నా దారి . . . రహదారి

రోద్‘ అంటే ప్రగతి . రోడ్ అంటే నాగరికత . రోడ్ అంటే సంస్కృతి . ఇల్లు చూసి ఇల్లాలిని చూడు అనేది పాత సామెత . రోడ్ ని చూసి ఓ పట్టణాన్ని , ఓ నగరాన్ని చూడు అనేది నేటి సామెత . – మల్లాడి . “ నేను ఓ యాత్రికుడ్ని , అంటే నిరంతరం విదేశాలు చుట్టి వస్తానని కాదు . అదో అరుదయిన అవకాశం . నేను ఏ ప్రాంతమైనా సరదాకి వెళ్లను . అక్కడ జరుగుతున్న అభివృద్ధిని యానాంలోకి ఎలా తీసుకు రావాలా అని చూస్తాను.

నాకు ఆశ్చర్యం కలిగే అంశం ఒకటి వుంది . విదేశాల్లో రోడ్లు , వంతెనలు లాంటి విషయాల్లో డబ్బు గురించి చూడరు నాణ్యత ప్రధానం . ఆధునిక సాంకేతిక యంత్రాలు వుంటాయి. అసలు పని చేయకుండా నిధులు స్వాహా చేయటం వినం. మనుషుల్ని కలిపేవి రోడ్లు. దీర్ఘకాల ప్రయోజనాలు వాటి ద్వారా వస్తాయి. ఇక్కడ పెట్టుబడిదారి మనస్తత్వం కూడా లేదు. కాంట్రాక్టులు పార్టీల్లో పని చేసేవారికి ఆదాయాలుగా మారిపోతున్నాయి. ఈ రోజు వేస్తున్న రోడ్లు పాడవటానికి ఒక్క వాన చినుకు కూడా అవసరం లేదంటే అతిశయోక్తి కాదు.
1990కి ముందు యానాం అంటే మూడు వీధులు . విష్ణాలయం , త్యాగరాయ , పిల్లారాయ వీధులు మాత్రమే . అక్కడక్కడ వీధి బల్బులు వుండేవి . ఇక సందులన్నీ మట్టి దారులే . గుంతలతో వుండేవి . గాలికి లేచే దుమ్ము , వాన వస్తే బురద . కనీసం నడవటానికీ యిబ్బందే . వీటిని పద్ధతి ప్రకారం అన్ని వీధుల్ని తీర్చిదిద్దారు మల్లాడి.

113 ఇంక చుట్టూ వున్న గ్రామాల పరిస్థితి ఇంకా దారుణం . దరియాల తిప్ప , కనకాల పేట రోడ్డు దారుణంగా వుండేది . కనకాల పేట రైతులు పాలు ఒలికిపోతున్నాయి రోడ్డు బాగుచేయండని కోరేవారు . దీనిని డబుల్ రోడ్డు చేసారు . ఏటి మార్గాల నిండా ముళ్ల కంపలు . గిరియాం పేట , సావిత్రి నగర్ గ్రామాలకు వెళ్లి రావాలంటే ఓ పూట పట్టేది .

ఇంటి నుండి బయలు దేరి ఎత్తుపల్లాలను , ముళ్ల పొదల్ని తప్పించుకుంటూ క్షేమంగా ఇంటికి చేరటం మహా ప్రయాస . యానాం – మెట్టకూరు రోడ్డు అక్కడున్న గౌతమీ నది పాయ వలన తరచుగా కోతకు గురయ్యేది . ఈ పరిస్థితిని నివారించేందుకు రహదారికి , పొయకూ మధ్య అడ్డుగోడ కట్టటంతో అక్కడి యిబ్బందులను నివారించగలిగాం.
139 కోట్ల 67 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ , పుదుచ్చేరి ప్రభుత్వాల నిధులతో ఫెర్రిలో గల భారతమాత విగ్రహం నుండి టైడల్ లాక్ వరకు , యానాం పాత వంతెన నుండి అంబేద్కర్ నగర్ మీదుగా సీతంపేట వరకు పాదచారులకు రోడ్లు నిర్మించటం జరిగింది . టైడల్ లాక్ పక్కనున్న హిందూ శ్మశాన వాటిక నుండి ఫరంపేట ఎస్ . సి . ఫీల్డ్ లేబర్ కో ఆపరేటివ్ సొసైటీ వరకు రోడ్డు వేసి రివిట్ మెంట్ పనులు చేసాం . ఇంకా ఫరంపేట నుండి సావిత్రి నగర్ వరకు కాంక్రీట్ గోడ వల్ల వరదనీరు యానాంలోకి రాకుండా రక్షణ చేకూరుతుంది.
ఈ పని తప్పుడు ఫిర్యాదులతో తాత్కాళికంగా ఆగింది . ఈ లోగా ధరలు పెరిగాయి . పెరిగిన మొత్తాన్ని పాండిచ్చేరి ప్రభుత్వం పెట్టుకోవాలని మల్లాడి చెప్పారు . ఫైనాన్స్ సెక్రటరీ , రెవిన్యూ సెక్రటరీ , కలెక్టర్ చూసి ఇంజనీరులతో కమిటీ వేసి 18 నెలలు అయ్యాక నివేదిక సమర్పించారు . 40 కోట్లు అదనంగా అవుతుంది . త్వరలో ప్రారంభం అవుతుంది . అప్పుడు వరదల నుండి యానాంకు పటిష్టమైన రక్షణ కలుగుతుంది.
యానాం వట్టణంలో దాదాపు అన్ని రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయడం , కొత్తవి వేయటం జరిగింది . బి . టి . రోడ్లు వేస్తే రెండు మూడు సంవత్సరాలకు పాడయిపోతాయి . సిమెంట్ రోడ్లు నేను.
అయితే ఇరవై అయిదు సంవత్సరాలు వుంటాయి అనేది మల్లాడి దృష్టి అందుకే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కనిపిస్తాయి . స్లమ్ క్లియరెన్స్ పథకం కింద సావిత్రి నగర్ , గిరియాం పేటలలో అసం పూర్తిగా వున్న రహదారులను పూర్తి చేసాం . మిగిలిన పనులు రాబోయే కాలంలో పూర్తవుతాయి.
యానాం టవర్ వున్న గిరియాంపేట గ్రామం వద్ద రిలయన్స్ జంక్షన్ నుంచి సి . సి . డబల్ రోడ్ రూపుదిద్దుకుంటోంది . అదే తరహాలో కురసాం పేట నుంచి గిరియాంపేట వరకు , జెండా స్తంభం జంక్షన్ నుంచి అరటికాయ లంక వరకు , జెండా స్తంభం నుంచి జీసస్ విగ్రహం వరకు చక్కటి రహదారులు వచ్చాయి . మారుమూల గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లున్నాయి . ఈ రహదారులకు అనుసంధానంగా డ్రైనేజీల నిర్మాణాలు జరిగాయి.
మనం ఓ రహదారిని నిర్మించినంత మాత్రాన చాలదు . వాటికి నిర్వహణ ముఖ్యం . ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేసుకోకపోతే మళ్లీ పాత స్థితికి చేరుకుంటాయి . అలాగే జనాభా అవసరాలు పెరుగుతాయి . వాహనాలు పెరుగుతాయి . అవసరమైన చోట్ల రహదారుల్ని విస్తరించు కోవాలి . ఇవన్నీ ఎప్పటికప్పుడు ఓ ప్రణాళిక ప్రకారం చేసు కుంటూ పోతున్నాం.
రోడ్ల పరిశుభ్రత కోసం ఉదయం సాయంత్రం చక్కగా తుడవడం , డ్రైన్లను అంకిత భావం తో శుభ్రం చేయడం వెనుక మల్లాడి ఆలోచన వుంది . యానాంలో పరిశుభ్రత పాటిస్తు న్నందున బెస్ట్ సివిక్స్ అవార్డు మల్లాడి పొందారు . ఢిల్లీ నుండి స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం ఈ అవార్డు సిఫార్స్ చేసారు.

చెత్త నుండి . . . 

చెత్త సేకరించాక దూరంగా ఎక్కడో పారవేయటం లేదా తగల బెట్టటం వలన పర్యావరణానికి మరింత నష్టంతో పాటు ఆ చుట్టు పక్కల వున్న వారి ఆరోగ్యాలు పాడవుతుంటాయి . మల్లాడి ఈ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.
ఇప్పటికే ఇళ్ల నుండి పొడి చెత్తను తడి చెత్తను విడివిడిగా ప్రత్యేక సంచుల్లో వేరు చేసి ఇవ్వటాన్ని ప్రజలకు అలవాటు చేసారు. చెత్త సేకరణకు మూడు చక్రాల రిక్షాలను వినియోగిస్తున్నారు . ఆ చెత్తను చాలా విలువయిన సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు . ఇది పూల తోటలకు , పొలాలకు చాలా బలమైన ఎరువుగా మారింది . ప్రభుత్వం వారు రైతులకు ఈ ఎరువును అమ్మాలని సూచించింది. అందుకు మల్లాడి ఒప్పుకోలేదు. రైతుల నుండి మనం ఎంతో పొందుతున్నాం. వారికి ఉచితంగానే యివ్వాలని ప్రతిపాదించి అమలు చేస్తున్నారు.
వారధులు “రహదారులు వంతెనలతో అనుసంధానం అయి వుంటాయి. కొత్త వంతెనలను కట్టుకోవాలి. పాత వాటికి మరమత్తులు చేసుకుని కొత్త వాటిగా మార్చుకోవాలి. అవన్నీ చేస్తున్నాం . ముఖ్యంగా యానాంకి తూర్పు ముఖద్వారంలో వున్న పొట్టి శ్రీరాములు వారధి , అయ్యన్న నగర్ దగ్గర నిర్మించిన వంతెన . గిరియాం పేటలో మత్స్యకారుల.
సౌకర్యం కోసం నిర్మించిన వారధి ఇలాంటివి పి . డబ్ల్యు . డి వంటి సంస్థల ద్వారా పూర్తి చేసాం . ఫ్రెంచ్ వారి కాలంలోని వంతెన పక్కన కొత్త వంతెన కట్టి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాం. మాజీ శాసనసభ్యుడు పొట్టి శ్రీరాములు గారి పేరును ఈ వంతెనకి పెట్టడాన్ని వ్యతిరేకించారు. అయినా ఆ మహానీయుని పేరు పెట్టించగలిగాను.

దొమ్మేటి పేట , సీతారామ నగర్ , దరియాలతిప్ప , మెట్టకూరు గ్రామాల్లో పాత వంతెనలను ఆధునికం చేయటం జరిగింది. 

యానాంతో పాటు చుట్టు పక్కల గ్రామాల భవిష్యత్ని మలుపు తిప్పింది యానాం – ఎదుర్లంక మధ్య గౌతమీ నదిపై నిర్మించిన బాలయోగి వారధి . ఈ వారధి నిర్మాణానికి జాతీయ స్థాయిలో అనుమతులు కావాలి . అక్కడ కాలయాపన తప్పదు . అప్పుడు జి . ఎం . సి , బాలయోగి , మల్లాడి కలసి ఇంటర్ స్టేట్ బ్రిడ్జ్గా దానిని రూపొందిచి ఓ . ఎన్ . జి . సి . అధికారులు , కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి అనుమతులు పొందారు.
ఈ వారధి నిర్మాణానికి ముందు రేవు దాటింపు ఆదాయాన్ని పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సమానంగా తీసుకుంటున్నాయి కనుక నిర్మాణానికి అయ్యే ఖర్చును ఇరు ప్రభుత్వాలు భరించాలి. పుదుచ్చేరి ప్రభుత్వానికి సంబంధించి జానకిరామన్, షణ్ముగం, రంగసామిల పాత్ర వుంది. 20 ఎకరాల భూమిని ఎప్రోచ్ రోడ్డుకి పుదుచ్చేరి ప్రభుత్వం తరపున యిచ్చారు . పుదుచ్చేరి ప్రభుత్వ పరంగా సగం వాటా నిధులు మంజూరు చేయించటంలోనూ మల్లాడి ముఖ్యపాత్ర నిర్వహించారని చెప్పుకుంటారు . ఇప్పుడూ వారధి మీద విద్యుత్ వెలుగుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కరెంట్ సరఫరాకి ఆయన ఎంతో సహకరిస్తారు. “ఈ రోజున యానాంలో రహదార్లు అద్భుతంగా వుంటాయి అని ఇతర ప్రాంతాల వారు అనటం వెనక సుదీర్ఘ శ్రమ వుంది . ఇంకా చేయవలసింది చాలా వుంది ” అంటారు మల్లాడి

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories