పూర్వం అంటరాని వారు అనే ఎదుర్కొన్న సమస్యలు వాటి యొక్క కారణాలు

సమస్యలు

ఆహారపానీయాదుల్లోనూ, వస్త్రాలంకరణాదుల్లో గాల అనంత్యలపై తీవ్రమైన ఆంక్షలు విధించబడ్డవి. పాలు, నెయ్యి లాంటి బలవర్ధక సరాలను వీరు వాడరాదు. మగవాడికి మూరెడు గోచి , ఆడదానికి బారెడు చీర మంచరాదు. బంగారు, వెండి నగలనుగాని, పాత్రలనుగాని వీరు ధరించరాడు, వాడరాదు. వంట – వార్పు, పట్టన అంతా మట్టిపాత్రల్లోనే జరగాలి. అగ్రవర్ణాలవారు యీ అస్పృశ్యులను అవమానించినా, హింసించినా, ఆఖరుకు హత్య చేసినా సరే దానికి అప్పీలు లేదు. ఈ విధంగా ప్రపంచంలో మరెక్కడా కనీ వినీ యెరుగని నిర్బంద బానిస విధానం అస్పృశ్యులపై విధించబడ్డది.

రమారమి రెండువేల ఐదు వందల ఏళ్ళుగా అస్పృశ్యులీ నిర్భంధ సేనా విధానానికి గురై ఫోరమైన హింసాకాండకు బలౌతూ వచ్చారు. వివేకంతో బాటు అభ్యుదయ భావాలు సైతం గల సంఘసంస్కర్తలు కొందరు అస్పృశ్యులనుభవిస్తున్న దారుణమైన జీవితాలను జూనీ గుండెలు కరిగి వైదిక ధర్మంపై తిరగబడ్డారు. కాని ఫలితము లేకపోయింది. దక్షిణాదిన రామానుజుడు, కర్ణాటక దేశంలో వీరబసవడు, ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మనాయుడు, మహారాష్ట్ర దేశంలో తుకారాం, ఏకనాథుడు యింకా రాజారామ్ మోహన్ రాయ్, కబీరు, చైతన్యుడు, చక్రధరుడు, రోహిదాసు, చోళమేళుడు యిత్యాది సంస్కర్తలు, సాధువులు ఎందరో యీ వైదికాచారాలపై ధ్వజమెత్తి, అస్పృశ్యులకు దాస్య విముక్తి గల్గించి, నవ సమాజం నిర్మించాలనే పవిత్రాశయంతో చాలా కృషి చేశారు. కాని వైదిక ధర్మం వారి ప్రయత్నాలను సాగనివ్వలేదు.

ఆంగ్లేయుల పాలనలో క్రైస్తవ మిషనరీలు యీ అస్పృశ్యులకు చేసిన సేవ ప్రశంస నీయమైనది. శతాబ్దాల తరబడి అస్పృశ్యులుగా, సంఘ బానిసలుగా మ్రగ్గుతూండిన యా జాతులవారిని క్రైస్తవ మతంలోకి జేర్చుకొని వారికి విద్యా బోధనతో బాటు నాగరికతా సంస్కృతులను సైతం నేర్పడం ప్రారంభించారు. వేదాలను చదువలేని, వినరాని వెంకటయ్య క్రైస్తవ మతంలో జేరి విల్సనై విద్యాబుద్ధులు నేర్చి, బైబిల్ శిక్షణలో ఉత్తీర్ణుడై క్రైస్తవమత గురువైనాడు. అదే విధంగా వేలాది అస్పృశ్యులు క్రైస్తవ మతంలో ప్రవేశించి ఆనాటి రాజభాషయైన ఆంగ్లేయభాషలో ప్రావీణ్యత సంపాదించి పెద్ద పెద్ద ఉద్యోగాలు జేయగలిగారు.

కాని, భారతదేశజనాభాలో ఐదవవంతుగల కోటానుకోట్ల అస్పృశ్యులను సం పరచి, వారిలో రాజకీయ చైతన్యాన్ని రగిల్చి మట్టిబొమ్మలను మహారణానికి నడిపిన యీ కోటానుకోట్ల అస్పృశ్య ప్రజానీకాన్ని పరిపూర్ణ దాస్య విముక్తి పోరాటంపై నడిపించి వారిని స్వతంత్ర భారత పౌరులుగా, న్యాయనిర్ణేతలుగా, చట్ట నిర్మాతలుగా, దేశ పరిపాల కులుగా జేయగలిగిన మహావ్యక్తి ఒక్కడే! ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ సాధించలేనియా ఘనవిజయాన్ని సాధించిన వ్యక్తి డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్. ” స్వతంత్ర భారత దేశంలో నా ప్రజలు పాలకులుగానే వుంటారుగాని పాలితులుగా వుండజాలర ” నే ప్రతిన బూని ఆ మహదాశయ సాధనలో దాదాపు అర్ధ శతాబ్దంపాటు దీక్షతో నిర్విరామంగా కృషి చేసి తరించిన అపూర్వ, అద్వితీయ వ్యక్తి డా॥ బి . ఆర్ . అంబేడ్కర్. అట్టి మహనీయుని జీవిత విశేషాలను, ఆశయ ఆదర్శాలను, సాగించిన పోరాటాలను, సాధించిన విజయాలను శ్రద్ధతో అధ్యయనం జేసి అవగాహన జేసుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం.

రూపు మాపడానికి పుట్టిన న కారణజన్ముడు ( జననం – బాల్యం )

మహారాష్ట్రంలో కొంకణ ప్రాంతం మేధావులకు, కర్మవీరులకు పుట్టినిల్లు. స్వాతంత్ర్యం నా జన్మహక్కని భారత స్వాతంత్ర్య సంగ్రామానికి నాందీ వాచకం బల్కిన బాలగంగాధర తిలక్, డా॥ కార్వే వంటి మహామహులంతా యీ కొంకణ ప్రాంతంలో జన్మించినవారే. కొంకణ ప్రాంతంలోని రత్నగిరి జిల్లాకు చెందిన అందివాడ అనే గ్రామంలో రామ్ జీ సక్పాల్, భీమాబాయి అనే పుణ్యదంపతులుండేవారు. వీరు మహర్ అనే అస్పృశ్య కులానికి చెందినవారు. మహర్ కులస్థులు దృఢకాయులు, తెలివితేటలుగల వారగుట చేత ఆంగ్ల ప్రభుత్వం వీరికి మిలటరీ ఉద్యోగాలిచ్చి ప్రోత్సహించింది.

రామ్ జీ మాలోజీ సక్పాల్ మిలటరీలో జేరి సుబేదారై మధ్యప్రదేశ్ లోని మౌ అనే చిన్న పట్టణంలో ఉద్యోగం జేస్తుండేవాడు. చేసేది మిలటరీ ఉద్యోగమైనా మనసు మాత్రం ఎల్లప్పుడు దైవచింతన, మత తత్పరతలతో నిండి ఉండేది. కబీరు ప్రభోదాలను ఎల్లప్పుడు వల్లిస్తు భార్య భీమాబాయితో గలిసి రాత్రులందు ప్రొద్దుబోయేవరకు భజన గీతాలను బాడుతుండేవాడు. భీమాబాయి తన భర్తకు ఎల్లవేళల్లోను తోడునీడగా ఉంటూ, ఆదర్శవంతమైన జీవితం గడిపిన మహా యిల్లాలు. ఈ పుణ్య దంపతులకు పద్నాలుగురు సంతానం. వీరిలో ఆఖరి సంతానమే డా॥ బీమ రావ్ రాంజీ అంబేడ్కర్.

భీమాబాయి ఆఖరుసారిగా గర్భవతిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగిందట. రాంజీ మాలోజీ సక్పాల్ బంధువుల్లో ఒకాయన సంసారం మీద విసుగెత్తి సన్యాసుల్లో గలిసిపోయాడట. ఎన్నో ఏళ్లపాటు దేశదిమ్మరిగా సంచరిస్తూ మౌ గ్రామానికి రావడం సంభవించింది. ఈ వార్త తెలిసిన వెంటనే సుబేదార్ సక్పాల్ వెళ్ళి ఆ సన్యాసిని తన యింటికి ఆహ్వానించి ఎంతో గౌరవంగా సత్కరించాడట. ఆ సన్యాసి తిరిగి వెళ్ళిపోతూ గర్భవతిగా ఉన్న బీమాబాయిని జూసి ఆమెకు గలుగబోయే పద్నాలుగో సంతానమే ఆఖరు సంతానమనీ, మగశిశువు జన్మిస్తాడనీ, ఆ శిశువు పెరిగి పెద్దవాడై భవిష్యద్భారత చరిత్ర చరిత్రలో కొత్త పుటలు సృష్టిస్తాడని చెప్పాడట.

విశ్వశాంతికి వెలుగుబాట జూపిన బుద్ధ భగవానుని జననానికి పూర్వం తన మాతృమూర్తియైన మహామాయ మహత్తరమైన స్వప్నాన్ని గన్నట్టే వుందీ సంఘటన! ఆ సన్యాసి వెళ్ళిపోయిన నాటి నుండి సుబేదార్ – రాంజీ సక్పాల్ దంపతులు ఆ కలగబోయే సంతానం గూర్చి కలలుగంటూ భజన గీతాపారాయణంతో కాలం గడిపేవారు. 1891 ఏప్రిల్ 14వ తేదీన భీమాబాయి ప్రసవించింది. ఆ పుణ్యదంపతుల నోములపంటగా జన్మించిన ఆ బంగారువన్నె బాలునికి భీమ్ రావ్ అని నామకరణం చేశారు.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories