డా॥ అంబేడ్కర్ అమెరికాలో గడిపిన కొద్ది రోజుల్లో జరిగిన సన్నివేశాలు

ఆ రోజుల్లో అమెరికాలో మకాం బెట్టివున్న లాలా లజపతం గదర్ పార్టీని స్థాపించి తద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని హడలగొడ్తుండేవాడు. డా॥ అంబేడ్కర్ అమెరికా నుండి సరాసరి లండన్ రావడంతో తాను గదర్ పార్టీ సభ్యుడేమోనన్న అనుమానం బ్రిటిష్ వారికి గల్గింది. అందుకే తాను లండన్ హార్బర్‌లో అడుగుబెట్టగానే పోలీసులు చుట్టుముట్టి పెట్టె వగైరా విప్పించి సాంతం సోదా చేయసాగారు. కాని తన పెట్టెలో కొన్ని పుస్తకాలు బట్టలు మినహా మరే విధమైన రాజకీయ రహస్యాలు వారికి కన్పించక పోవడంతో ఆ పోలీసులు తిరిగి వెళ్ళిపోయారు. నిజానికి డా॥ అంబేద్కర్ అమెరికాలో వుండగా లాలా లజపతిరాయ్ తనను చాలాసార్లు కలుసుకొని గదర్ పార్టీలో చేరాల్సిందిగా కోరాడు. తాను విద్యార్థి దశలో వుండగ రాజకీయాల్లో ప్రమేయం పెట్టుకోవడం సాధ్యంగాదనీ, పైగా తాను బరోడా మహారాజు యిచ్చే ఉపకారవేతనంతో చదువు కొనసాగిస్తూన్నానని, తాను తన కాలమంతా విద్యాభ్యాసానికి వినియోగిస్తానని మహారాజాకు మాట యిచ్చాననీ తెలియజెప్పాడు.

మొదటి భాగం:

విద్యాభ్యాసం కోసం యింత దూరం వచ్చి చదువు ప్రక్కకు నెట్టి రాజకీయాల్లో పాల్గొంటే తనపై విశ్వాసముంచి వుపకార వేతన మిస్తున్న మహారాజాను, తనపై గంపెడాశతో ఎదురుచూసే తన భార్యాబంధువులను దగా జేసిన వాజ్ఞవుతానని గూడ ‘ అంబేడ్కర్ జెప్పడంతో లాలా లజపతిరాయ్ తన ప్రయత్నాన్ని విరమించుకొన్నాడు. లండన్ నగరం జేరగానే డా॥ అంబేడ్కర్ గ్రేస్ ఇ లో ప్రవేశించి న్యాయశాస్త్రాన్ని, హెరాలు లాస్కీ పాఠశాలలో ఆర్ధిక రాజకీయ శాస్త్రాలను అభ్యసించసాగాడు. ఒకేసారి బారిష్టర్ పట్టాకు, ఎం.యస్.సి. పట్టాకు చదవవలసియున్నది. లాస్కీ పాఠశాలలోని ప్రొఫెసర్లు డా॥ అంబేడ్కర్ యొక్క ఆర్థిక , రాజకీయ పరిజ్ఞానాన్ని పరీక్షించి తనలో యం.యస్.సి. పట్టాకు గావలసిన జ్ఞానం కంటే ఎక్కువే వున్నదనీ తానిక యం.యస్.సి.కృతార్థుడైనట్టే లెక్కించి డి.యస్.సి. (ఆర్ధిక రాజకీయ శాస్త్రాల్లో డాక్టరేటు పట్టాకు చదువ వలసిందిగా) ప్రోత్సహించారు. ఈ డి.యస్.సి. పట్టా పొందాలంటే తానెంతో కృషి చేసి – మరో పరిశోధనా గ్రంథం వ్రాయాల్సుంది. దానికై తీవ్రంగా కృషి మొదలెట్టాడు. తెల్లవారు. ఝామునే నిద్ర లేచి స్నానాదిక్రియలు పూర్తి జేసుకొని బ్రిటిష్ మ్యూజియమ్ లైబ్రరీకి వెళ్ళేవాడు. ఇక రాత్రి ఎనిమిది గంటల వరకు అపార గ్రంథ పఠనం కొనసాగించేవాడు. ఈ విధంగా కృషి జేస్తుండగ వున్నట్టుండి బరోడా సంస్థానం నుండి పిడుగులాంటి వార్త వచ్చింది.

తన చదువుకై కేటాయించబడ వుపకార వేతనం పూర్తైపోయిందని, కాబట్టి చదువుకు స్వస్తి జెప్పి వున్న పళంగా బయల్దేరి వచ్చి బరోడా సంస్థానంలో ఉద్యోగిగా జీరాల్సిందని ఆ వర్తమానంలో స్పష్టం జేయబడి వున్నది. అసలీ తాకీదును డా॥ అంబెద్కరకు పంపిన విషయం మహారాజుకు తెలియనే తెలియదు. ఇదంతా బరోడా సంస్థానంలోని, బ్రాహ్మణ మంత్రిగారు జరిపిన తతంగమే! ఏమైనప్పటికీ తాకీదు ప్రకారము సాగిస్తున్న చదువు మధ్యలోనే ఆపివేసి స్వదేశానికి ప్రయాణం గట్టాడు అంబేడ్కర్. లండన్ చదువులు అనుకోని విధంగా మధ్యలో ఆగిపోయినా తనకు వీలైనప్పుడు తిరగివచ్చి చదువుపూర్తి జేసేందుకు లండన్ విశ్వ విద్యాలయంలోని ప్రొఫెసర్లంగీకరించారు. ఈ సదుపాయం కొంతవరకూ తనకు వుపశమనం గలించింది. తాను కైజర్ – ఎ – హింది అనే నావలో బయల్దేరి, స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు తన కుటుంబీకులకు కేబిల్ ద్వారా వార్త నంపాడు. తాను బయల్దేరిన నావ మార్గమధ్యంలో వుండగా లండన్ నుండి బయల్దేరిన ఒకానొక నౌక సముద్రంలో మునిగిపోయినట్లు బొంబాయిలోని తన కుటుంబీకులకు వార్త అందింది. డా॥ అంబేడ్కర్ బయల్దేరి వస్తున్న నావ అదేనేమోననే ఆందోళనతో యింటిల్లపాదీ తల్లడిల్లిపోయారు. అంబేద్కర్ సతీమణి తీరని మనోవేదనతో నిద్రాహారాలను పూర్తిగా మాని కేవలం తులసీతీర్ణంతోనే రోజులు వెళ్ళబుచ్చసాగింది. డా॥ అంబేడ్కర్ ప్రయాణం జేస్తున్న ఓడ క్షేమంగా వున్నట్లు మరో వార్త అందడంతో ఆ యింట్లో తిరిగి దీపం వెలిగింది.

రెండవ భాగం:

ఆ మునిగిపోయిన ఓడలో డాక్టర్ అంబేద్కర్ ఎంతో వ్యయప్రయాసలతో సేకరించిన పుస్తకాల పార్సెల్ వుండిపోయింది. మునిగిపోయిన పార్సెల్ కు కంపెనీవారు నష్ట పరిహారమిచ్చినా అమూల్య గ్రంథాలన్నీ నీటిపాలైనందుకు డా॥ అంబేడ్కర్ చాలా బాధపడ్డాడు. ఓడల కంపెనీ వారిచ్చిన నష్టపరిహారం గడ్డు రోజుల్లో కుటుంబ ఖర్చులకు కలిసి రావడమే గాకుండా బరోడా ప్రయాణం గూడ దానితోనే జరిగింది. డా॥ అంబేడ్కర్ బరోడా సంస్థానంలో ఉద్యోగం కోసం బయల్దేరి వస్తున్నాడన్న వార్త విని మహారాజు చాలా సంతోషించి స్టేషన్ లోనే కలుసుకొని కారులో సంస్థానానికి దీసుకురావలసిందిగా ఆసానో జ్యోగులకు చెప్పాడు. కాని డా॥ అంబేద్కర్‌ను స్టేషన్లో కలిసేందుకు ఏ ఉద్యోగి వెళ్ళలేదు. ఒక సంస్థానానికి ఉన్నతోద్యోగిగా వస్తున్న వ్యక్తికి జరుగవలసిన మర్యాదలు జరిపేందుకు కిదేమీ అమెరికా, ఇంగ్లాండు దేశాలుగావు.

కులతత్వంతో కుళ్ళి దుర్గంధించే పవిత్ర భారతదేశం. బరోడా స్టేషన్లో రైలు దిగిన అంబేడ్కర్ పెట్టెబేడా చంకన సర్దుకొని కాలినడకన బయల్దేరి సంస్థానానికి వచ్చాడు. ఒకానొక అస్పృశ్యుడు వున్నతోద్యోగిగా వస్తున్న వార్త అప్పటికే బరోడా సంస్థానమంతా పొక్కిపోయింది. డా॥ అంబేద్కరను రక్షణశాఖ మంత్రిగా నియోగించే వుద్దేశంతో తరిఫీదు కోసం ముందు రక్షణశాఖ కార్యదర్శిగా నియోగించాడు. మహారాజా శాయాజీరావ్. రక్షణశాఖ కార్యదర్శి క్రింద ఎంతో మంది ఉపకార్యదర్శులు, గుమస్తాలు, నౌకర్లు, చాకర్లు వున్నారు. కాని వారెవ్వరూ తనని గౌరవభావంతో జూడక యీసడింపు దృష్టితో జూడ నారంభించాడు. ఆఖరుకు బంట్రోతు గూడ ఫైళ్లను దెచ్చి, దూరంగానే వుండి అంబేడ్కర్ బల్లపై గిరవాటేయడం ప్రారంభించాడు. సంస్థానంలో నౌకర్లు జూపుతున్న నిర్లక్ష్య ధోరణికి తన ఆత్మాభిమానం ఎంతో గాయపడింది. కాని తన భవిష్యత్తును తీర్చిదిద్దిన మహారాజు పై గల గౌరవం కొద్దీ అన్ని అవమానాలనూ దిగ మ్రింగి రోజులు గడపజొచ్చాడు.

అమెరికా నుండి తిరుగు ప్రయాణంలో జరిగిన జరిగిన విశేషాలు

ఉద్యోగంలో ఎలాగో సర్దుకుపోగలిగినా వుండేందుకు యిల్లు జిక్కకపోవడంతో సతమతమైపోయాడు. ఎంత రక్షణశాఖ కార్యదర్శియైనా-హిందువుల దృష్టిలో తాను అస్పృశ్యుడే! ఇక అస్పృశ్యుడికి హిందువుడెవ్వడు యిల్లు అద్దెకివ్వడు. ఆఖరుకు ఒక పార్సీవాని సత్రంలో మకాం బెట్టాడు. కాని తాను అస్పృశ్యుడన్న సంగతి ఆ పార్సీవానికి గూడ తెలియవచ్చింది. దానితో ఆ పార్సీవాడు క్రుద్దుడై లారీ కర్రలతో ఒక అరడజను మందిని వెనకేసుకొచ్చి డా॥ అంబేద్కర్ పెట్టి బెడ్డింగు విసిరి నడివీధిలో పారవేయించాడు. అదేమిటని అంబేద్కర్ అడిగేలోగానే తననూ మెడబెట్టి సత్రం బైటకి గెంటి నానా దుర్భాషలాడాడు. జరిగిన అవమానభారంతో పెట్టే బేడ నెత్తిన బెట్టుకొని ఒక చెట్టు క్రింద కూర్చొని భోరున ఏడ్చాడు. కొలంబో విశ్వ విద్యాలయ డాక్టరేటు పట్టభద్రుడు, బరోడా సంస్థాన రక్షణ శాఖా కార్యదర్శి అయిన అంబేడ్కర్ కు చెట్టునీడే గతైంది. తన పరిస్థితిని బరోడా మహారాజుకు తెలియజేశాడు. మహారాజుగూడ తన అసహాయ, స్తితినే తెలుపడంతో యిక గత్యంతరం లేక ఉద్యోగానికి రాజీనామా యిచ్చి బొంబాయి బయల్దేరాడు. బరోడా సంస్థానంలో తనకు జరిగిన అవమానంతో తన హృదయంలో కోటి అగ్ని పర్వతాలు బ్రద్దలైనవి.

తాను చదివిన చదువు గడించిన విజ్ఞానం, వ్రాసిన పరిశోధనా గ్రంథాలు, అధించిన ప్రపంచ ఖ్యాతి బరోడా సంస్థానంలో ఒక హిందూ బంట్రోతు ముందు ఎందుకూ గారగాకుండా బోయినవి. తనలోని నాగరికతా సంస్కృతులు ఒకనాడ పార్సీవాని ముందెందుకు పనికిరాకుండా బొయినవి. ఇదేమి మాతృదేశం? ఇదేమి ఆదరణ? లోగడు విద్యారి దశలో ఎన్నో విధాలుగా అవమానాలకు గురై వున్నాడు. కాని యింత వయసాన్ని, యిన్ని విద్యలు నేర్చి, ఉన్నతోద్యోగంలో వున్నా తనపై హిందూ సమాజం కొనసాగిస్తున్న మో ఘోర హింసాకాండను సహించలేకపోయాడు. ఆనాటితో హిందూ మతంపైన, దాని కులతత్వ సాంప్రదాయాల పైన ఎక్కడలేని అసహ్యం, ద్వేషం ఏర్పడిపోయింది. ఆనాటి నుండే హిందూమతాన్ని తన బద్ధ శత్రువుగా జూడసాగాడు. ఏనాటికైనా యీ హిందూ మతంపై దెబ్బ తీసి తన కక్షను సాధించి తీరాలనే దృఢ నిర్ణయం ఏర్పడింది. ఆనాడు తాను దీసికొన్న యీ నిర్ణయం వల్ల కొంతకాలానికి హిందూ మతానికి బెట్టిన గతేమిటో ముందు ముందు తెలియవస్తుంది. హోం రూల్ ఉద్యమం 1917వ సంవత్సరారంభం నాటికి రాజకీయాలు చాలా తీవ్రరూపం దాల్చాయి. భారత దేశానికి స్వయం పరిపాలనాధికారం యివ్వాలంటూ అనీబిసెంటు నాయకత్వాన హోంరూలు ఉద్యమం వారు, అఖిలభారత కాంగ్రెసు సంస్థవారు బ్రిటిషు ప్రభుత్వంపై ఒత్తిడిదెచ్చారు. 1917 ఆగస్టు 20వ తేదిన బ్రిటిష్ ఇండియా కార్యదర్శి మాంటేగు ఇంగ్లండులోని కామన్సుసభలో ప్రసంగిస్తూ భారతదేశానికి స్వయం పరిపాలనాధికారం యివ్వను న్నట్లు ప్రకటించాడు. ఆ తరువాత భారతదేశంలో కొన్ని రాజకీయ సంస్కరణలు ప్రవేశ పెట్ట బడ్డాయి. వీటినే మాంటేగు – చెమ్ ఫర్డ్ సంస్కరణలని చరిత్రలో పిలువబడ్డవి. ఈ మాంటేగు చెమ్స్ ఫర్ సంస్కరణల ప్రకారం భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వ యాజమా న్యాస వుంటూనే స్వయం పరిపాలన కొనసాగించే అవకాశం లభించింది.

చివరి ఘట్టం

ఆనాటి భారత రాజకీయాల్లో కాంగ్రెసు, ముస్లింలీగు యీ రెండే రాజకీయ శక్తులుగా పనిచేస్తుండేవి. మాంటేగు – చెమ్స్ ఫర్డ్ సంస్కరణలు ప్రకటించగానే కాంగ్రెసు – ముస్లింలీగు కలిసి ఒప్పందాని కొచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం హిందువులు మహమ్మదీయులు కలసి భారతదేశంలో స్వయం పరిపాలన కొనసాగిస్తారు. మరి భారతదేశ జనాభాలో ఐదవ వంతున్న అస్పృశ్యుల మాటేమిటి? వారి విషయమై హిందువులుగాని, మహమ్మదీయులు గాని ఏ మాత్రం ఆలోచించలేదు.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories