విశ్వ విఖ్యాతిగాంచిన మహాపురుషుల్లకు సంబంధించిన ఒక గ్రంధం

మహాపురుషుల్లో ఒక జీవిత చరిత్ర

విశ్వ విఖ్యాతిగాంచిన మహాపురుషుల్లో చాలామంది తమ జీవిత చరిత్రలను తామే రవించుకోగల్గారు. కాని, నిరంతర సాంఘిక, రాజకీయ పోరాటాలతో బాటు మహోన్నతమైన పదవీ బాధ్యతలతో విరామ మెరుగని మహాపురుషుడైన డా॥ అంబేద్కర్ కది సాధ్యపడలేదు. అనూహ్యమైన హఠాన్మరణానికే రానాహుతి గాకుండినట్లయితే బహుశః అది సాధ్యమై యుండేదేమో ఎవరు జెప్పగలరు? తన జీవితంపై యింతవరకు కొన్ని గ్రంథాలు వెలువడినా అవి తన జీవిత విశేషాలను పూర్తిగా ప్రతిబింబించలేకపోయాయనే నేను భావిస్తున్నాను. ఆ మహనీయుని జీవితం ఆద్యంతం గ్రంథ రూపంలోకి దేవాలంటే అందుకెన్నో వ్యయ ప్రయాసలతో గూడిన పరిశోధన జరపాల్సి వున్నది.

డా॥ అంబేడ్కర్ జీవిత విశేషాల పై ఇంతవరకు తెలుగులో ఒక్క గ్రంథమైన వెలువడి యుండలేదు. ఇదే తొలి ప్రయత్నం, కష్టసాధ్యమైన యీ కార్య నిర్వహణలో నేనెంతవరకు కృతకృత్యుడనైనది సహృదయులైన పాఠకులే నిర్ణయించవలసిన విషయం. ఎన్నో కష్టాలను, ఆర్ధిక బాధలను ఎదుర్కొంటూ యీ గ్రంథ రచన సాగించాల్సి వచ్చింది. ఆ కారణం చేతనే దాదాపు ఆరు నెలలు క్రితమే విడుదల గావలసియుండిన గ్రంథాన్నింత కాలము జాగు చేయడం జరిగింది.

ఏమైనప్పటికిని, ఏ మహావ్యక్తి అడుగుజాడల్లో పయనించేందుకై నేను ప్రజారంగంలో కడుగుబెట్టానో ఆ మహానీయుని జీవిత చరిత్రను వీలైనంత వివరంగ తెనిగించి ప్రచురించ గలిగాననే సంతృప్తి, ఆనందం నాకు లభించింది. ఈ గ్రంథ రచనలో సహకరించిన సోదరుల్లో శ్రీయుతులు దాక్కా వై. సత్యనారాయణ ముఖ్యులు. గ్రంథాన్ని అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దడంలో తోడ్పడిన చిత్రకారుడు శ్రీ డి. లాస్కరరావ్ అభినందనీయుడు. గ్రంథ ప్రచురణలో ఆర్థిక సహాయం జేసిన శ్రీయుతులు యన్ . భాస్కరరావ్, పావనమూర్తిగార్ల నీ సందర్భంలో విస్మరించలేను.

గ్రంథరచనా కాలం నుండి ఎదుర్కొన్న ఆర్థిక బాధలన్నింటిలోను పాలుపంచుకొంటూ శుద్ధప్రతులు వ్రాయడంలోను, ప్రూపులు దిద్దడంలోను తోడ్పడింది నా సహధర్మచారిణి నాగమణి . గ్రంథాన్ని ఆకర్షణీయంగా ముద్రించిన కమల్ ప్రింటర్స్ వారికి నా కృతజ్ఞతలు. – నేను వ్రాసిన యీ గ్రంథానికి పీఠిక వ్రాయవలసిందిగా కోరిన వెంటనే ఎంతో దయతో అంగీకరించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ కోకా సుబ్బారావుగారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలర్పిస్తున్నాను.

స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాం . మీరూ వస్తారా ?

స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాం . మీరూ వస్తారా ? ” అన్న గాంధేయుల పిలుపుకు సమాధానంగా ” ఎవరి స్వాతంత్ర్యం కోసం మీ పోరాటం ? స్వాతంత్ర్యమంటూ ఏర్పడితే అందులో నా ప్రజలమైన మేమిటి ? ఆ విషయం ముందు తేల్చమన్నాడు ” అంబేడ్కర్.

అందుకు సరియైన సమాధానం జెప్పలేని గాంధేయులు ” అంబేడ్కర్ స్వాతంత్ర్య వ్యతిరేకి ” అంటూ దుష్ప్రచారం | గావించారు. కమ్యూనిజం, సోషలిజం, గాంధీయిజమంటూ తికమకలతో హడలగొట్టేస్తున్నారు | ప్రజానీకాన్ని ఈ యిజాలకు , నిజాలకు మధ్య గల దూరాన్ని సహేతుకంగా కొలిచి చూపించాడు.

డా॥ అంబేద్కర్ . నిప్పులాంటి నిజాన్ని ఎదుర్కొనగల సైర్యంలేని వామపక్షీయులు “ అంబేడ్కర్ – శ్రామిక వర్గ శత్రువు ” అంటూ అభాండాలు వేశారు. or మానవతా మనుగడకు సమత చాలా అవసరం . సమత లోపించిన సమాజంలో సంక్షోభం అనివార్యమవుతుంది . సమతా సిద్ధాంతాన్ని సశాస్త్రీయంగా ప్రబోధించిన మహత్తర మానవతామూర్తి డా॥ బాబాసాహెబ్ భీమరావ్ రామ్ జీ అంబేడ్కర్.

14వ ముద్రణకు పబ్లిషర్స్మ ట

మేము అంటే పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులం కుటుంబాలతో కలిసి శ్రద్ధయాత్రను విజయవంతంగా ముగించుకొని తిరుగు ప్రయాణంలో తీసుకొన్న నిర్ణయాల్లో ‘ డా . అంబేద్కర్ జీవిత చరిత్రను మరోసారి ముద్రించాలన్నది ఒకటి ‘. సిద్ధార్థ గౌతముడు జన్మించిన లుంబిని, కపిలవస్తు, తానెక్కువ కాలం ధమ్మ బోధనలను గావించిన రాజ్యం శ్రావస్తి. ఆయన పరినిర్వాణం చెందిన కుశీనారు ప్రదేశాలను చూచి, బుద్దుడు తిరుగాడిన భూమిలో అచ్చట ప్రపంచదేశాల వారు నిర్మించిన విహారాలను, ప్రతిష్టించిన అత్యంత సుందరమైన జీవకళ ఉట్టిపడే బుద్ధుని శిలా విగ్రహాలను దర్శించి ఎంతో తన్మయత్వం చెందాము. బౌద్దాన్ని వ్యాప్తి చేయుటకు పునరకంతులమైనం.

భారతదేశంలో బౌద్ధాన్ని పునరుద్ధరించిన మహా పురుషుడు బాబాసాహెబ్ డా . బి . ఆర్ . అంబేద్కర్. అంతటి మహోన్నతమైన వ్యక్తి జీవిత చరిత్రను ప్రజలకు అందించ గలిగితే బౌద్ధంపట్ల వారు ఆకర్షితులౌతారన్న ఆశతో ఈ గ్రంథాన్ని పలుమార్లు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ( ప్రచుగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. . ). ఈ గ్రంథం మొదటి ముద్రణ 1968వ సంవత్సరంలో శ్రీమాన్ సి. పావనమూర్తి, ఎస్ . భాస్కరరావుల ఆర్ధిక సహాయంతో వెలుగులోకి వచ్చింది. తరువాత అష్టకష్టాలు పడి ఆరు ముద్రణలను వేసి అలసిపోయారు యెండ్లూరిగారు. దీనికున్న పాఠకుల ఆదరణను చూచి మేము ముద్రణా బాధ్యతలను తీసుకొన్నాం.

2001వ సంవత్సరం నుండి మేమిప్పటివరకు ఏడు ముద్రణలను పాఠకుల అందించగలిగాం. సాధారణంగా రచయితలు తమ రచనలను ప్రచురించుకోవడానికి | వారి దగ్గర పైకం ఉండదన్నది ఒక నానుడి. ఇది డా. అంబేద్కర్ కు కూడా వర్తించింది . . అద్దంపై పూర్తి అవగాహన కలుగచేసేలా ఆయన మూడు పుస్తకాలు వ్రాసారు. అది బుద్ధ అండ్ హిజ్ ధమ్మ ది రివల్యూషన్ అండ్ కౌంటర్ రివల్యూషన్ ఇన్

ఏన్సియంట్ ఇండియా 3. బుద్ధుడు – కార్ల మార్క్స్ ఇవి ఆయన బ్రతికుండగానే వెలుగులోనికి తీసుకొని రావాలనుకొన్నాడు . కాని ఆ ఆశ నేరవేరేలా లేదని గ్రహించి ఎంతో ఆవేదనకు గురైనాడు. కనీసం మొదటి పుస్తకాన్నైనా ముద్రిద్దాం అని అనుకొన్నాడు ఇరవై వేల రూపాయలు అంచనా! అంత డబ్బు ఆయనవద్ద లేదు. 9 సంవత్సరాలు కేంద్రమంత్రి పదివిలో ఉన్నా ఓ ఇరవైవేల రూపాయలు వెనకేసుకోలేకపోయాడు పాపం! సిన్సియారిటీగా బ్రతికేవాళ్ళు సంపాదించలేరు కదా! మరి యెండ్లూరి గారు | తన స్నేహితులు చేసిన వాగ్దానాలతో ఉన్న ఉద్యోగానికి రాజీనామాచేసి, వారి వాగ్దానాలు భంగంకాగా జీవన సమరంలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవిస్తూ అలసిపోయిన తరుణంలో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ముందుకొచ్చి పాఠకులకు భరోసా యిచ్చింది.

నిజానికి పావనమూర్తిగారు చేసిన సూచన వల్లనే ఈ సంస్థను స్థాపించడం జరిగింది. | ఈ ముద్రణకు ఆర్థిక సహకార మందించిన శ్రీయుతులు సి. హెచ్. శ్రీరాము మూర్తి , ( అధ్యక్షులు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ), కె . కె . రాజా ( ప్రముఖ అంబేడ్కరీయులు ) , ఎస్ . ఎస్ . ఆర్ . భూపరి ( కార్యదర్శి అదుర్రు బుద్ధ విహార ట్రస్టు ) , రాడి సురేష్ ( అధ్యక్షులు తాడి శ్రీరామమూర్తి మెమోరియల్ ట్రస్టు ) యస్ . చంద్రయ్య ( జాతీయ అధ్యక్షులు | సమతా సెనిక్ దళి ) , వి . రాఘవేంద్రరావు ( ఛైర్మన్ , అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ , విశాఖపట్నం ) , ఆర్ . సుబ్బారావు , ఐ . ఏ . ఎస్ . ( స్పెషల్ ఆఫీసర్ ఎస్ . సి . , ఎస్ . టి . కమీషన్ | సి . హెచ్ . సుబ్బారావు ( అసిస్టెంట్ జనరల్ మేనేజర్, టెలిఫోన్స్, రాజమండ్రి ) ఇంకా శ్రీయుతులు బి . వెంకటయ్య స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ , బి . గౌతంప్రసాద్ , ( సీనియర్ సివిల్ జడి ) – ఎస్ . వెంకటేశ్వర్లు , ( ఉస్మానియా మెడికల్ కాలేజ్ ) ధమ్మమిత్ర రవీంద్రుడు , ఎం , ఉదయ భాస్కర్ ( జనరల్ మేనేజర్ ), కె . బాలకృష్ణ ( జనరల్ మేనేజర్ | హెచ్ . ఎ . ఎల్ . బెంగుళూరు ) గార్లు అందిస్తున్న సహాయ సహకారాలే లేకుంటే ఇన్ని ముద్రణలు తీసుకొని వచ్చి ఉండేవారు కాదు. వారందరికీ హృదయపూర్వక జైభీములు.

డా ॥ అంబేద్కర్ జీవిత చరిత్రకు పీఠిక వ్రాసే మహదవకాశం నాకు లభించడం

డా ॥ అంబేద్కర్ జీవిత చరిత్రకు పీఠిక వ్రాసే మహదవకాశం నాకు లభించడం గౌరవప్రదమైన సత్కారంగా భావిస్తున్నాను. ప్రప్రథమంగా డా ॥ అంబేద్కర్ వంటి మహనీయుని జీవిత విశేషాలను నేటి తరం వారికే గాక భవిష్యత్తరాల వారికి సైతం వుపలభ్యమయ్యే విధంగ శ్రవస్సుఖమైన తెలుగులో అరాచిత్రణ జేయగల్గిన గ్రంథకర్త శ్రీ యెండ్లూరి నీ సందర్భంలో అభినందించడం సముచితం. ఈ గ్రంథ రచన ద్వారా తాను గొప్ప ప్రజా సేవ చేసినవాడైనాడు. అన్యధా కోల్పోవలసియుండిన ఆ మహనీయుని జీవితానేక విశేషాలను గ్రంథకర్త తన పరిశోధన , అవిరళకృషి ఫలితంగ భావి తరాలవారికి సంతరించి పెట్టగలిగాడు.

ఒకానొక అస్పృశ్య కుటుంబము నందు జన్మించి , ఆ కలుషచ్చటతో పెరిగి , పేదరికపు వారల ననుభవించి , విద్యాశాలల్లోను , కార్యాలయాల్లోను అవమానాలకు గురై , సంఘంచే బహిష్కరించబడి కేవలం తన అజేయమైన ధైర్యసాహసాలతోను , ఏకాగ్ర చిత్తంతో గూడిన మేధాసంపత్తితోను మహోన్నత స్థాయి నందుకోగల్గిన వ్యక్తి డా ॥ అంబేద్కర్ . అంతటి మేధాశక్తి సంపన్నులు కాని మరెవ్వరైన బలీయమైన విధి కాహుతై యుండేవారే . ఆ మహనీయుని జీవిత విశేషాలను క్రమబద్ధమైన పద్దతిలో కళ్ళకుగట్టేలా వివరించి వ్రాయగల్గిన గ్రంథకర్త డా॥ అంబేడ్కర్ యొక్క యావజ్జీవితానుచరుడేమోనన్న భావన గల్గించగలిగాడు.

ఒక మహాపురుషుని

ఒక మహాపురుషుని అనన్య సామాన్యమైన ఆదర్శ ప్రభావం సామాజికపు నడవడికపై తప్పక పనిజేస్తుంది. అట్టి మహనీయుని ఆదర్శ జీవిత చరిత్ర యువజన మేధస్సు నుత్తేజపరచి ముందుకు నడిపించుటయే గాక ఆ మహనీయుని మహద్గుణాలను మననం జేయడం ద్వారా అతని విజయ రహస్యాలను గ్రహింప శక్యమౌతుంది. సునిశితమైన మేధాశక్తి సంపన్నుడు డా ॥ అంబేద్కర్ , సాంఘిక , ఆర్థిక , రాజకీయ సమస్యలపై తాను రచించిన పరిశోధనా గ్రంథాలే అందుకు ప్రభల నిదర్శనములు , నిరంతర పరిశోధనా కృషి తన మేధస్సును మరింత ప్రభావితం చేసింది. అతని విషయ పరిజ్ఞానమెంత విశాలమో అంత అపారమైనది. పాండితీ ప్రతిభలతో పాటు రాజకీయ దురంధత సైతం ఒకే వ్యక్తిలో తారసిల్లడం అరుదైన విషయం.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories