అంబేద్కర్ విశ్వాసం మరియు ఆలోచనా దృక్పథం

అంబేద్కర్ఆ లోచనా దృక్పథం

మానవుడు మానవాతీతుడు (Superman) గా మారేందుకు కష్టాలు నిచ్చెన మెట్ల లాంటివని డా. అంబేద్కర్ విశ్వాసం. అందుకు తన నిజజీవితమే ప్రబల నిదర్శనం. తాను రెండేళ్ళు బాలుడుగా ఉన్నప్పుడే తన తండ్రి రాంజీ సక్పాల్ మిలిటరీ ఉద్యోగం నుండి రిటైరై భార్యాపిల్లలతో సహా బయల్దేరి మహారాష్ట్ర దేశం విచ్చేసి సతారా పట్టణం వద్ద ఒక చిన్న ఉద్యోగంలో స్థిరపడ్డాడు.

సంపాదన తగ్గిపోవడంతో సంసారంలో కష్టా లెక్కువయ్యాయి. భీమ్ రావ్ ఆరేళ్ల వయస్సు బాలుడై ప్రాథమిక పాఠశాలలో ప్రవేశించే తరుణంలో తల్లి భీమాబాయి మరణించింది. ఆ మహాసాధ్వి మరణించే నాటికి తన పద్నాలుగురు సంతానంలోను మిగిలినవారు ముగ్గురు కొడుకులు, యిద్దరు కుమార్తెలు మాత్రమే! పెద్ద కుమారుడి పేరు బలరామ్, రెండవ కుమారుని పేరు ఆనందరావ్, ఆ తరువాత మంజుల, తులసి అనే యిద్దరు కుమార్తెలు. ఆఖరు బాలుడు భీమ్ రావ్. తల్లి మరణించే నాటికే యిద్దరు కుమార్తెలకు పెండ్లిండ్లి అత్తవారిండ్ల కెళ్ళిపోయారు. కాని తల్లి మరణాంతరం ఆ కుమార్తెలిద్దరూ ఒకరి తరువాత ఒకరుగా వచ్చి యిల్లు చక్కబెట్టూ పసిబాలుడైన భీమరావ్ విషయంలో తల్లిలేని లోటు దీర్చేవారు. తన ధర్మపత్ని భీమాబాయి. మరణంతో రాంజీ సక్పాల్ మరీ ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయాడు. తన పిల్లల్ని ముందు గూర్చోబెట్టుకొని భజనగీతాలను పాడుతూ వారిచేత పాడిస్తూ ప్రొద్దుబోయ్ వరకూ కాలం వెళ్ళబుచ్చేవాడు. మళ్ళీ వేకువజామునే నిద్రలేపి పిల్ల లందరికీ స్నానాలు చేయించి తాను కాలకృత్యాలను దీర్చుకొని మళ్ళీ భజన గీతాలను ప్రారంభించేవాడు. ఈ భజనల వల్ల ముక్తి ప్రభావం మాట ఎలా ఉన్నా పిల్లల్లో మంచి క్రమశిక్షణ, సత్ప్రవర్తన ఏర్పడిన మాట వాస్తవం. భజన గీతాలు పూర్తికాగానే పిల్లలచేత ఎక్కాలు, పాఠాలు కంఠస్తం జేయించేవాడు. గోపాలకృష్ణ గోఖలే పండితుడు రచించిన లెక్కల పుస్తకంలోని లెక్కలన్నీ తన కుమారులకు నేర్పించి లెక్కలపై వారికి మంచి ఆసక్తిని గలిగింపజేశాడు.

రాంజీ సక్పాల్ తాకాహారి. ప్రభుత్వ వ్యవహారాల్లోను, ప్రత్యేకించి మహార్ కులస్థులకు సంబంధించిన వ్యవహారాల్లోనూ ఎక్కువ ఆసక్తి చూపేవాడు. బ్రిటిష్ ప్రభుత్వంవారు మహర్ కులస్థులను మిలటరీలో వర్చుకోవడం మానివేసినపుడు రామ్ సక్పాల్ ఎంతో ప్రయాసతో వెళ్ళి మహదేవ గోవింద రానదే మహనీయుణ్ణి గలసికొని పరిస్థితులు వివరించి తన సహాయంతో ఒక పెద్ద మహజరు తయారు జేయించి దానిని తానే స్వయంగా తీసికెళ్ళి బొంబాయి గవర్నరును గలసికొని మహర్ వంశస్థుల స్థితిగతులను వివరించి మహజర్ సమర్పించాడట. తండ్రిలోని జాతీయావేశం, పట్టుదల, కార్యదీక్షలాంటి మహర్షుణులన్నీ కుమారుడైన భీమ్ రావ్ కల్చినవి.

అంబేద్కర్ – విద్యార్థి జీవితం

భీమరావ్ ప్రాథమిక విద్యను పూర్తి చేసి హైస్కూల్ విద్యలో ప్రవేశించాడు. వయసు పెరుగుదలతోపాటు ప్రపంచజ్ఞానం గూడ పెరుగసాగింది. వాస్తవ ప్రపంచంలోకి అడుగు బెట్టగానే తనకు తెలియవచ్చిన తొలి విషయం అంటరానితనం, తానొక అస్పృశ్యుడని సమాజంలో తనకున్న హక్కులు చాలా పరిమితమైనవనీ తెలుసుకొనేందుకు తనకా శైశవా వస్థలోనే గుండెల్ని పిండే సంఘటనలు ఒకదాని తరువాత ఒకటిగా జరిగాయి. ఒకనాడు భీమ రావ్ తన సోదరుడితో గలిసి దూర గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. సగం దారిలో భీమ్ రావు విపరీతంగా దాహం వేయసాగింది . కొంతదూరంలో వారికొక యిల్లు కనిపించడంతో వారిలో ఎక్కడలేని ఆనందం గల్గినది. కాని తీరా ఆ యింటి వద్ద కెళ్ళి గేందుకు నీళ్ళడిగితే ఆ సంపన్న గృహస్తు వారి కులమేమిటో విచారించి మహర్ కులస్థులని తెలియగానే కోపంతో ఆ ప్రక్కనే వున్న మురికి గుంటలోని నీటిని త్రాగమన్నాడట. దాహతాపంతో తపించిపోతున్న ఆ బాలకులు అలాగే ప్రయాణం సాగించారట. కొంత దూరం వెళ్ళగా వారికొక ఎద్దుబండి కన్పించిందట. ఆ బండివాడితో బేరమాడి ఆ బండిలో ప్రయాణం సాగించారట. కాని కొంత దూరం వెళ్ళగానే ఆ బండివాడు ఆ బాలకుల కులమేమిటని అడిగాడట. మహర్ కులస్తులని తెలియగానే ఆ బండివాడు చెప్పలేని ఆగ్రహంతో ఆ కుర్రవాళ్ళిద్దర్నీ ఒక్క తోపుతో బండిలో నుండి క్రిందకు త్రోశాడట. ఒక వైపు తీరని దాహం. మరోవైపు సహించరాని అవమానం. వీటితో ఆ పసి ప్రాణాలు సొమ్మసిల్లిపోయాయి . అయినా ఎంతో సహనంతో బండిబాడుగ రెండింతలిచ్చుకొని, బండెలాగూ మైలబడిపోయింది గనుక ఆ బండిని వారే తోలుకెళ్చేటటు ఆ బండివాడు వెనక బండికి దూరంగా పరుగెట్టేటట్టు ఒప్పందం చేసికొని ఆ విధంగా ప్రయాణం సాగించారట . వాస్తవ జీవితంలో ప్రవేశించిన భీమ్ రావ్ కది మొట్టమొదటి దెబ్బ.

స్కూల్లో విద్యార్థులంతా బెంచీల పై కూర్చొని పాఠాలు నేర్చుకొంటూంటే భీమ్ రావ్ స్కూలు వెలుపల కటికనేలపై కూర్చొని పాఠాలు నేర్చుకోవలసి వచ్చేది . కాని చదువులో చాలా చురుకుగా వుండడం వల్ల భీమరావంటే ఆ ఉపాధ్యాయుడి కెక్కువ వాత్సల్యం. ఆ వాత్సల్యంతోనే భీమరావ్ యింటి పేరైన అంబవాడ్కరను తన యింటి పేరైన అంబేడ్కర్ గా సవరించాడు . అంతేగాకుండా రోజూ ఉపాధ్యాయుడు తనకై తెచ్చుకొన్న భోజనంలో కొంత భీమ్ రామ్ కు బెట్టేవాడట. ఒకనాడా ఉపాధ్యాయుడొక లెక్క యిచ్చి ఆ లెక్కను బోర్డు మీద వేసి చూపాల్సిందిగా విద్యార్థులలో ఒక్కొక్కర్నే అడిగాడట. కాని ఆ లెక్క ఎవ్వరు జేయలేకపోయిన భీమ్ రావ్ జేయగలడని ఆ ఉపాధ్యాయుడికి తెలుసు. అందుకనే ఆఖరుసారిగా భీమ్ రావ్ ని పిలిచి ఆ లెక్కను బోర్డు మీద వేయమన్నాడట. భీమ్ రావ్ ఎక్కడలేని సంతోషంతో బోర్డు సమీపించగానే ఆ క్లాసులోని పిల్లలంతా తన భోజనాలను ఆ బోర్డు వెనకాలే దాచి పెట్టామనీ భీమ్ రావ్ ఆ బోర్డు తాకినట్లయితే ఆ బోర్డు వెనకాలి తమ భోజనాలు మైలబడిపోతాయని గట్టిగా గోలజేయనారంభించారట. భీమ్ రావ్ తన హీన పరిస్థితికి విచారిస్తూ తిరిగి తన స్థానంలో కెళ్ళి కూర్చొన్నాడట. భీమ్ రావ్ దీనస్థితికి ఉపాధ్యాయుడు సైతం ఎంతో కుమిలిపోయాడు. సాంప్రదాయాన్ని ధిక్కరించి తన ఉద్యోగాన్ని బోగొట్టుకునే స్థితిలో ఆ ఉపాధ్యాయుడు లేడు పాపం. భీమ్ రావ్ భవిష్యత్తుపై ఆ ఉపాధ్యాయుని కెక్కడలేని విశ్వాసముండేదట. అది వృధాబోలేదు. భీమ్ రావ్ పెరిగి పెద్దవాడై వివిధ విశ్వవిద్యాలయాల నుండి పట్టభద్రుడై యావద్భారత నిమ్నజాతుల నాయకుడిగా లండన్ నగరంలోని రౌండు టేబిల్ సమావేశంలో పాల్గొంటూ అక్కడినుండి ఎంతో ఆదరాభిమానాలతో కృతజ్ఞతా గౌరవాలతో తన చిన్ననాటి ఉపాధ్యాయునికి లేఖ వ్రాసినప్పుడు ఆ ఉపాధ్యాయుని ఆనందాని కవధుల్లేవు. ఆనందబాష్పాలతో ఆ ఉపాధ్యాయుడు వ్రాసిన జవాబును అంబేడ్కర్ ఒక అమూల్యమైన వస్తువుగా తన జీవితాంతం దాచుకొన్నాడట.

పిల్లలు పెరిగి వృద్ధిలోనికొస్తున్న తరుణంలో భీమ్ రావ్ తండ్రి రామ్ జీ సక్పాలకొక దుర్బుద్ధి పుట్టింది. ఉన్నట్టుంది ఒకానొక ముహూర్తాన రెండవ వివాహం చేసికొన్నాడు. తన తల్లి స్థానాన్ని వేరొక స్త్రీ ఆక్రమించడం భీమ్ రావ్ సహింకలేకపోయాడు. ఆ సవతి తల్లిని జూస్తేనే భీమ్ రావు ఒళ్ళు కంపరమెత్తేది. దీనితో అతనికి చదువు మీద గూడ విరక్తి గల్గింది. ఇంటి నుండి పారిపోవాలనే నిర్ణయానికి గూడ వచ్చాడు. ఎక్కడికైనా వెళ్ళాలంటే చార్టీ డబ్బులు రావాలి. ఈ చార్జీ డబ్బులు కోసం కొన్ని రోజులు సతారా రైల్వే స్టేషన్ లో కూలికి మూటలు గూడ మోతాడు. ఒకనాడు తన మేనత్త కంటబద్ధంతో, ఆమె మందలించి యింటికి తీసుకెళ్ళింది. భీమ్ రావ్ పై ఆమెకెంతో వాత్సల్యం. వృద్ధిలోనికి రావలసిన బాలుడావిధంగా తయారవడం ఆమెకెంతో ఆవేదన గల్లించింది. బొంబాయిలోని నూలు మిల్లుల్లో చిన్న పిల్లలగూడ కూలీ దొరుకుతుందని భీమ్ రా వెలాగో తెలుసుకోగల్గాడు. ఎలాగైనా బొంబాయి జేరాలనే నిర్ణయంతో ఒక రోజు రాత్రి మెల్లగా వెళ్ళి తన మేనత్త చీర చెఱుగులో దాచుకొన్న వక్కల సంచీ దొంగిలించాడు. వక్కలతోబాటు చిల్లర డబ్బులు గూడ ఆమె ఆ సంచిలోనే దాచుకొంటుందని భీమ్ రామ్ కు బాగా తెలుసు. కాని ఆ రోజు తీరాజూస్తే ఆ సంచిలో ఉన్నవి కొన్ని పైసలు మాత్రమే! వీటితో తాను బొంబాయి జేరడం సాధ్యంగాదు. ఇలా ప్రయత్నం మీద ప్రయత్నం విఫలం కావడంతో విసిగి పారిపోవాలనే ప్రయత్నం విరమించి చదువుపై శ్రద్ధ జూపసాగాడు. ఏ విధంగానైన స్కూల్ ఫైనల్ పాసైతే తన తండ్రికి, సవతి తల్లికి దూరంగా వెళ్ళి ఏ గుమాస్తా ఉద్యోగమో చేసికొంటూ బ్రతకొచ్చుననే ఉద్దేశంతో చదువుపై దృష్టి కేంద్రీకరించాడు. ఈ నిర్ణయమే భారతదేశ చరిత్రలో నూతన పుటలు సృష్టింప జేసింది. క్లియోపాత్ర ముక్కు కాస్త వంకరగా ఉండి వుంటే ప్రపంచ చరిత్ర మరో విధంగా ఉండి ఉండేదని చరిత్రకారులు చమత్కరి స్తుంటారు. భీమ్ రావ్ కా రోజు రాత్రి వక్కల సంచిలో కొన్ని పైసలకు బదులు కొన్ని రూపాయలే కనబడి వుంటే బొంబాయి పారిపోయి ఏ నూలుమిల్లులోనో కూలీగా స్థిరపడి ఉండేవాడు. తను పారిపోవడానికి జేసిన ప్రయత్నాల్లో ఏ ఒక్కటి ఫలించి వుండినా నవభారత చరిత్ర మరోలా ఉండి ఉండేది.

చదువుపై దృష్టిని కేంద్రీకరించిన భీమ్ రావ్ ప్రతి యేటా మంచి మార్కులో ఉత్తీర్ణుడౌతూ వచ్చాడు. కొంతకాలానికి రామ్ జీ సక్పాల్ బొంబాయికి మకాం మార్చి పరేల్ వద్ద వున్న కార్మికవాడలో ఒక చిన్న గది అద్దెకు తీసికొని అందులో కాపురం పెట్టాడు.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories