డా॥ అంబేడ్కర్ అమెరికా ప్రయాణం కోసం క్లుప్తంగా తెలపండి

అమెరికా ప్రయాణం కోసం తెలపండి

బరోడా మహరాజాను మెప్పించి ఉపకారవేతనం సంపాదించగలిగిన భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్ ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా దేశం ప్రయాణమైనాడు. అస్పృశ్య కులానికి చెందిన విద్యార్థికి విదేశ విశ్వవిద్యాలయాల్లో చదివే అవకాశం రావడం భారత దేశ చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని అపూర్వ విశేషం. అందులోను అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశంలో మేధావులకు పుట్టినిల్లెన కొలంబియా విశ్వవిద్యాలయంలో చదివే మహత్తరమైన అవకాశం ఒకానొక మహర్ కులస్తునికి రావడం వూహాతీతమైన వాస్తవం. అంబేద్కర్ కీ అపూర్వమైన అవకాశం కలిగించిన బరోడా మహరాజు వుత్తరోత్రా యావద్భారత పీడిత జాతులందరికీ విద్యాభిక్ష పెట్టిన వాడైనాడు. 1913వ సంవత్సరం జూలై నెలాఖరులో కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన భీమ్ రావ్ అంబేద్కర్ తొలిసారిగా స్వాతంత్ర్యాన్ని, సమానత్వాన్ని చవిచూశాడు. భారతదేశంలో వలె అమెరికాలో కులమత వివక్షతలు లేవు. కళాశాలలోను, తాను మకాం వుంటున్న హాస్టలులోను నలుగురితో బాటు తనకూ సమాన స్వేచ్ఛ, గౌరవం, ఆదరణ లభించాయి.

భారతదేశంలో ఆస్పృశ్య విద్యార్థిగా గడిపిన బాధామయ జీవితాన్ని అమెరికాలోని స్వేచ్ఛా జీవితంలో పోల్చుకుంటే తానొక నూతన ప్రపంచంలో నివసిస్తున్నట్లే తోచింది. తనకు లభించిన యీ మహత్తర స్వేచ్ఛా జీవితం తన కులస్థులందరికీ ఎప్పుడు లభిస్తుందా అని కలలు గనేవాడు . అమెరికాలోని స్వేచ్ఛా వాయుపుల్ని పీల్చగలిగిన అంబేడ్కర్ లో వినూత్నమైన భావాలుదయించసాగాయి . అప్పటికప్పుడే అమెరికాలోని ఉత్తమ సారస్వతంతోబాటు, అమెరికన్ల స్వాతంత్ర్య పోరాటాన్ని గూర్చి, నీగ్రోజాతుల బానిస విముక్తి పోరాటానికి బూకర్ టి. వాషింగ్టన్, అబ్రహాం లింకన్ వంటి మహా మహలంగా జరిపిన పోరాటాలను గూర్చి క్షుణ్ణంగా చదివి ఆకళింపు జేసుకొన్నాడు. ఫ్రెంచి విప్లవకారులైన వాల్టెర్, రూసో వంటివారు మతదురాచారాలపై వ్రాసిన గ్రంథాలను, దేవుడు, దయ్యం, స్వర్గం, నరకం అనే మీమాంసల పై రాబర్ట్ యింగర్సాల్, జార్జి బెర్నార్డ్ షా వంటి మహా మేధావులు రచించిన వ్యాసాలను, నాటకాలను ఆద్యంతం అమితమైన శ్రద్ధాసక్తులతో అధ్యయనం జేశాడు.

అనతి కాలంలోనే మతం పైన, కర్మ సిద్ధాంతం పైన అంబేడ్కర్ లో విప్లవాత్మకమైన భావాలు రేకెత్తసాగాయి. తాను కొలంబియా విశ్వవిద్యాల యంలో జేరిన కొంతకాలానికి బొంబాయిలోని ఒక ఆప్తమిత్రుడికొక లేఖ వ్రాస్తూ అందులో తన నూతన భావపరంపరల నీ విధంగా వ్యక్తం చేశాడు. “తల్లిదండ్రుల పూర్వజన్న సుకృతాన్ననుసరించి తమ సంతానం” యొక్క అదృష్ట దురదృష్టాలాధారపడి వుంటాయను కోవడం కేవలం కల్పితం. నిరాధారమైన యీ. కర్మ సిద్ధాంతం కేవలం కొందరు స్వార పరుల కుట్ర మాత్రమే! అమెరికా దేశంలో ఆడవారికి సైతం మగవారితో బాటు అన్ని విధాలైన స్వేచ్ఛావకాశాలు, విద్యారంగంలో ప్రోత్సాహం పుష్కలంగా వున్నవి. బహుశ అందుచేతనే యీ పాశ్చాత్య దేశాలు యింత త్వరితగతిలో అభివృద్ధిని సాధించగలుగు తున్నాయి. మన భారతదేశంలో గూడ ఆడవారికి సైతం మగవారితో పాటు స్వేరా స్వాతంత్ర్యాలు, విద్యావకాశాలు కల్పించినట్లైతే దేశం శీఘ్రగతిలో అభివృద్ధి జెందుతుంది.

ప్రస్తుతం భారత దేశంలో అంటరానికులాలవారు జేయవలసిందల్లా తమ సంతానాన్ని శ్రద్ధగా జదివించడమే. విద్యావంతమైన జాతి దానంతట అదే పైకి వస్తుంది “. పట్టుమని ఇరవై రెండేళ్లయినా మించని అంబేద్కర్ లో అప్పటికే యిన్ని విప్లవ భావబీజాలు, అభ్యుదయ భావాలు, పాదుకొని వుండడం బాయిలోని తన మిత్రులందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అమెరికా వంటి దేశాలకు వెళ్ళి పెద్ద చదువులు చదివే అవకాశం భారత దేశంలోని ఏ కొన్ని సంపన్న కుటుంబాలకు జెందినవారికి మాత్రమే సాధ్యమవుతుంది.

ఈ సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు అమెరికా దేశం రాగానే అక్కడి క్లబ్బులో డాన్సులు, విందులు, వినోదాల వంటి విలాస జీవితాలకు అలవాటు పడిపోతుంటారు. కాని, అంబేడ్కర్ ఎప్పుడూ వాటివైపు మొగమెత్తెనా జూసి ఎరుగడు. అమెరికాలోని ముఖ్య పట్టణాలను జూడాలనైనా తాననుకొన్నవాడు కాడు. తాను మహారాజాకు వ్రాసి యిచ్చిన ఒప్పంద పత్రంలో తన కాలమంతా విద్యార్జనలోనే వుపయోగిస్తానని మాట యిచ్చాడు. అంతేగాక తనకు మహారాజు నుంచి లభిస్తున్న ఉపకారవేతనంలోనే తన తిండి, బట్ట యిత్యాది ఖర్చులన్నీ గడుపుకోవడమే గాకుండా బొంబాయిలో తనపై ఆధారపడియున్న కుటుంబానికి గూడ కొంత మిగిల్చి పంపాల్సుంది. రోజుకు ఒక్క పూట మాత్రమే భుజించే వాడు.

సామాన్యమైన దుస్తులతోనే కాలేజికి వెళ్లేవాడు. పుస్తకాలు కొనడానికి మాత్రం నారాళముగా ఖర్చు ప్రసేవాడు. రోజుకు ఎన్ని గంటలు చదివినా తనకు తృప్తి గలిగేదికారు. లోగడ తాను హైస్కూల్లో జదివేప్పుడు సంస్కృతం ప్రత్యేక పాఠ్యభాగంగా యివ్వడానికా పాఠశాల ఉపాధ్యాయు లంగీకరించలేదు. కాని అమెరికాలో తన కలాంటి ఆంక్షలేవీ అదురాకపోవడంతో ఎం. ఏ. క్లాసుల్లో తన కిష్టమైన రాజకీయ శాస్త్రం, నైతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రాలను పాఠ్యభాగాలుగా ఎంచుకొన్నాడు. ఈ పాఠ్యభాగాలకు సంబంధించిన గ్రంథాలు కొలంబియా విశ్వ విద్యాలయ గ్రంథాలయంలో ఎన్నయితే వున్నాయో అన్నింటినీ అద్యంతం శ్రద్ధతో అపోశనం జేశాడు. నిరంతర విద్యా పరనా ప్రభావంతో అనతికాలంలోనే ” భారతదేశంలోని ప్రాచీన వాణిజ్యము ” (Ancient Indian Commerce) అనే పరిశీలనా గ్రంథం (Thesis) వ్రాశాడు. కొలంబియా విశ్వ విద్యాలయం వారీ గ్రంథాన్ని పరీక్షించి 1915వ సంవత్సరంలో ఎం.ఏ.పటానిచ్చారు. ఆ తర్వాత “భారతదేశంలోని కులాలు , వాటి పుట్టు పూర్వోత్తరాలు” (Castes in India, Their Machanism. Genisis and Development) అనే మరొక పరిశీలనా గ్రంథం గూడ వ్రాసి 1916లో జరిగిన కొలంబియా విశ్వవిద్యాలయ మానవశాస్త్ర పరిశోధకుల సదస్సు (Anthropology Seminar) లో చదివి వినిపించాడు. భారతదేశంలో కులా లేవిధంగా ఉత్పన్నమై వర్గ వైషమ్యాలకు దారితీసిందీ వివరించే యీ పరిశీలనా గ్రంథం ఆ సదస్సులోని మేధావు లందరికీ కనువిప్పు గల్గించింది. ఆ తరువాత మరి కొన్నాళ్ళలోనే “భారతదేశ జాతీయాదాయము దాని చారిత్రిక పరిశీలన (National Dividends of India – A Historic and Analytical Study) అనే మరో పరిశోధనా గ్రంధం గూడ రచించి విశ్వవిద్యాలయం వారికి సమర్పించాడు. మునుపెన్నడు ఎవ్వరూ ప్రయత్నించి ఎరుగని అతి ప్రమైన ఆర్థిక విషయాలపై క్షుణ్ణంగాను, సూక్ష్మంగాను చర్చించి, వివరిస్తూ వ్రాయబడ్డ యీ పరిశీలనా గ్రంథానికి కొలంబియా విశ్వ విద్యాలయం వారు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D.) డిగ్రీనిచ్చి గౌరవించారు. ఈ గ్రంథాన్నే కొంతకాలం తరువాత పి.యస్.కింగ్ అండ్ సన్స్ అనే లండన్ సంస్థవారు ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ యిన్ బ్రిటిష్ ఇండియా అనే పేరుతో ప్రచురించారు. భారతదేశంలో ఆర్థిక సమస్యలను అద్దంలో జూపిన విధంగా వ్రాయబడ్డ యీ రంథం వివిధ దేశాలకు జెందిన ఆర్థిక శాస్త్రవేత్త లందరి ప్రశంసలను అందుకొన్నది.

అనుకోని సంఘటనల మధ్య జరిగిన విషయాలు

అంతటి పిన్న వయస్సులోనే అటువంటి క్లిష్టమైన గ్రంథాన్ని రచించ గల్గిన అంబేడ్కర్ గౌరవార్థం అమెరికాలోని మేధావులంతా ఒక సభ జరిపి అంబేడ్కరను ఘనంగా సన్మానించారు. ఇది తన అంతర్జాతీయ ప్రఖ్యాతికి ప్రధమ సోపానం. భీమ్ రావ్ అంబేద్కర్ ఆ మీదట డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గా అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత ఆర్థిక సమస్యల పై తాను వ్రాసిన యీ గ్రంథం భారతదేశంలోని రాజకీయవేత్త లందరికీ మార్గదర్శి (Guide) గా సహాయపడింది. ఆ రోజుల్లో కేంద్ర శాసనసభల్లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే శాసనసభ్యులందరి చేతుల్లోనూ యీ గ్రంథానికి సంబంధించిన ముద్రణా ప్రతులుందడం గమనించదగ్గ విషయం. ఇది డాక్టర్ అంబేడ్కర్ భారతదేశానికి సమర్పించిన ప్రప్రథమ కానుకగా గూడ భావించవచ్చు. భారత దేశంలోని కొత్త కరెన్సీ నోట్లను ముద్రించే విషయమై పరిశీలించవలసిందిగా బ్రిటిష్ ప్రభుత్వం వారొక రాయల్ కమిషన్ ని నియోగించారు. ఆ కమిషన్‌కు జెందిన సభ్యులు భారతదేశంలో పర్యటిస్తూండిన తరుణంలో డా॥ అంబేడ్కర్ మాతృదేశంలోనే వున్నాడు. ఆ రాయల్ కమిషన్ వారు భారత ఆర్థిక విషయాలపై సలహా లివ్వాల్సిందిగా డా॥ అంబేద్కర్ని కోరారు. వారి కోరిక మన్నించి ఒకానొక రోజున వారిని వెళ్ళి కలిసినప్పుడు ఆ సభ్యులందరి చేతుల్లోను తాను వ్రాసిన గ్రంథం యొక్క ప్రతులుండడం జూచి డా॥ అంబేద్కర్ ముగ్ధుడయ్యాడు. నిజంగా ఆ గ్రంథం తనకు ప్రపంచ ఖ్యాతి నార్జించి పెట్టింది. అప్పటి కాయన వయస్సు ఇరవై ఐదేళ్ళే! ఆర్ధిక శాస్త్ర గ్రంథాల్లో అత్యంత ప్రాధాన్యత వహించిన యీ గ్రంథాన్ని బరోడా మహారాజు శ్రీ శాయాజీరావ్ గైక్వాడ్ కు అంకితమిచ్చి తన కృతజ్ఞతను ప్రకటించుకొన్నాడు.

ఎంతో శ్రమించి కొనసాగిస్తున్న సారస్వత కృషి ఫలించే కొలదీ డా॥ అంబేడ్కర్ లో జ్ఞాన తృష్ణ మరీ అధికమైంది. ప్రతిరోజు సాయంకాలం సమయాల్లో అమెరికాలోని ముఖ్యమైన పుస్తక విక్రయశాలల్లోను, పాత పుస్తకాలమ్మే వీధుల్లోను అరుదైన పుస్తకాల (Rare Books) కోసం అన్వేషణ సాగిస్తుండేవాడు. ఈ విధంగా ఎంతో కాలం కష్టపడి – సేకరించిన దాదాపు రెండువేల గ్రంథాలు ఒక చెక్కపెట్టెలో సీలు చేసి భారత దేశానికి తిరిగివస్తున్న ఒకానొక మిత్రుని ద్వారా పంపి తన యింటి వద్ద జేర్చమని కోరాడు. కాని ‘ ఆ మిత్రుడు మార్గమధ్యంలోనే కొన్నింటిని తస్కరించి ‘ మిగతావి యింటి వద్ద జేర్చాడట!

“పుస్తకం, వనితా , విత్తం . . . . . ” అనే సామెతను ల మిత్రుడు చాలా వరకు సార్థకం అమెరికా దేశపు రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణ (Amendment) రాణండర్యలను ఎంతో ఆకర్షించింది.

అమెరికాలోని లక్షలాది నీగ్రోలకు దాస్యవిముక్తి గల్లించేయీ సవరణను అంగీకరింపజేసేందుకై అవిరళ కృషిసల్పిన ఆదర్శమూర్తి బూకర్ బి.వాషింగ్టన్, ఒకానొక నీలో బానిస స్త్రీకి జన్మించి, దిక్కు దరీ లేకుండా పెరిగి కేవలం స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి బూకర్ టి. వాషింగ్టన్, విద్యారంగంలో జూకర్ టి. వాషింగ్టన్ జరిపిన కృషి, నీగ్రో జాతుల్లో తానుద్భవింప జేసిన విద్యాభిలాషనే ఆదర్శంగరా అంటేద్కర్ నిమ్న జాతుల విద్యాభివృద్ధికై ఎన్నో కళాశాలలను, హైస్కూళ్ళను, వాషర్శను స్థాపించేలా చేసిందని చెప్పవచ్చు. అందుకే బూకర్ టి. వాషింగ్టన్ అంటే నా అంటేద్కరకు వర్తించ రానంత అభిమానమూ, గౌరవము వుండేది. భారతదేశంలోని నిమ్మజాతులను సాంఘిక బంధవిముక్తులుగా చేసేందుకు అమెరికా రాజ్యాంగములోని పద్నాలుగవ సవరణ లాంటి దవసరమని డా॥ అంబేద్కర్ గుర్తించాడు. ఒకానొకనాటికి భారత రాజకీయాల్లో రానే బూకర్ టి. వాషింగ్టన్ పాత్ర నిర్వహించాల్సుంటుందని బహుశా అప్పటికి డా॥ అంబేద్కర్ వూహించి యుండడు.

కొలంబియా విశ్వవిద్యాలయంలో సన్నివేశాలు

కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన మూడేళ్ళలోనే మూడు పరిశోధనా గ్రంథాలను రచించి డాక్టరేటు డిగ్రీ పొందిన అంబేద్కర్ దృష్టి యిప్పుడు లండన్ వైపు ప్రసరించింది. విద్యా విషయంలో యావత్ర్పంచానికి కేంద్రం వంటిది లండన్ మహానగరం. కారల్ మార్క్స్, మజినీ వంటి పుద్ధండ పండితులంతా లండన్ నగరాన్ని తమ విద్యా కేంద్రంగా ఎంచుకొని కృషి సల్పినవారే!

1916వ సంవత్సరం జూన్ నెలలో కొలంబియా నుండి బయల్దేరిన డా॥ అంబేడ్కర్ సరాసరి లండన్ జేరుకొన్నాడు. లండన్ హార్బర్ లో అడుగు పెడుతూనే పోలీసులు వచ్చి తన చుట్టూ ముట్టడి వేయడం డా॥ అంబేడ్కర్ కి ఆశ్చర్యం వేసింది. దీనికంతటికీ కారణం అమెరికాలోని లాలా లజపతిరాయ్ ఆధ్వర్యాన జరుగుతూండిన భారత స్వాతంత్ర్య “ ఆప్ అగినెస్ట్ స్లేవరీ ” – బూకర్ టి . వాషింగ్టన్ (స్వీయచరిత్ర) పోరాటమే కారణం.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories