మహారాజా శాయాజీరావ్ గైక్వాడ్ వంశ చరిత్ర

మహారాజా చరిత్ర

ఛత్రపతి శివాజీ మహారాష్ట్రంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వెంటనే గుజరాతుపై దండయాత్రజేసి సూరత్ పట్టణాన్ని ముబటడించి మహమ్మదీయ సైన్యాలను చెల్లాచెదురు చేసి విజయపతాకాన్నెగురవేస్తాడు. ఆ దండయాత్రలో సైన్యాధిపత్యం వహించి శివాజీ విజయానికి తోడ్పడిన దామాజీరావు గైక్వాడ్ యొక్క ధైర్యసాహసాలకు మెచ్చిన శివాజీ అతన్ని గుజరాత్ లో గెలుచుకొన్న ప్రాంతాలకంతకూ సామంతునిగా జేస్తాడు. ఆ విధంగా బరోడా సంస్థానం ఏర్పడింది. దామాజీరావ్ తదనంతరం తన సోదరుని కొడుకైన పీలాజీ రావ్ సామంత రాజాతాడు. పీలాజీరావ్ తన కొడుకైన దామాజీరావ్ కాలంలో శివాజీ తదనంతరం అధికారానికి వచ్చిన బ్రాహ్మణ పీష్వాలకూ బరోడా సంస్థానానికి యుద్ధం ఏర్పడింది.

శూద్ర కులానికి చెందిన గైక్వాడ్ వంశస్థులు సామంతరాజులు గ్రావడంపై బ్రాహ్మణ పీష్వాలు జూపిన అసహనమే యీ యుద్ధానికి కారణం. బ్రాహ్మణపీష్వా సార్వభౌమత్వాన్నెదిరించిన దామాజీరావ్ యుద్ధంలో గెలిచి బరోడా సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. దామాజీరావ్ కుమారుడు గోవిందరావ్ . గోవిందరావ్ కుమారుడు ఆనందరావ్. ఆనందరావు కుమారుడు మొదటి శాయాజీరావ్. ఈ శాయాజీ రావ్ మనుమడే షంషీర్ బహదూర్ శాయాజీరావ్ గైక్వాడ్ . . మహారాజా శాయాజీరావు గైక్వాడ్ తన ఇంగ్లీషు గురువైన ఎఫ్.ఎ.హెచ్.ఎలియట్ ద్వారా సాంఘిక సంస్కరణల అవసరాన్ని ప్రాముఖ్యతను గూర్చి నేర్చుకుంటాడు. ఆ అందుచేతనే తాను రాజ్యాధికారం జేపట్టిన వెంటనే తన సంస్థానంలోని అన్ని పాఠశాలల్లోనూ పేదకులాల వారికి సైతం ప్రవేశం గలిపిస్తూ హుకుం జారీ చేస్తాడు . . మొట్టమొదటి సారిగా భూ సంస్కరణలను అమలు జరిపి సంస్థానంలోని వ్యవసాయం సస్యశ్యామలం చేసి మానవతా దృష్టితో ప్రజారంజకంగా పరిపాలన సాగించిన మహావ్యకి మహారాజా శాయాజీరావ్ గైక్వాడ్. బరోడా సంస్థానానికి ప్రత్యేకంగా టంకశాల (Mint) ను ఏర్పాటుజేసి, బరోడా బ్యాంకుని స్థాపించి, విదేశ వ్యాపారం విస్తృతంగా కొనసాగించి తన సంస్థానాన్ని ఐశ్వర్య వంతమైనదిగా రూపొందించాడు.

తన సంస్థానంలో అస్పృశ్యతా నివారణ కోసమై పథకాలను రూపొందించినా తన ఆస్థానంలోని బ్రాహ్మణ దివాన్లు వాటిని సజావుగా కొనసాగవచ్చవారు గారు. సంస్థానంలోని ఉన్నతాధికార్లంతా బ్రాహ్మల్ గావడంతో చిన్న చిన్న ఉద్యోగాల్లో సైతం బ్రాహ్మల్ని దప్ప మరొక కులం వారిని నియమించేవారు గారు. మహారాజా శాయాజీరావ్ గైక్వాడకు ఎన్ని సంస్కరణ భావాలున్నా అవి ఆచరణలోకి రాకపోవడానికి ఈ బ్రాహ్మలు దివాన్లు , ఉన్నతాధికార్లే కారణం.

దేవుడికి చెడ్డ పేరొచ్చింది . పూజార్ల వల్లనే గదా! భీమ రావ్ అంబేద్కర్ 1912వ సంవృతరము బి . ఏ . పాసవడమే గాకుండా ఎలిఫిన్ కళాశాలకంతా మొదటివాడుగా వచ్చాడు. ఆ కాలేజి చరిత్రలో మునుపెన్నడూ ఏ విద్యార్థికి రానన్ని మార్కులు భీమ్ రావ్ అంబేద్కర్ దెచ్చుకోగలిగాడు. ఈ వార్త విన్న ఐరోడా మహరాజు తను జేసిన సహాయాన్ని అక్షరాలా సద్వినియోగం చేసికొన్నందుకు భీమ రావ్ అంబేద్కర్‌ను ప్రశంసిస్తూ తన సంస్థానంలోని రక్షణ శాఖలో వెంటనే ఉద్యోగ మిచ్చాడు. భీమ్ రావ్ అంబేద్కర్ బరోడా సంస్థానులోని రక్షణశాఖలో ప్రవేశించిన పదిహేను రోజులకే తన తండ్రి అనారోగ్యంతో మంచమెక్కినట్లు తంతివార్త వచ్చింది. ఈ వార్త విన్నంతనే భీమ్ రావ్ బొంబాయి రైలెక్కాడు .

ఒకానొక స్టేషన్లో రైలు ఆగగానే తన తండ్రి కేమైనా తినుబండారాల దీసుకెళదామనే వుద్దేశంతో ప్లాట్ఫారం మీదకొచ్చి దుకాణం వద్ద సరుకులు బేరం చేస్తుండగానే రైలు కదిలిపోయింది. ఆ తరువాత చాలా గంటలకు గాని మరో రైలు రాలేదు. తీరా యింటికి వచ్చి తండ్రిని సమీపించే ఘడియలోనే రాంజీ సక్పాల్ తనువు చాలించాడు. మరణించినా కండ్లలో మాత్రం తన ప్రియతమ పుత్రుని రాకకై ఎంతో ఆత్రంతో ఎదురుచూసి ప్రాణాలు విడిచినట్లు స్పష్టంగా వెలుస్తున్నది. తన కుమారుడు కంటికి కనిపించగానే ప్రాణాలను వదిలాడు రామ్ జీ సక్పాల్. కలలోనైనా వూహించని విధంగా తన తండ్రి మాట మాత్రమైనా మాట్లాడే వ్యవధి లేకుండా ప్రాణాలు కోల్పోవడంతో భీమ్ రావ్ క్షణం పాటు స్తంభించిపోయాడు. అమావాస్య రోజు సముద్రం పొంగి ఆలలు విజృంభించే విధంగా దుఃఖం పెల్లుబికి పసిపిల్లవాడివలె తండ్రి మరణశయ్యపై పొర్లుతూ బిగ్గరగా ఏడ్వసాగాడు.

ప్రజ్ఞావంతుడైన కొడుకు

ప్రక్కనున్న బంధువులంతా ఎన్ని విధాలుగా సముదాయించినా తన హృదయంలో రగిలే ఆవేదన, ఆక్రందన అనునయిన జేయలేకపోయారు . కుమారుని అభివృద్ధి కోసం జీవితాంతం కష్టాలనుభవించి, అహర్నిశలు శ్రమించి, తనువు చాలించిన ఆదర్శమూర్తి రామ్ జీ మాలోజ్ సక్పాల్, శతాల్లాలుగ అస్పృశ్యతా దాస్య బంధాలలో బిక్కుకొని విద్యావిహీనులై పశుప్రాయులుగా జీవితాలు వెళ్ళబుచ్చే కోటానుకోట్ల పీడిత బారులకు విముక్తి కల్గించగల బహుముఖ ప్రజ్ఞావంతుడైన కొడుకును గన్న చరితార్థుడు రామ్ జీ మాలోజీ సక్పాల్.

తాను పరమపదించిన 1918 ఫిబ్రవరి 2వ తేది యావద్భారత నిమ్న జాతీయుల కత్యంత సంతాపకరమైన దినం . తండ్రి మరణించడంతో భీమ్ రావ్ తన కాళ్ళ మీద తాను నిలబడి సమస్త కుటుంది భారాన్ని మోయవలసిన పరిస్థితి ఏర్పడింది. తండ్రి మరణానంతరం తిరిగి బరోడా వెళ్ళే ప్రయత్నం విరమించుకొన్నాడు. ఎంత సేపు పై చదువులు చదవాలనే వాంఛతో తరుణ్ పాయాలను వెదకనారంభించాడు. తండ్రి మరణవేదన ఒకవైపు, తీరని విద్యావాంఛ మరో వైపు వీటితో రాత్రింబవళ్ళు సతమతమై పోజొచ్చాడు. ఇంతలో బరోడా మహారాజు వున్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు వుపకార వేతనాలిస్తుండినట్లు తెలిసికొన్నాడు.

పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయి వెంటనే బయల్దేరి బరోడా మహారాజును దర్శించి తన కోరిక దెలిపి సహాయ పడవలసినదిగా ప్రార్ధించాడు. బరోడా మహారాజు భీమ్ రావ్ అంబేద్కర్‌ లోని ఉతను విద్యాభిలాషను గురించి ఎరిగినవాడే గనుక వెంటనే అంగీకరించాడు. ఉపకారవేతనానికి సంబంధించిన ఒప్పంద పత్రంలో విదేశవిద్య పూర్తిజేయగానే తిరిగి వచ్చి బరోడా సంస్థానంలో పదేళ్ళు ఉద్యోగం జేయాలనే షరతును జేర్చాడు. మహార్ కులస్తుడైన భీమ్ రాప్ అంబేడ్కర్ పెద్ద చదువుల కోసం విదేశాల కెళ్ళనున్నట్లు పత్రికలు ప్రకటించాయి.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories