డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి రాజకీయ ప్రస్థానం బాల్యం బార్ యొక్క క్లుప్త వివరణ

డా॥ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మించడంలో అతని యొక్క పాత్ర కోసం విపులంగా వివరించబడింది ప్రతి విషయానికి ప్తంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి వేరు వేరు ఆర్టికల్ ద్వారా వివరించాము ప్రతి దాని యొక్క లింకు కింద పొందుపరచబడింది.

డా॥ అంబేడ్కర్ నిష్కళంకమైన దేశభక్తుడు. తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో దేశ స్వాతంత్ర్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు. అస్పృశ్యుల విమోచనోద్యమంలో దుర్వేదంలో శక్తితో నిలబడి దేశ శత్రువుల లాలనకుగాని, ఎత్తుగడలకు గాని లోబడకుండ సేవజేయగలరు దేశ స్వాతంత్ర్యమనేది కేవలం భౌగోళికమైన సరిహద్దులకే పరిమితమైనది గాదు. దేశ స్వాతంత్ర్యమంటే దేశంలోని ప్రజలందరి సాంఘిక, ఆర్థిక, రాజకియమైన స్వేచ్ఛ, అప్పుతులు సాంఘిక, ఆర్థిక పురోభివృద్ధి విషయంలో తాను దీసికొన్న నిర్ణయాలు దేశ స్వాతంత్ర్య సమరం ముడిబడి వుండినవి. అస్పృశ్యులకు గావలసింది ప్రత్యేక నియోజకవర్గాలా లేక సంయుక నియోజక వర్గాలా అన్న వివాదంపై విభిన్నాభిప్రాయాలుండినప్పటికినీ, ఎన్నో చిక్కు సమస్యల నెదుర్కొంటున్న దేశంలో యీ వివాదం రావడం సహజమే. దేశ స్వాతంత్ర్యమంటే అది కొందరికే పరిమితం గాదని, సాంఘిక, ఆర్థిక, రాజకీయ రూపాల్లో అది అందరికీ వర్తించాలనీ వాదించిన డా ॥ అంబేడ్కర్, ఆ వాదన ద్వారా దేశ భవితవ్యాన్ని తాను వాంఛించినట్టే వివరించడంలో గ్రంథకర్త కృతకృత్యుడైనాడు.

భారత రాజ్యాంగ చట్ట రచనాభారం డా॥ అంబేడ్కర్ భుజస్కంధాలపై ఉంచబడింది. ఆ బాధ్యతను తాను అతి శ్లాఘనీయంగా నిర్వర్తించగలిగాడు . తన బహుముఖ పాండితీ పరిజ్ఞానాన్ని, సమర్ధతను, నేర్పరితనాన్ని, ఎదుటివారిని ఒప్పించగల శక్తి , నిష్కళంకమైన దేశభక్తి వంటి మహత్తర గుణసంచయంతో మహోత్కృష్టమైన రాజ్యాంగం తయారైనది.

అతని యొక్క ప్రస్థానము మరియు అతను చేసిన అమెరికా ప్రయాణం యొక్క విశేషాలు మొత్తంగా వివరించడం జరిగింది. ఈ యొక్క ప్రశ్నలు మీకు ఎస్సే కాంపిటీషన్ (S.I. compitation) లో గాని పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో గాని విపులంగా వివరించడానికి దోహదపడతాయి.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories