిరపడి వుండవచ్చని కొందరి అభిప్రాయం.

ఆ కాలములో భారతదేశం రెండుగా విభజింప బడి మధ్యన వింధ్య సాత్పురా పర్వతాలతోబాటు దట్టమైన చీకటి అడవులుం కడంతో ఉత్తర భారతదేశానికి , దక్షిణ దేశానికి మధ్య రాకపోకలనేవి అంతగా వుండేవిగావు . ఆర్యుల దండయాత్రతో ఆర్యులకు ద్రావిడులకు మధ్య గొప్ప యుద్ధాలు జరిగాయి . ఆ యుద్ధాల్లో ఆర్యులు ద్రావిడ జాతివారిని పూర్తిగా ఓడించడమే గాకుండా వారి పట్టణాలను కొల్లగొట్టి ధ్వంసం జేశారు . ఓడిపోయిన ద్రావిడుల్లో చీకటి కనుమల గుండా దక్షిణ దేశానికి పారిపోయినవారు పోగా మిగిలినవారితో ఆర్యులు సమ్మేళనం పొందారు . ద్రావిడుల ఓటమితో వారి ఆరాధ్య దేవతలైన నెమలి , హంస , పాము , గ్రద్ద , ఎదు, మేక – యివన్నీ ఆర్యుల దేవతలకు వాహనాలైనవి . ఆ తర్వాత మరికొంత కాలానికి ఆర్య ద్రావిడులకు, ఆదిమజాతులకు మధ్య తీవ్రమైన సంఘర్షణలు జరిగాయి.

ఈ నూతన సామాజిక వ్యవస్థలో వృత్తి విభజన ప్రారంభమైంది. వృత్తి విభజనా విధానం కొంత కాలానికి వంశపారంపర్యమై వర్ణ వ్యవస్థకు దారి దీసింది. వర్ణ వ్యవస్థ ఫలానా వృత్తి జేసేవారి సంతానం గూడ అదే వృత్తిని చేయాలంటూ నిర్బంధ వృత్తి విధానాన్ని శాశ్వతపరుస్తూ యీ పద్దతిని వ్యతిరేకించిన వారిని వెలివేయడం ప్రారంభిం చింది . ఆ విధంగా వర్ణ వ్యవస్థను , ఆర్యుల ఆధిక్యతను, నిర్బంధ వృత్తి విధానాన్ని వ్యతిరేకించి వెలివేయబడ్డవారే అంత్యజులు.

వర్ణ వ్యవస్థకు జెందిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల్లో దేనికీ జెందనివారు గనక వీరిని అవర్ణులని గూడ వైదికులు పిలువసాగారు. సంఘాన్నుండి వెలివేయబడ్డ యీ అంత్యజులు తదనంతరం బౌద్ద మతం స్వీకరించినట్లు, దీనికి వైదికులా గ్రహించి వీరిని అంటరాదనీ, చూడరాదనీ, చేరరాదనీ త్రివిధ బహిష్కారం జేసినట్లు పరిశోధనల వల్ల తేటతెల్లమైనది. కేరళ ప్రాంతములోని యజువ కులస్థుల్లో బౌద్ధ సాంప్రదాయాలు యీనాటికీ కొట్టవచ్చినట్టు కనుపిస్తున్నవి. ఈ యజువలు ఒకప్పుడు కేరళను పరిపాలించారు . ఈ వర్ణ వ్యవస్థ ఇంతటితో ఆగలేదు . మానవుడిలో తెలివితేటలధికమయ్యే కొలదీ క్రొత్త క్రొత్త వస్తు పరికరాలను , ఉత్పత్తి సాధనాలను, కనిపెట్టసాగాడు. ఈ నూతన వస్తు పరికరాలు ఉత్పత్తి సాధనాలతోబాటు వృత్తులు గూడ చిలువలు పలువలుగా పెరగడం! ప్రారంభమైనవి.

ఈ వృత్తుల పంపకంలో కీచులాట తొలుత బ్రాహ్మణ వర్గంలోనే తలెతింది. ఎన్నో కుట్రలు, ఎత్తులు, పై ఎత్తులు, కలహాలు జరిగి ఆఖరుకు ఒక రాజీ బేరానికంటూ ! వచ్చిన తరువాత బ్రాహ్మణ వర్గంలో కొందరు దైవారాధకులుగాను, మరి కొందరు పరిపాలకులకు మంత్రిత్వం గాను విభజింపబడ్డారు. అదే విధంగ తక్కిన కులాల్లో గూడ రాఖోపశాఖలు డజన్ల కొద్దీ పెరగడంలో ఆశ్చర్యమేముంది ? క్షత్రియ వర్గంలో కొందరు ! మాత్రమే రాజ్య పరిపాలన కరులుగా వైదిక శాసనకర్తలు నిర్ణయించరు.

క్షత్రియులంతా కులభ్రష్టులా?

డా॥ అంబేడ్కర్ జీవిత చరిత్ర తిరుగుబాటు జేసిన క్షత్రియులంతా కులభ్రష్టు శూద్రులుగా మారిపోయారు. ఈ విధంగా కత్తిబట్టినవాడిదొక కులమైతే ఆ కత్తిని తయారుచేసే వాడిది మరొ కులమైంది . పశువుల మేపేవాడిదొక కులమైతే, పాలు బితికేవాడిది మరో కులమైంది. ఈ విధంగ కమ్మరి. కుమ్మరి, చాకలి, మంగలి – యిత్యాది కులాలతో కొంతకాలానికి భారతీయ సామాజిక వ్యవస్థ కులాల మయమైపోయింది. ఒక కులానికి మరో కులానికి మధ్య యీర్యలు, స్పర్ధలు, సంఘర్షణలు పెరిగి సమాజం తీవ్ర సంక్షోభానికి గురైంది… వెలివేయబడ్డ అవర్డుల్లో సైతం కులాలు పుట్టలు బెట్టసాగాయి. పంటభూముల్లో పనిజేసే వాడిదొక కులమైతే, పెంటకుప్పలెత్తే వాడిది మరో కులమైంది. స్మశానంలో పీనుగుల్ని గాల్చేవాడిదొక కులమైతే, సాముగరిడీలు జేస్తూ పేటకు కాపలా కాసేవాడిది మరో కులమైంది. చచ్చిపోయిన పశువుల చర్మాలు వలిచేవాడిదొక కులమైతే , చర్మాలతో చెప్పులు కుట్టేవాడిది మరో కులమైంది. ఈ అవర్గులకు నిర్బంధ దాస్య జీవనం శాశ్వితం జేస్తూ మనుధర్మ సిద్ధాంతం కఠినమైన ఆంక్షలు విధించింది . ఈ సిద్ధాంతం ప్రకారం! అవర్ణుడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి సూర్యాస్తమయం వరకు అగ్రకులాల వారికి అడ్డమైన చాకిరీ చేయాలి.

దానికి ప్రతిఫలంగా అగ్రవర్ణాలవారేమిస్తే దాన్ని మారు! మాట్లాడకుండా సుకువెళ్ళాల్సిందే. అవర్డుల్ని అస్పృశ్యులుగా ధృవీకరిస్తూ వారిపైన మనువు విధించిన శాసనాలు, నిషేధాజ్ఞలు మరీ అమానుషమైనవి. అస్పృశ్యులకు గుడి , బడి ! నిషం వీరు వేదాలను చదువరాదు, వినరాదు. ఊరి వెలుపల మురికిపేటల్లో నివసించే వీరు కొన్ని నిర్ణీత సమయాల్లో మాత్రమే గ్రామ వీధుల్లో నడవాలి. ఆ నడిచేటప్పుడు. గూడ మెడకొక ముంత, మొలకొక చీపురు వ్రేలాడగట్టుకొని గంట వాయించుకొంటూ! వుమ్మి వేయవలసి వస్తే ఆ ముంతలో వూస్తూ వారు నడిచి వెళ్ళే అడుగుజాడల్ని చీపురుతో తుడుచుకొంటరు.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories