లండన్ ప్రయాణం తర్వాత దాదాపు రెండేళ్ళకు పైగా ప్రొఫెసర్ ఉద్యోగం

లండన్ ప్రయాణం తర్వాత

దాదాపు రెండేళ్ళకు పైగా ప్రొఫెసర్ ఉద్యోగంజేస్తూ ఎంతో పదిలంగా కొంత డబ్బు కూడబెట్ట గలిగాడు. తన మిత్రుడైన నావల్ బతానియా అనే పార్సీ మిత్రుని వద్ద నుండి ఐదువేల రూపాయలు చేబదులుగా దీసికొని లండన్ చదువులు పూర్తి జేసేందుకై తిరిగి ప్రయాణమయ్యాడు. కోలాపూర్ మహారాజు సైతం కొంత తోడ్పడ్డాడు.

1920వ సంవత్సరం సెప్టెంబరు నెలలో డా॥ అంబేడ్కర్ లండన్ వెళ్ళి మళ్ళీ విద్యార్థి జీవితం ప్రారంభించాడు. రోజుకు దాదాపు పద్దెనిమిది గంటలు గ్రంథ పఠనంలోనే గడపసాగాడు . బ్రిటిష్ మ్యూజియమ్ లోని గ్రంథాలయం ప్రపంచంలోని గ్రంథాలయాల్లో కల్లా పెద్దది. ఆ గ్రంథాలయంలో లభ్యంగాని గ్రంథం మరే గ్రంథాలయంలోను లభ్యం గాదని ప్రతీతి. డా॥ అంబేడ్కర్ ఆ బ్రిటిష్ మ్యూజియం గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ చదివి జీర్ణించుకొన్నాడు. కమ్యూనిస్టు సిద్ధాంత రచయిత కారల్ మార్క్స్, ఇటలీ రిపబ్లిక్ నిర్మాత మజినీ – వీరిద్దరే ఇంతకు పూర్వం ఆ గ్రంథాలయంలోని గ్రంథాలన్నింటినీ జదువ గలిగారు. డా॥ అంబేడ్కర్ ఉదయమే లేచి స్నానాదిక్రియలు పూర్తి జేసికొని రెండు రొట్టెముక్కలు, టీ మాత్రం పుచ్చుకొని 8 గంటల కల్లా గ్రంథాలయం జేరేవాడు. తిరిగి సాయంకాలం గ్రంథాలయం మూతబడేంతవరకు గ్రంథ పఠనం ( జ్ఞానయజ్ఞం ) కొన సాగించేవాడట.

గ్రంథాలయం మూసివేయగానే నకనకలాడే కడుపుతో, అలసటతో తిరిగి తన నివాసం చేరుకొనేవాడట. గ్రంథాలయంలో చదివిన వివిధ గ్రంథాలనుండి ఎత్తి వ్రాసుకున్న విషయాలు గల కాగితాలతో చొక్కా జోబీలన్నీ నిండివుండేవట. తిరిగి నివాసంకు సాగించేవాడట. రాగానే కాస్తంత ఆహారం దీసికొని మళ్ళీ గ్రంథ పఠనం దాదాపు అర్ధరాత్రి వరకూ కొన లండన్ నగరంలో డా॥ అంబేడ్కర్ నిరంతర గ్రంథ పరనంలో నిమగ్నుడై వున్నా భారతదేశంలో కొనసాగుతున్న స్వాతంత్ర్య పోరాటం గూర్చి, నిమ్న జాతీయ సంఘాల కార్యకలాపాల గూర్చి ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా తెలుసుకొంటూనే వుండేవాడు. బ్రిటిష్ ఇండియా కార్యదర్శి మాంటేగూ నిమ్న జాతుల ప్రాతినిధ్యం గూర్చి సుముఖత్వం దెలిపినట్లు విన్నప్పుడు డా॥ అంబేడ్కర్ లో గల్గిన ఆనందానికి మేరలేదు.

లండన్ నగరంలో డా॥ అంబేద్కర్ నిర్విరామంగా కొనసాగించిన సారస్వత కృష్ణ ఫలించింది. 1921వ సంవత్సరంలో “ ప్రావిన్సియల్ డిసెంట్రలైజేషన్ ఆఫ్ యింపీరియల్ ఫైనాన్స్ యిన్ బ్రిటిష్ ఇండియా ” ( బ్రిటీష్ ఇండియాలో రాష్ట్రీయ ఆర్థిక వికేంద్రీకరణ ) అన్న పరిశోధనా గ్రంథాన్ని రచించి లాస్కీ పాఠశాల నుండి యం.యస్.సి. డిగ్రీ సంపాదించాడు. అదే సమయానికి తన బారిష్టర్ పరీక్ష గూడ పూర్తింది. 1922లో “ ప్రాబ్లమ్ ఆప్ ది రూపీ ” ( రూపాయి సమస్య ) అనే మరో ముఖ్యమైన పరిశోధనా గ్రంథాన్ని గూడ రచించి డాక్టరేట్ డిగ్రీ సంపాదించాడు. అత్యంత క్లిష్టమైన విద్యా వ్యాసంగంలో అతి తక్కువ కాలంలో ఒకేసారి అన్ని డిగ్రీలను పొందిన మేధావి భారతదేశంలో ఆనాటికీ ఈనాటికీ డా॥ అంబేద్కర్ ఒక్కడే! ఎన్నో ఏళ్ళుగా కలలుగంటూ వచ్చిన లండన్ చదువులు పూర్తెనా డా॥ అంబేద్కర్ లో విద్యాదాహం తీరలేదు. అమెరికా, లండన్ విశ్వవిద్యాలయాల తర్వాత జర్మనీ దేశంలోని బాన్ విశ్వవిద్యాలయం విజ్ఞాన సంపదలో ఉత్తమశ్రేణికి జెందినదని తెలిసికొన్న తరువాత జర్మనీకి ప్రయాణమై బాస్ విశ్వవిద్యాలయంలో కొంత కాలం తర్కశాస్త్రం, ఆర్థిక శాస్త్రం అధ్యయనం చేసి ఆ తర్వాత తన మాతృదేశానికి ప్రయాణమైనాడు.

డా॥ బి.ఆర్. అంబేద్కర్, ఎం.ఎ., పి .హెచ్.డి. ( కొలంబియా ), డి.యస్.సి.( లండన్ ), బారిష్టర్ – ఎట్ – లా, మాతృదేశం తిరిగి వచ్చి బొంబాయి పట్టణంలో 1923 జూన్ నెల నుండి బారిష్టరుగా నూతన జీవితం ప్రారంభించాడు. ఆ రోజుల్లో బారిష్టర్ చదివిన లాయర్లకు భారతదేశంలో వున్న విలువ, గిరాకీ అంతా యింతా కాదు. డా॥ అంబేడ్కర్ కేవలం బారిష్టరే గాకుండా ఆర్థిక , వ్యాపార , రాజకీయ శాస్త్రాల్లో నిష్ణాతుడు. బొంబాయిలోని లాయర్లలో ఎవరికీ లేనన్ని డిగ్రీలున్నా, ఎవ్వరూ సాధించలేనంతటి జ్ఞానాన్ని సంపాదించినా కోర్టులో తాను అస్పృశ్యుడగానే పరిగణించబడ్డాడు. పైగా ఆ రోజుల్లో జడ్జీలంతా తెల్లదొరలే. ఈ తెల్లజడ్జీలకు తెల్ల లాయర్లంటేనే మక్కువ ఎక్కువ. ఈ విధంగా తాను కుల భేదానికి కాకుండా రంగు భేదానిగూడ గురయ్యాడు. కులాన్ని బట్టి వర్గాన్ని బట్టి వ్యక్తి విలువలు నిర్ణయించే సమాజంలో శక్తి సామర్థ్యాలు రాణించడం కష్టం. అయితే అంత మాత్రాన డా॥ అంబేద్కర్ నిరాశా నిస్పృహలకు గురికాలేదు. చేపట్టిన ప్రతి కేసూ తన వాదనా పటిమతో బ్రిటీష్ జడ్జీలను ముగ్గులగావించి గెలుస్తూండడంతో బొంబాయి హైకోర్టులో అనతికాలంలోనే పేరున్న బారిష్టరుగా గుర్తింపులోకొచ్చాడు.

నాల్గవ ప్రకరణము

బహిష్కృత హితకారిణి సభ

1923వ సంవత్సరంలో బాలగంగాధర తిలక్ చనిపోయిన తరువాత కాంగ్రెస్ సంస్థకు గాంధీజీ నాయకుడయ్యాడు. గాంధీజీ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ దేశంలోని నాల్గు చెరగులా ప్రాకి పటిష్టమై భారత స్వాతంత్ర్య పోరాటంలో వుధృతంగా పనిచేయ సాగింది. ఇదే తరుణంలో మౌలానా మహమ్మదాలీ జిన్నా నాయకత్వాన ముస్లింలీగువారు ఖిలాఫత్ వుద్యమం ప్రారంభించారు. గాంధీజీ నాయకత్వాన హిందువులు, జిన్నా నాయకత్వాన మహమ్మదీయులు వారి వారి ఆశలకు, ఆశయాలకు ఒక రాజకీయ స్వరూపం గల్పించుకోగలిగారు. కాని అప్పట్లో నిర్భాగ్యులు, నిరాధారులైన నిమ్న జాతుల వారు మాత్రమే రాజకీయంగ ఎలాంటి అండదండలు లేకుండా వుండిపోయారు. ఆ రోజుల్లో అస్పృశ్యులనే వారు గాంధీజీ దృష్టిలో లేనే లేరు.

బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులైన యస్.కె.భోలె, మౌలఫ్ అనే యిద్దరు మాత్రం యీ అస్పృశ్య జాతుల యొక్క రాజకీయమైన హక్కుల కోసం లెజిస్లేటివ్ కౌన్సిల్లోను, కౌన్సిల్ వెలుపల కొంత అలజడి లేవదీస్తు వారు. శ్రీ యస్.కె.భోలె అగ్ర వర్గస్టుడైనా సంఘ సంస్కరణాభిలాషతో మొదటి నుండి నిమ్న జాతుల సమస్యల పట్ల శ్రద్ధ వహిస్తుండేవాడు. బ్రిటిష్ ఇండియా కార్యదర్శి మాంటేగు సంస్కరణల ప్రకారం నిమ్న జాతులకు సంబంధించిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు జరపా లంటూ యస్.కె.భోలె, ఘోలఫ్ యిరువురు బొంబాయిలో పెద్ద ఆందోళన లేవదీశారు.

1924 నాటికి డా॥ అంబేడ్కర్ న్యాయవాద వృత్తిలో బాగా స్థిరపడ్డాడు. నిమ్మ జాతుల సంక్షేమం కోసం అహర్నిశలు ఆలోచించి కొన్ని నిర్మాణ కార్యక్రమాలను, పథకాలను సిద్ధం చేసికొని కార్య రంగంలోకి దూకాడు. 1924వ సంవత్సరం మార్చి నెల 9వ! తేదీన బొంబాయి పట్టణంలోని దామోదర హాలులో ఒక సదస్సు ఏర్పాటుచేసి బొంబాయి.

రాష్ట్రంలోని నిమ్న జాతీయ నాయకుల్ని, నిమ్నజాతుల అభివృద్ధి విషయంలో ఆసక్తి జూపే కొందరు అగ్రవర్ణాల వారిని ఆ సదస్సు కాహ్వానించాడు. అస్పృశ్య జాతులవారు. శతాబ్దాలుగా అనుభవిస్తున్న సాంఘిక దాస్యాన్ని గూర్చి ఎంతో విపులంగా ప్రసంగించిన మీదట అస్పృశ్యుల్లో ఆత్మాభిమానాన్ని, ఆత్మ విశ్వాసాన్ని గలిగించి వారి సమస్యలేమిటో వారు గుర్తెరిగి వాటిని పరిష్కరించుకొనేందుకై ప్రోద్బలమిచ్చేందుకొక సాంఘిక సంస్థ అవసరమని తెలిపాడు. తాను స్థాపించబోయే ఆ సాంఘిక సంస్థ పురోభివృద్ధికి సహకరించా ల్సిందిగా సభాసదు లందర్నీ ప్రార్ధించాడు. డా॥ అంబేద్కర్ వంటి విద్యావేత్త అలాంటి సంఘాన్ని స్థాపించి నడిపే పక్షంలో దాని అభివృద్ధికై తప్పక సహాయపడేందుకు సదస్సులో పాల్గొన్న వారంతా తమ సంసిద్ధతను తెలిపారు. డా॥ అంబేడ్కర్ చే స్థాపించబడ్డ ఆ సంఘం “ బహిష్కృత హితకారిణి సభా ” అనే పేరుతో అవతరించింది. ఈ సంఘాన్ని సొసైటీల చట్టం XXI ( 1860 ) క్రింద 1924 జూలై 20వ తేదీన రిజిస్టర్ చేయడం గూడ జరిగింది.

  1. బహిష్పత హితకారిణీ సభ ఆధ్వర్యాన స్కూళ్లను, హాస్టళ్ళను స్థాపించి వాటి ద్వారా అస్పృశ్యుల్లో విద్యాభివృద్ధి గల్గించుట.
  2. పఠనాలయాల ద్వారా, సాంస్కృతిక సభల ద్వారా, నాటకాల ద్వారా అస్పృశ్య జాతుల్లో నాగరికతను , సంస్కృతిని అభివృద్ధి చేయుట.
  3. నిమ్న జాతులకు పరిశ్రమల్లోను, వ్యవసాయంలోను సాంకేతికమైన శిక్షణ యిచ్చేందుకై ప్రత్యేకమైన విద్యా కేంద్రాలను ఏర్పాటు జేయుట.
  4. నిమ్నజాతుల కష్టనిష్బూరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి దెస్తూ వాటి పరిష్కారం కోసం కృషి చేయుట.

పై ముఖ్యాశయాలను బట్టి, వాటిని రూపొందించిన వ్యక్తిని బట్టి ఆ సంస్థ యొక్క విలువను, భవిష్యత్తును సులభంగా గ్రహించవచ్చు. నిమ్న జాతులను రాజకీయం వంటి పెద్ద పోరాటాల వైపు నడిపే ముందు వారిలో మనోగికాసాన్ని సంఘ చైతన్యాన్ని గల్లించాలి. ఆ వుద్దేశంతోనే డా॥ అంబేడ్కర్ యీ సంఘాన్ని స్థాపించాడు.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories