పండించిన పంటలను నేలపాలు చేసేంత దారుణంగా ధరలు పడిపోతుంటాయి .

మనకి కూరగాయలు కావాలి , పశు గ్రాసం కావాలి . అసలు ఫల , పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయటా నికి కారణం రైతులను ఉత్సాహపర చటానికే , వ్యవసాయ రంగంలో చాలా అవకాశాలు వున్నాయని వారు గుర్తించటానికి , సాగు నీరు కేవలం పంట కాలవల ద్వారానే కాక పైపు లైన్ల నుండి తీసుకు రావచ్చు . అది తాగునీటికి మాత్రమే పరిమితం కాకూడదని నేను అనుకోవటం వల్ల ఆ పని చేయగలిగాను , ఇంక రైతుల జీవితాల్లో అసలయిన సమస్య పండించిన పంటకు గిట్టుబాటు ధర రావటం .

 పండించిన పంటలను నేలపాలు చేసేంత దారుణంగా ధరలు పడిపోతుంటాయి.

ఇంకో పక్క వినియోగదారులకు ధరలు పెరుగుతుంటాయి . యానాం మార్కెట్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం . నల్ల చెరువు ప్రాంతంలో మార్కెట్ కాంప్లెక్స్ కార్యాలయం , షాపింగ్ కాంప్లెక్స్ , రైతులకు విశ్రాంతి భవనం కట్టుకున్నాం . డా ” అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల , మార్కెట్ కమిటీ ఆవరణలో నర్సరీల ద్వారా తక్కువ ధరలకు మొక్కలు అందిస్తున్నాం . మద్దతు ధరను పెంచటం , అవసరమైన సమయంలో పంటలను సేకరించటం ద్వారా రైతులను ఆదుకోవటం చేస్తున్నాం . అలాగే మత్స్య సంపద కోసం మార్కెట్ యార్డులున్నాయి . ఇక్కడ ‘ చేపల సంతలా వుండదు . పరిశు భ్రంగా వుంటుంది . మరో పక్క యాంత్రీకరణ పథకం వుంది . ట్రాక్టర్లు , పవర్ టిల్లర్స్ , ఇతర వ్యవసాయ పనిముట్లను ఏర్పాటు చేసుకుంటు న్నారు , డిసెంబర్ 23న రైతు దినోత్సవం జరుగుతుంది . అప్పుడు 60 నుండి 80 . సంవత్సరాలు నిండిన సీనియర్ రైతులకు సత్కారం చేస్తారు . పంట బీమా పథకం వచ్చేలా చేసారు .
ఇంక కౌలు రైతుల సమస్య వుంది . యానాంలో నోటి మాట ద్వారా కాక ఎక్కువ మంది రైతులూ – కౌలు రైతుల మధ్య లిఖిత పూర్వకంగా , స్పష్టమైన ఒప్పందం జరగాలని ముందు నుండి నేను కోరుకున్నాను .
అప్పుడు మాత్రమే ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న సబ్సిడీల నుండి ఇతర సదుపాయాల విషయంలో ఓ స్పష్టత వస్తుంది . ముఖ్యంగా పంట నష్టాలు ఎదురయినప్పుడు ఈ సమస్య తీవ్రంగా వుంటుంది . మనం రైతుల ప్రయోజనాలు రక్షించటం ఎంత ముఖ్యమో . . . కౌలు రైతుల హక్కులు కాపాడుకోవటం అంతే ముఖ్యం . రైతులు నష్టానికి భయపడో , చేసే అవకాశం లేకనో కౌలుకి భూమిని యిస్తారు . లేదంటే ఖాళీగా వుంచాల్సిందే . అలాంటప్పుడు ప్రభుత్వం నుండి వచ్చేవన్నీ తనకే చెందుతాయని రైతు అనుకోకూడదు .
 ఏమయినా ఇలాంటి విషయాల్లో పరస్పర అవగాహన , సహకారం అవసరం . నేను ఇరువర్గాల వారిని సమావేశ పరిచి వారికి అర్ధం అయ్యేలా నచ్చ చెప్పాను . “ నష్ట పరిహారాన్ని నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యేలా ఏర్పాటు చేసాను . ఇలాంటి కార్యక్రమాన్ని మన దేశంలో మొదటిసారిగా నేనే ఆరంభించాను ” అంటారాయన కాస్త గర్వంగా . . ఇక్కడ జరుగుతున్న కొన్ని పనులకు బయట నుండి ప్రేరణ పుంటే ఓ కార్యక్రమాన్ని ఎలా రూపొందించుకోవాలి అన్న విషయంలోనూ , అమలు చేసి ఫలితాలు ఎలా రాబట్టాలి అనే అంశంలోనూ ‘ యానాం ‘ అనుభవాల నుండి బయటివారు ఎంతో నేర్చుకోవచ్చు . విద్య ఏ సమాజమైనా ముందుకు పోవాలంటే ‘ విద్య ‘ మొదటి మెట్టు .

నా వరకు నేను ఇంటర్ మీడియట్ పూర్తవకుండానే చదువు ఆపుచేసాను. చాలామందికి చదువుకునే అవకాశాలుండవు .

 అవకాశం వున్నవారు చదువు విలువను చిన్నప్పుడు గుర్తించరు . ఉన్నత చదువులు చదివి వుంటే బాగుండేదని ఇప్పుడు నేను బాధ పడుతుంటాను . అందుకే ఈ రంగంలో చేయవలసింది ఎంతో వుంది అని నేను నిర్ణయించుకున్నాను . విద్యాపరంగా యానాంని ఉన్నత స్థితికి తీసుకు వెళ్లటమే నా ఆశ – నా స్వప్నం . మల్లాడి శాసన సభ్యుడిగా ఎన్నికయిన నాటికి విద్యాపరంగా సదుపాయాలు అంతంత మాత్రం . అప్పుడు నాలుగు ఉన్నత పాఠశాలలు మాత్రం వుండేవి . అవీ, కళాశాలలు, రకరకాల సమస్యలతో కొనసాగు తున్నాయి . ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించాలి . భవనాలు , మరుగుదొడ్లు , తాగునీరు , క్రీడాస్థలం లాంటివి వుండాలి . విద్యార్థులు తగినంతగా లేక వెలవెలబోతున్న పాఠశాలలు కళకళలాడాలి .
ఆధునికంగా విద్యారంగంలో వస్తున్న అన్ని విద్యలనీ యానాం పిల్లలకు అందుబాటులోకి తేవాలి . Dr . LANBEDER 1996 – 97 విద్యా సంవత్సరంలోనే యానాంలో పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించకపోతే ఆమరణ నిరాహార దీక్షని చేపడతానని అల్టిమేటం ఇవ్వటంతో డా ” బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు . అందుకు కోట్లాది రూపాయలు వ్యయంతో చోడే సాల్వెంట్స్ భవనాన్ని స్వాధీనం చేసుకుని , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ , కంప్యూటర్ సైన్స్ కోర్సులతో ఈ కళాశాల మొదలయింది . ఆ తర్వాత విద్యా సంవత్సరంలో ఫిట్టర్ , మెకానికల్ , ఎలక్ట్రికల్ కోర్సులతో ఐ . టి . ఐ కళాశాల వచ్చింది . దానికి సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టారు . – దేశంలో అత్యుత్తమ సేవలందించిన జాతీయ
నాయకుల పేర్లు , సంఘసంస్కర్తల పేర్లు , కొంతమంది స్థానిక నాయకుల పేర్లు యానాంలోని విద్యాసంస్థలకు వారి జ్ఞాపకార్థం పెట్టడం జరిగింది .
మహాత్మా గాంధీ , రాజీవ్ గాంధీ , కమలా నెహ్రూ , పండిట్ జవహర్ లాల్ నెహ్రూ , డా ” కె . ఆర్ . నారాయణన్ , డా ” బి . ఆర్ . అంబేడ్కర్ , పెరుంతలైవార్ కామరాజార్ , కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు పేర్లను ప్రభుత్వ ఉన్నత
పాఠశాలలకు ఇందిరా గాంధీ , డా ” జాకీర్ హుస్సేన్ , కృష్ణదేవరాయలు , అల్లూరి సీతారామరాజు , బాబు జగజ్జీవన్ రాం , మదర్ థెరిస్సా , స్వామి వివేకానంద , సర్ ఆర్థర్ కాటన్ , సుబ్రహ్మణ్య భారతి , డా” బి. ఆర్. అంబేడ్కర్ , పెరుంతలైవార్ కామరాజార్, కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు , దున్న నాగారావు , కోనా వెంకట రాజు పేర్లను ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలకు పెట్టారు. ప్రభుత్వ రంగంలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయించటం అంత సులభం కాదు.
అందువల్ల ఇంజనీరింగ్ విద్యకు విద్యార్థులు దూరం కాకూడదని పుదుచ్చేరి యూనివర్సిటీ అనుబంధ కాలేజీగా ప్రైవేట్ రంగంలో’ రీజెన్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ ప్రారంభించటానికి మల్లాడి విశేషంగా సహకరించారు . తర్వాత ఆయన చొరవ వల్ల ఎం .బి.ఎ.,ఎం.సి . ఎ . , కోర్సులు రీజెన్సీలో ఏర్పాటయ్యా యి . అంతేకాకుండా పాండిచ్చేరి ఇంజనీరింగ్ కళాశాలలో యానాం విద్యార్థులకు కేటాయించే సీట్ల సంఖ్యను పెంచారు మల్లాడి కృషి వల్ల .

Conclusion :

లక్షలాది రూపాయల వ్యయంతో డా” సర్వేపల్లి రాధా కృష్ణ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించారు . తర్వాత పీ . జీ . ని కూడా తీసుకు వచ్చారు . ఇక్కడ బి . యస్ . సి , కంప్యూటర్ సైన్స్ , ఫిజిక్స్ కోర్సులు మంజూరు అయ్యాయి .

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories