ఆ విద్యాలయానికి అన్ని సదుపాయలతో స్వంత భవనం నిర్మించారు

సావిత్రినగర్ , దరియాలతిప్ప , కనకాలపేట , మెట్టకుర్రు , గిరియాం పేట , కురసాం పేట , భీమ్నగర్ , అగ్రహారం , అంబేద్కర్ నగర్ గ్రామాల్లో పాఠశాలలకు నూతన భవనాలు అన్ని సౌకర్యాలతో నిర్మించారు . కేంద్ర ప్రభుత్వం ద్వారా కమ్యూనిటీ కళాశాలను ఏర్పాటు చేయించారు . 1986వ సంవత్సరంలో కేంద్ర మానవ వనరుల శాఖ ద్వారా మెట్టకుర్రులో జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం అయ్యింది .

ఆ విద్యాలయానికి అన్ని సదుపాయలతో స్వంత భవనం నిర్మించారు 

1997 నాటికి 25 ఎకరాల విస్తీర్ణంలో రూ . 47 కోట్ల వ్యయంతో పక్కా భవనాలు , ఆ ప్రాంగణంలో రోడ్లు , డ్రెయిన్లు నిర్మించారు . భారీ క్రీడా మైదానం అభివృద్ధి చేశారు . విద్యాలయంలో సీట్ల సంఖ్య పెంచి ఎక్కువమందికి చదువుకునే అవకాశం కల్పించారు . జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టారు . జి . ఎం . సి . బాలయోగి 1997 నుండి ఈ పనులన్నింటికీ నిధులు తీసుకు రావటానికి ఎంతగానో సహకరించారు . ఈ కార్యక్రమాలన్నింటిని నిరంతరం మల్లాడి పర్యవేక్షించారు . బాల బాలికల్లో అంతర్లీనంగా దాగి వున్న సృజనాత్మక కళలను వెలికి తీసి , ఆట పాటల నుండి కళా రంగాలన్నింటా తగు శిక్షణ యిచ్చి ఇందుకు ప్రత్యేకంగా ఓ వేదిక.
వుండాలని విద్యాశాఖ ద్వారా జవహర్ మినీ బాల భవన్ కు రెండు అంతస్తుల భవనం నిర్మించటంతో ఎంతోమంది చిన్నారులకు నిత్యం విభిన్న కళా రంగాల్లో సాధన చేయడానికి అవకాశం వచ్చింది . | సర్వశిక్ష అభియాన్ , విద్యా శాఖ నిధులతో 13 కోట్ల రూపాయల ఖర్చుతో 106 తరగతి గదులు నిర్మించారు . ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి గౌతమీ టీచర్ ట్రైనింగ్ కళాశాల , యానాం టీచర్ ట్రైనింగ్ కళాశాల , రీజెన్సీ ఆధ్వర్యంలో బి . యి . డి . కళాశాలలు త్వరగా ప్రారంభం కావడంలో ఆయన పాత్ర తిరుగులేనిది . బి . సి , యస్ . సి విద్యార్థినులకు విశాలమైన హాస్టల్ భవంతులు నిర్మించారు . అక్కడ పరిశుభ్రమైన వాతావరణం కల్పించారు .

మంచి భోజనం పిల్లలకు పెట్టాలనేది మల్లాడి తపన . మధ్యాహ్న భోజన పథకం ! గురించి దేశమంతటా విమర్శలు వస్తుంటాయి . 

ఖాళీ పళ్లాలతో , అత్యంత హీనమైన భోజనాలు అందిస్తున్నారని ఎన్నో చోట్ల విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారు . పిల్లల నోటి దగ్గర మెతుకులకు కక్కుర్తి పడే హీనులున్న దేశం మనది . యానాం అనుభవం విభిన్నం . అందరికీ ఆదర్శం . అన్ని వసతులతో అన్నపూర్ణాలయం ( సెంట్రల్ కిచెన్ ) ఏర్పాటు చేసారు . ఒక ఎయిడెడ్ పాఠశాలతో కలిపి 24 పాఠశాలలు జూనియర్ కళాశాలలకు చెందిన సుమారు 7 , 000 మందికి ఇక్కడ భోజనాలు తయారవుతాయి .
 అక్కడి విద్యార్థులను బట్టి వాహనాల ద్వారా భోజనాలను పంపిస్తారు . ఇన్ని వేల మందికి భోజనాలు తయారు చేయటానికి స్టీమ్ యంత్రాలు , అవసరమైన సిబ్బంది నియామకం జరిగింది . శివారు గ్రామాలకు ఈ తరలింపులో యిబ్బందులు ఎదురవటాన్ని గమనించాక మరో అన్నపూర్ణాలయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో వున్నారు .
ప్రధానంగా పాఠశాలల్లో అల్పాహారం , ఉచిత సైకిళ్ల పంపిణీ , పాకెట్ మనీ , గొడుగులు , రెయిన్ కోట్లు , పాలు , బిస్కెట్లు , పాఠ్య , నోట్ పుస్తకాలు , యూనిఫామ్ లాంటివి సకాలంలో పంపిణీ చేయటానికి మల్లాడి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు . భారతదేశంలోని అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు , అన్ని రాష్ట్రాల్లో పదవ తరగతి స్టేట్ టాపర్లని యానాంకి ఆహ్వానించి ఒక్కొక్కరికి పదివేల రూపాయల బహుమతిని యిస్తారు . పొరుగున వున్న తూర్పు గోదావరి జిల్లా టాపర్ కి కూడా బహుమతిని అంద చేస్తారు .
ఇవి స్వీకరించడానికి వచ్చే విద్యార్థులకే కాక వారి తల్లిదండ్రులకు కూడా రవాణా ఛార్జీలు , డి . ఎ . వసతుల్తో పాటు భోజన సదుపాయం కల్పిస్తారు . 
ఇందుకు ఒక్కొక్కరికి సుమారు 25 వేల రూపాయల ఖర్చు అవుతుంది . 2006 నుండి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తోంది . జాతీయత అంటే ఇది . – యానాంలోని ఓల్డేజ్ హోమ్ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువు తున్న విద్యార్థులందరికీ ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు . ఈ వృద్ధాశ్రమం ద్వారా యానాంలోని నిరుద్యోగులు రాసే

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు . . ఈ రంగం గురించి మాట్లాడుతూ . . . “ నేను సంతృప్తి చెందని రంగాల్లో విద్య ఒకటి .

నేను కొంతవరకు మాత్రమే చేయగలిగాను . వందశాతం నేను అనుకున్నది సాధించలేకపోయాను . యానాంలో మెడికల్ కాలేజిని ఏర్పాటు చేయించాలని నాకుంది .

అందుకు కొన్ని ప్రయత్నాలు చేసాను . వ్యక్తులుగాని , సంస్థలు గాని ఎవరు ముందుకు వచ్చినా ఈ విషయంలో నా పూర్తి సహకారం వుంటుంది , విద్యకు పరిమితులు లేవు . ఎంత చేసినా ఇంకా చేయవలసి వుంటుంది . ఎప్పటికప్పుడు కొత్త మార్పులు వస్తున్నాయి . ఉపాధ్యాయులు ఉద్యోగంలో చేరటంతో తృప్తి పడకూడదు . బోధనా పద్ధతులు మారుతున్నాయి . ఎప్పటికప్పుడు వారు ఆధునికం కావాలి . ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని పరిశీలించాలి . రేపటి పౌరులు యిక్కడ నుండి తయారవుతారు .
అద్భుతాలు చేసేది వారు. సామాజిక జీవితంలో వస్తున్న మార్పుల్ని వారికి సున్నితంగా చెప్పాలి . కులం , ఆర్ధిక వెనకబాటు తనం లాంటివి కొన్ని సౌకర్యాల కల్పన వరకే పరిమితం . ఇక్కడ వి
శాల దృక్పథంతో పిల్లలు తయారు కావాలి . సాటివారితో పోటీ పడగలగాలి . మానవత్వం , ప్రగతి, సమభావం ఇవి వారిలో పెంచాలి . అంతేగాని రకరకాలుగా పిల్లల్ని చీల్చకూడదు. అలా చేస్తున్నారని కాదు. చాలా చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి . ఆ ప్రభావాలు ఎప్పుడయినా మన మీద పడతాయి . రాబోయే ప్రమాదాల్ని ముందుగా మనం వూహించాలి .
ఎవరికి వారు మనం మన పాత్రకు న్యాయం చేస్తున్నామా అని పరిశీలించుకోవాలి . అప్పుడే మన సమస్యలకు తోటివారు స్పందిస్తారు . ఇలాంటివి నా మనసులో ఎన్నో వున్నాయి . ఇప్పుడిప్పుడే చదువుని మించిన పెట్టుబడి లేదు . చదువుతోనే మన జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని సామాన్యులు సైతం గుర్తిస్తున్నారు . మన దేశం విద్యారంగం మీద ఎన్ని నిధులను కేటాయిస్తే అంత అభివృద్ధి చెందుతుంది . ఇప్పటికే ప్రపంచంలో మన దేశంవారు అందులో తెలుగువారు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నారు .

Conclusion:

ఆ సంఖ్య పెరగాలన్నదే నా ఆశ ” అన్నారు మల్లాడి . . ఆట ఒలింపిక్ క్రీడలు జరిగినప్పుడల్లా మన దేశానికి పతకాలు రాలేదని బాధపడుతుంటాం . తర్వాత మరిచిపోతాం . ఎవరికయినా పతకాలు ఎలా వస్తాయి ! మిగతా దేశాల్లో క్రీడలు జరిగిన వెంటనే ఎవరికి వారు తిరిగి సాధనలో మునిగిపోతారు . అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు వుంటాయి . కఠోర శ్రమా , తర్ఫీదు లేకుండా కేవలం ఉత్సాహంతో ఎవరూ ఏమీ సాధించలేరు . అందుకు దీర్ఘకాల ప్రణాళిక కావాలి.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories