నిమ్నజాతుల సంక్షేమ సంఘం యొక్క ముఖ్య పాత్ర

నిమ్నజాతుల సంక్షేమ సంఘం యొక్క పాత్ర

దొంగలు, దొంగలు పూర్ణు పంచుకొన్నట్లు హిందువులు, మహమ్మదీయులు గల స్వయం పరిపాలన జేపట్టి అస్పృశ్యుల విషయం పట్టించుకోక పోవడం అస్పృశ్యులో తీవ్రమైన సంచలనం గల్గించింది. యావద్భారత దేశంలోని నిమ్న జాతుల సంఘాలన్నీ అప్పుడప్పుడే నిద్ర మేల్కొని దేశంలో హిందువులు, మహమ్మదీయులు గలిసి సాగిస్తున్న తతంగాన్ని గుర్తించాయి. బొంబాయి రాష్ట్రంలో నారాయణ్ చందవాద్కర్ అనే సంఘ సంస్కర్త నాయకత్వాన పనిజేస్తున్న డిప్రెస్ట్ క్లాసస్ మిషన్ సొసైటీ ( నిమ్నజాతుల సంక్షేమ సంఘం ) వారు చందవాడ్కర్ అధ్యక్షతను ఒక సమావేశం ఏర్పాటు చేసి స్వయం పరిపాల నలో నిమ్నజాతుల వారికి సైతం న్యాయమైన అధికార వాటా వుండాలంటూ ఒక సుదీర్ఘమైన తీర్మానం రూపొందించి బ్రిటిష్ ప్రభుత్వం వారికి పంపారు. కేంద్ర శాసన సభల్లోను రాష్ట్ర కౌన్సిళ్ళలోను నిమ్న జాతులవారికి ప్రత్యేక స్థానాలుండాలనీ, యీ ప్రత్యేక స్థానాలకు నిమ్న జాతుల అభ్యర్ధులను నిమ్నజాతులవారే ఎన్నుకొనే అవకాశముండాలనీ ఆ తీర్మానంలో పేర్కొన్నారు. నిమ్నజాతుల సాంఘికాభివృద్ధికి విద్యా వ్యాప్తికి కొన్ని సదుపాయాలు గల్పించాలని గూడ ఆ సంఘం వారు తమ తీర్మానంలో కోరారు. డిప్రెస్ క్లాసస్ మిషన్ సొసైటీ వారి తీర్మానాన్ని బలపరుస్తూ మద్రాసు, కలకత్తా యిత్యాది ప్రాంతాల్లోని అస్పృశ్య సంఘాలు గూడ తీర్మానాలు బ్రిటిష్ ప్రభుత్వానికి పంపాయి. డిప్రెస్ట్ క్లాసెస్ మిషన్ సొసైటీ నిమ్మజాతుల విషయంలో దీసుకొన్న చర్య వారిలో రాజకీయ చైతన్యాన్ని గల్గించింది. దీనికి నారాయణ్ చందవాడ్కరను ప్రశంసించారు. శ్రీ చందవాద్కర్ సల్పిన మహావ్యక్తి.

అగ్రవర్డుస్టుడే అయినా బ్రహ్మ సమాజికుడై నిమ్న జాతుల సముద్ధరణకై ఎంతో కృషి ఆ రోజుల్లో కాంగ్రెస్ సంస్థకు నాయకత్వం వహిస్తున్న తిలక్ మహాశయుడుగాని, ముస్లిం లీగ్ నాయకుడైన అగాఖాన్ సాహెబ్ గాని డిప్రెస్టు క్లాసెస్ మిషన్నారు ప్రసిన తీర్మానాన్ని ఏ మాత్రమూ ఖాతరు జేయలేదు. బ్రిటిష్ ప్రభుత్వం గూడ నిమ్నజాతుల కోర్కెల విషయంలో ఏలాంటి శ్రద్ధనూ గనబరచక పోవడంతో నారాయణ్ చందవాడ్కర్ తన అనుయాయుల్లో సమాలోచన జరిపి 1918 మార్చి 24వ తేదిన బొంబాయిలో అఖిల భారత నిమ్నజాతుల మహాసభ ఏర్పాటు చేసి ఆ సమావేశానికి కాంగ్రెసు పెద్దలైన విటల్ భాయ్ పటేల్, బిపిన్ చంద్రపాల్, జయశంకర్ యిత్యాదులను ఆహ్వానించాడు.

అస్పృశ్యుల అభివృద్ధి విషయంలో కాంగ్రెసు యిక మీదటనైనా శ్రద్ధ జూపాలనీ, వారి అభివృద్ధికై కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టాలని కోరుతూ ఒక తీర్మానం రూపొందించారు. నిమ్న జాతుల విషయంలో సానుభూతి ప్రకటిస్తూ కాంగ్రెసు పెద్దలు కూడా మాట్లాడారు. ఆమోదించబడ్డ తీర్మానంపై ఆ సభకు హాజరైన నిమ్న జాతీయ ప్రతినిధులతోబాటు కాంగ్రెసు పెద్దలు గూడ సంతకాలు జేశారు. ఆమోదించబడ్డ ఆ తీర్మానాన్ని నారాయణ్ చందవాడ్కర్ స్వయంగా తిలక్ వద్దకు తీసుకెళ్ళి చదివి వినిపించి సంతకం చేయవలసిందిగ కోరాడు. కాని, తిలక్ సంతకం జేసేందు కంగీకరించలేదు. ఈ తిలక్ మహాశయుడే తానొక బహిరంగసభలో ప్రసంగిస్తూ దేవుడే గనుక అస్పృశ్యతను పాటించమని జెప్పి యుంటే ఆ దేవుణ్ణి సైతం తాను లెక్కజేయనని బల్కివున్నాడు. అట్టి తిలక్ మహాశయుడు తీరా ఆ తీర్మానం మీద సంతకం జేయవలసి వచ్చేటప్పటికి చల్లగా తప్పుకున్నాడు. ఆచరణ విషయంలోనే బయటపడుతుంది బ్రాహ్మణ రాజకీయవేత్తల బండారం.

కాంగ్రెసు పేరుతో అగ్రవర్ణాలవారు, ముస్లింలీగ్ పేరుతో ఐశ్వర్య కుటుంబాలకు చెందిన మహమ్మదీయులు కలిసి కుమ్మక్కై కాంగ్రెస్ – లీగ్ పార్ట్ పేరుతో ఒక ఒప్పందాని కొచ్చారు. యావద్భారతీయులందరి పేరిట సంక్రమించనున్న రాజకీయాధికారాన్ని దేశ జనాభాలో మూడు వంతులు గల నిమ్నజాతుల, వెనుకబడిన వర్గాలవారికి నిరాకరించ డంపై దేశవ్యాప్తంగా ఆ ప్రజానీకంలో అసంతృప్తి బయల్దేరింది.

“ శాసనసభల్లో మాకు సైతం ప్రాతినిధ్యం వుండాలంటూ ” నిమ్నజాతీయులు, వెనుకబడిన వర్గాలవారు దేశవ్యాప్తంగ ఆందోళన ప్రారంభించారు. ఈ ఆందోళన ఆనాటి కాంగ్రెసు నాయకుడైన తిలక్ మహాశయుడికి గొప్ప ఆగ్రహం గల్గించింది. “ గానుగవాళ్ళు, జడలు, పొగాకు అమ్ముకొని బ్రతికేవాళ్లు, చాకలార్లు, మంగలాళ్లు, చెప్పులు కుట్టుకొని బ్రతికేవాళ్లు శాసనసభలకు దేనికంటూ ” తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కాడు. కాంగ్రెసువారు గాని, మహమ్మదీయులుగాని, బ్రిటిషు ప్రభుత్వంగాని, నిన్ను లో న్యాయంగా వ్యవహరిస్తారని డా॥ అంబేద్కర్ ఎప్పుడూ ఆశించలేదు.

నిమ్నజాతుల సాంఘిక విముక్తికి, విద్యాభివృద్ధికి, రాజకీయ ప్రాతినిధ్యానికి నిమ్న జాతులు సాగించాల్సిన పోరాటం గూర్చి డా॥ అంబేద్కర్ యొక్క అభిప్రాయాలే వేరు. అఖిలభారత నిమ్నజాతుల మహాసభ బొంబాయిలో జరిగిన తరుణంలో డా॥ అంబేద్కర్ బొంబాయిలో వుండి గూడ ఆ సభకు హాజరుగాలేదు. వీలైనంత త్వరలో లండన్ చదువులు పూర్తి చేసి బారిష్టరుగా స్థిరపడి ఆ తరువాత గానీ రాజకీయాల్లో అడుగుపెట్టరాదని నిశ్చయించు కొన్నాడు. హిందువుల తరుపున కాంగ్రెసు, మహమ్మదీయుల తరుపున ముస్లింలీగ్ మాదిత యావద్భారత నిమ్న జాతీయుల తరుపన ఒక వుద్యమం నిర్మించి తద్వారానే వారి అభ్యున్నతికై పోరాడవలసి వుంటుందని డా॥ అంబేడ్కర్ విశ్వాసం. కాని అలాంటి వుద్యమాన్ని తానిప్పుడు నిర్మించే స్థితిలో లేదు. వీలైనంత త్వరలో లండన్ వెళ్ళి చదువులు పూర్తి చేయడమెలాగా అనే ఆవేదనతోనే రోజులు గడపడొచ్చాడు.

కుటుంబ సమస్యలు

సంపాదనంటూ లేకపోవడంతో అంబేడ్కర్ కుటుంబంలో రోజులు గడవడమే కష్టమై పోయింది. అతి ప్రయాసతో యిద్దరు పార్సీ విద్యార్థులకు ట్యూషన్ జెప్పేందుకొక సదుపాయం గుదుర్చుకొన్నాడు. అదే సందర్భంలో ఒక వ్యాపార సలహా సంస్థ నొకదాన్ని ఏర్పాటు జేసి వ్యాపార విషయాల్లో శాస్త్రీయమైన సలహాలివ్వ సాగాడు. ఈ సలహాల వల్ల వ్యాపారస్థులకు బాగా లాభాలు రావడంతో అంబేడ్కర్ కు గూడా ఆదాయం పెరిగింది. కాని కొంతకాలానికి తాను అస్పృశ్యుడన్న విషయం తెలిసికొన్న వ్యాపారస్థులు తన వద్దకు సలహాలకు రావడం మానివేయడంతో తన సంస్థ మూతబడ్డది. మళ్ళీ కష్టాలు మొదలైనవి. ఇన్ని ఇబ్బందులకు గూరియౌతూనే బెల్టాండ్ రస్సెల్ వ్రాసిన ” రీ – కన్‌స్ట్రక్షన్ అప్ సొసైటీ ” ( సంఘ పునర్నిర్మాణం ) అనే గ్రంథానికి సుదీర్ఘమైన సమీక్షను వ్రాశాడు. ఆ సమీక్ష పత్రికల్లో ప్రకటితమై పలువురు శాస్త్రవేత్తల ప్రశంసలనందుకొన్నద . బొంబాయి గవర్నర్ సిడన్ హామ్ యొక్క సిపారసు వల్ల బొంబాయిలో తన పేరుతో స్థాపించబడ్డ సిడన్ హామ్ కళాశాలలో డా॥ అంబేద్కర్ ప్రొఫెసర్ గా నియమింప బడ్డాడు.

1918వ సంవత్సరం నవంబర్ నెలలో ఉద్యోగంలో జేరాడు. తాను కళాశాలలో ప్రవేశించిన తొలి రోజుల్లో కళాశాలలోని విద్యార్థులెవ్వరూ అంబేడ్కర్‌ గూర్చి అట్టే పట్టించు కొనేవారు కారు. కాని కొంతకాలానికి పాఠాలు జెప్పడంలో డా॥ అంబేడ్కరకు గల ప్రత్యేక మైన లాఘవాన్ని, నైపుణ్యతను విద్యార్థులంతా గ్రహించగలిగారు. ఆ తరువాత రాను రాను విద్యార్థులంతా డా॥ అంబేడ్కర్ క్లాసంటే ఆసక్తి జూపడమే గాకుండా యితర తరగతుల వారు గూడా రావడం సాగించారు. డా॥ అంబేద్కర్ ఫలానా తరగతిలో యీవేళ రాజకీయ శాస్త్రం బోధిస్తారని తెలిస్తే ఆ రోజు ఆ హాలంతా విద్యార్థులతో కిలకిటలాడిపోయేదట. కాని, సాటి ప్రొఫెసర్లలో మాత్రం కులతత్వం కొట్టవచ్చినట్లు కనబడుతూండేది. కాలేజి ప్రొఫెసర్లు తాము త్రాగే నీళ్ళ కూజాలో నుండి డా॥ అంబేడ్కర్ ని నీళ్ళు దీసికోనిచ్చేవారు గారు. ఆత్మాభిమానంతో వళ్ళు దహించుకుపోతున్నా కాలం కలసిరానందున ఎంతో ఓపికతో సహించి వూరుకొనేవాడు.

భారతదేశంలో స్వయం పరిపాలన ఎలా కొనసాగుతున్నదో విచారించేందుకై బ్రిటిష్ ప్రభుత్వం సౌత్ బరో కమిటీ పేరుతో ఒక విచారణ సంఘాన్ని నియమించింది. ఈ సౌత్ బరో కమిటీ సభ్యులు భారతదేశంలో పర్యటిస్తూ వివిధ కులాల, మతాల పెద్దల వద్ద కెళ్ళి భారతదేశంలో స్వయం పరిపాలనా ఫలితాలను వారెంతవరకూ అనుభవి స్తున్నదీ విచారణ జేయసాగారు. ఈ సందర్భంలో డా॥ అంబేడ్కర్ ఆ కమిటీ సభ్యులను గలిసికొని భారతదేశంలో తరతరాలుగా అస్పృశ్యులనుభవిస్తున్న కష్టాలను పూసగుచ్చినట్టు వివరిస్తూ యీ స్వయం పరిపాలన వల్ల నిమ్న జాతీయులకెలాంటి సౌకర్యం గాని, రక్షణ గాని లేదని స్పష్టం జేశాడు. యావద్భారత ప్రజానీకం పేరుతో కాంగ్రెసు సంస్థలోని అగ్రవర్ణాల వారే స్వయం పరిపాలనాధికారం జేపట్టి పీడిత కులాలవారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో “ నామ్ డి స్లమ్ ” అనే పేరుతో విశేషంగా వ్యాసాలను, ఉత్తరాలను ప్రచురించసాగాడు.

మూకనాయక్ పత్రిక

కుటుంబ జీవనంలో కాస్తంత స్లిమితము ఏర్పడగానే “ మూక్ నాయక్ ” అనే ఒక మరారి పక పరికను ప్రచురించడం ప్రారంభించాడు. మూక్ నాయక్ అంటే మూగవాళ్ళకు నాయకుడని అర్థం. నోరుండీ తమకు జరుగుతున్న అన్యాయాలను ఎదిర్చి మాట్లాడలేని కోట్లాది నిమ్న జాతీయులు మూగవారే. నోరుండి మాట్లాడలేని వారికి నాయకత్వం వహించే పత్రిక మూకె నాయక్. పత్రిక పేరెంత భావగర్భితంగా వున్నదో అందులోని రచనలు సైతం అంత ఆసక్తిదాయకంగ వుండి నిమ్న జాతీయుల సంఘ చైతన్యాన్ని, మనోవికాసాన్ని గల్గించేవి. డా॥ అంబేడ్కర్ యొక్క ప్రజాపారవాలి గూర్చి వినియుండిన సాహు మహారాజ్ “ మూక్ నాయక్ ” పత్రికా ప్రచురణకు ఆరి ” సహాయం జేసేందుకై అంగీకరించాడు. కొల్హాపూర్ సంస్థానాధీశుడైన సాహు మహరాణి అస్పృశ్యుల సాంఘికాభివృద్ధి విషయంలో చాలా శ్రద్ధ జూపసాగాడు. తన సంస్థానంలో నిమ్న జాతుల కొరకై స్కూళ్ళను, హాస్టళ్ళను స్థాపించిన ఉదార పురుషుడు సాహు మహరాజ్ మూక్ నాయక్ పత్రిక ద్వారా హిందూమత దురాచారాలపై నిప్పులు వర్షించసాగాడు డా॥ అంబేద్కర్. వైదిక మతం పేరుతో బ్రాహ్మణులు తదితర కులాల వారిపై కొనసాగిస్తున్న పీడిత వైఖరిని దుయ్యబట్టడంతో యీ పత్రిక పరాన్న బుక్కులపాలిట మహమ్మారిలా పరిణమించింది. పీడిత కులాల్లోనేగాక శూద్ర కులాలలో సైతం యీ పత్రిక సంఘ చైతన్యాన్ని పురి కొల్పసాగింది. ఆ 1920వ సంవత్సరం మే నెలలో నాగపూర్ పట్టణంలో అఖిల భారత నిమ్న జాతుల మహాసభ ఏర్పాటైంది. కొల్హాపూర్ మహారాజుతో పాటు డా॥ అంబేడ్కర్ గూడ ఆ – సభకు హాజరయ్యాడు. డా॥ అంబేడ్కర్ యొక్క ప్రజ్ఞాపాటవాలను గూర్చి, నడుపుతున్న మూకనాయక్ పత్రికను గూర్చి బాగా ఎరిగివున్న నిమ్న జాతీయ నాయకులంతా డా॥ అంబేడ్కర్ ను ఆ సభలో ప్రసంగిచాల్సిందిగా కోరారు. డా॥ అంబేడ్కర్ తన జీవితంలో మొట్ట మొదటి సారిగా బహిరంగ వేదికపై ఎక్కి ప్రసంగించాడు. ప్రతి సమస్యను గూర్చి శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించగల డా॥ అంబేడ్కర్ కులాల పుట్టు పూర్వోత్తరాలతో ప్రారంభించి, అస్పృశ్యుల అగచాట్లు వరకు అనర్ఘళంగా ఉపన్యసించాడు. హిందూ ఛాందస విధానాలపై నిప్పులు గురిపిస్తూ అస్పృశ్యుల్లో అనాదిగా జీర్ణించుకొని పోయివున్న బానిస మనస్తత్వాన్ని గూడ తీవ్రంగా ఖండించాడు. స్వయం పరిపాలన పేరుతో కాంగ్రెసు సాగిస్తున్న రాజకీయమైన దోపిడీ విధానాన్ని గూడ విమర్శించాడు. డా॥ అంబేడ్కర్ ఉపన్యాసం ఆద్యంతం సావధానంగా విని పులకితుడైన కోలాపూర్ మహారాజు తరువాత ప్రసంగిస్తూ డా॥ అంబేద్కర్ సుద్దేశించి ” అస్పృశ్యుల దాస్య శృంఖలాలను బ్రద్దలుజేసేందుకై అస్పృశ్యుల్లో ఒక అపూర్వ వ్యక్తి అవతరించాడంటూ అనతి కాలంలోనే అస్పృశ్యులు స్వతంత్రులుగానున్నారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

డా ॥ అంబేద్కర్ సిడెన్‌హామ్ కళాశాలలో ప్రొఫెసరుగా పనిచేస్తూ సంపాదించే తంలోనే కొంత కుటుంబ పోషణకిచ్చి, కొంత లండన్ చదువులకు దాచి, అత్యధిక భాగం మూక్ నాయక్ పత్రికా నిర్వహణకే ఖర్చు పెట్టేవాడు. తాను కుటుంబ ఖర్చులకని యిచ్చే చాలీచాలని డబ్బుతోనే ఎంతో మితంగ, మెళకువతో సంసారం నడిపిస్తుండేది, తన ధర్మపత్ని రమాబాయి. అంబేద్కర్, రమాబాయి దంపతులకు గల్గిన మొదటి యిద్దరు కుమారులు శైశవ దశలోనే మరణించారు. మూడవ కుమారుడైన యశ్వంతరావ్ పై పంచ ప్రాణాలు బెట్టుకొని ఎంతో శ్రద్ధతో పెంచసాగింది రమాబాయి. ఆమె కాపురాని కొచ్చిన నాటి నుండి ఎడతెరపి లేకుండా కష్టాలు ఒకదాని వెంబడి మరొకటి వస్తూండ డంతో నిరంతర దుఃఖభారంతో చాలా శుష్కించిపోయింది. కుమారుడు యశ్వంతరావ్ గూడ ఎప్పుడూ ఏదో ఒక జబ్బుకు గురౌతూ ఆమెను నిరంతరం ఆందోళన పరుస్తుండే వాడు . అంబేడ్కర్ ప్రతికా నిర్వహణలోను, కళాశాల వ్యాపకాలలోనే ఎక్కువగా నిమగ్నుడై కుటుంబ బాధ్యతలపై అట్టే పట్టించుకొనేవాడుగాడు.

డా॥ అంబేద్కర్ బరోడా సంస్థానాన్నుండి ఉపకార వేతనం పొందిన తరుణంలో తానిచ్చిన ఒప్పందం ప్రకారం పదేళ్ళు ఆ సంస్థానంలో ఉద్యోగం జేయవలసియున్నా కొన్ని రోజులకే ఆ సంస్థానం నుండి వచ్చి వేశాడు. గనుక తాను పొందిన ఉపకార వేతనం మొత్తం తిరిగి సంస్థానానికి చెల్లించాలంటూ ఆ సంస్థానపు దివాన్లు తనకొక నోటీసు బంపారు. ఉపకార వేతనంగా యిచ్చిన డబ్బును తిరిగి వసూలుజేయాలనే యోచన అసలు బరోడా మహారాజుకు లేనేలేదు. ఇదంతా యీర్ష్యాద్వేషాలకు ప్రతిరూపాలైన బ్రాహ్మణ దివాన్ల మంత్రాంగమే. ఉపకార వేతనం తిరిగి చెల్లించే సితిలో లేడని తెలిసి కడకు కోర్టు కెళ్లేందుకు గూడ యీ బ్రాహ్మణ దివాన్లు తయారయ్యారు. ఆ దశలో బరోడా మహారాజు తెలిసికొని దివాన్లను గట్టిగా మందలించి డా॥ అంబేడ్కర్ తాను కొందిన ఉపకార వేతనంలో తిరిగి చిల్లిగవ్వ గూడ చెల్లించ నవసరం లేదని ఆర్డర్ పాస్ జేశాడు.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories