బస్సెక్కుదాం . . . ప్రజా జీవితంలో రవాణా సౌకర్యాలు అత్యంత ముఖ్యమైనవి.

ఇప్పటికీ తమ ఊరు నుండి బయటకు కదలని వారు వుండవచ్చు . అయితే సరుకులు , పంటలు , చదువులు , ఉద్యోగాలు , టూరిస్ట్ ప్రాంతాలు , మొత్తంగా అభివృద్ధి అనేది రవాణా సాధనాలతో ముడిపడి వుంది . ఇప్పుడు ప్రపంచమే ఓ గ్రామం కదా !

– మల్లాడి
‘నువ్వు ఎక్కబోయే రైలు జీవితకాలం లేటు ‘ అంటాడు ఆరుద్ర . ఎంతలేటయినా వస్తుంది కదా అని ఎదురు చూస్తాం . ఎక్కటానికి ‘ రైలో , బస్సో అంటూ ఒకటి వుండాలి. ఈ దేశంలోని అనేక గ్రామాలు ఇప్పటికీ బస్సు , రైలు లాంటి సౌకర్యాలు లేకుండా వున్నాయి. ఆ మేరకు మెరుగయిన జీవితానికి , నాగరికతకు సైన్స్ అందించే విజ్ఞానానికి వెలుపల వుంటున్నాం.
ఇవన్నీ మల్లాడి ఆధ్యయనం చేసిన విషయాలే . నూతనంగా ఆర్ . టి . సి కాంప్లెక్స్ ని , ఓపెన్ ఆడిటోరియంను నిర్మించారు . 2009వ సంవత్సరంలో అందుకు కావలసిన నిధులు పుదుచ్చేరి లోకల్ ఎడ్మినిస్ట్రేషన్ సమకూర్చింది.
పి . ఆర్ . టి . సి . బస్సు సదుపాయం గల అన్ని గ్రామాల్లో ప్రయాణీకులకు విశ్రాంతి భవనాలు నిర్మించారు . మల్లాడి రెండు కొత్త బన్ లు మంజూరు చేయించారు . అన్ని ప్రాంతాల నుండి యానాంకి బస్సులు వచ్చి వెళ్లేలా చర్యలు చేపట్టారు . ఇప్పుడు ప్రైవేట్ బస్సులు యానాంకి సరాసరి వస్తున్నాయి . గతంలో విద్యార్థులకు యానాం రావాలంటే.

కష్టంగా వుండేది . త్వరలో మరో రెండు మినీ బస్సులు రానున్నాయి .

కురసాంపేట , టైడల్ లాక్ , పరంపేట , సీతారాం నగర్ , గిరియాంపేట , సావిత్రి నగర్ , దొమ్మేటిపేట , పాత బస్టాండ్ , చిల్డ్రన్స్ పార్క్ గోపాల్ నగర్ , ఫైర్ స్టేషన్ , కనకాలపేట , భీంనగర్ ఇలా ప్రతి ప్రదేశంలోనూ ప్రయాణీకులు యిబ్బంది పడకుండా బస్ షెల్టర్స్ నిర్మించడం జరిగింది . ఆటోరిక్షా , సైకిల్ రిక్షా సోదరు లకు యానాం పాత బస్టాండు దగ్గర , ఫైర్ స్టేషన్ దగ్గర , మార్కెట్ కమిటీ కార్యాలయం పక్కన , నర్స్ క్వార్టర్స్ పక్కన బస్ షెల్టర్లు నిర్మించారు . ఇక్కడి ప్రజలు ఏ ప్రదేశానికి రైలులో వెళ్లాలన్నా 35 కి . మీ దూరంలో వున్న కాకినాడ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చేది బుకింగ్ కోసం . ‘ మల్లాడి కేంద్ర సర్కారుతో సంప్రదింపులు జరిపి ఏప్రిల్ 14 , 2006న రైల్వే రిజర్వేషన్ బుకింగ్ కార్యాలయం ఏర్పాటు చేయించారు . యానాం చుట్టు ప్రక్కల గ్రామాలకు కూడా దీని వల రిజర్వేషన్ సౌకర్యం కలిగింది . ఇంక నదుల ద్వారా జల రవాణా విషయంలో శ్రద్ద తీసుకున్నారు . ఇక్కడ నుండి మత్స్య సంపద బయటి ప్రాంతాలకు వెళ్లాలి . అలాగే వ్యవసాయ ఉత్పత్తులు కూడా , వీటి విషయంలో ముందు చూపుతో వున్నారు . సరదాగా చెప్పాలంటే ఇక్కడ భూమి లేదు కాబట్టి దాని విమానాశ్రయం కూడా తీసుకువచ్చేవారేమో . అంతేకాదు భవిష్యత్తులో రైలు యానాంలో ఆగుతుందేమో ఇక్కడ అలాంటి భౌతిక పరిస్థితి లేకున్నా కార్యరూపంలోకి రాలేదుకాని ఇది ఆయన మదిలో ఎప్పుడో వుందని తెలిసింది . దటీజ్ మల్లాడి ! ఇక్కడ కరెంటు తీగలపై బట్టలు ఆరవేయడం కుదరదు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది గాని ఇప్పటికీ విద్యుత్ వెలుగులకు నోచుకోని ఎన్నో మారుమూల గ్రామాలు వున్నాయి . నా చిన్నప్పుడు ఓ పుస్తకంలో చదివాను – కమ్యూనిజం ఉన్నతస్థాయిని గుర్తించటం అంటే ఒక్కక్షణమైనా కరెంట్ పోకపోవటం అని . పరిశ్రమల నుండి ప్రజల ఏ అవసరాలకయినా ఇది వర్తిస్తుంది.

119 అయితే ఇదేదో ఓ దేశానికో , కొన్ని ప్రాంతాలకో కాదు . మొత్తం ప్రపంచం ఈ స్థాయికి చేరుకోవాలి . ఈ మాటలు అన్నది ఎంగెల్సా , లెనినా అన్నది నాకు గుర్తు లేదు . ప్రస్తుతం యానాంలో నిరంతర విద్యుత్ వుంది . ఓ చిన్న ప్రాంతంలో అయినా ఇలాంటి అభివృద్ధిని సాధించటం చిన్న విషయం కాదు . అందుకు ముఖ్య కారకుడు మల్లాడి కృష్ణారావు . ఇది ఒక్కరోజులో సాధ్యం అయింది కాదు , అంతకుముందు కరెంట్ పరిస్థితి ఎలా వున్నా , 1996 నవంబరులో భయంకరమైన తుఫాన్ యానాంని కుదిపేసింది . నెల రోజులపాటు కరెంట్ సరఫరా లేదు . ఆ రోజులను మల్లాడి గుర్తు చేసుకుంటూ – “ అదో ప్రకృతి విలయం . జరిగిన నష్టం నుంచి కోలుకోవాలంటే ముందు కరెంట్ కావాలి . మన దగ్గర లక్షలూ , కోట్లు వుండవచ్చు. ఇలాంటి సమయాల్లో గుప్పెడు బియ్యం దొరకకపోవచ్చు . కనీసం చిన్న దీపపు కాంతి కూడా చాలామంది చూడలేరు . | అప్పటికే లాంతర్లు లాంటి వాటిని అటకెక్కించిన వారున్నారు . ఇంకొందరు కొనటం మానేశారు . అందరూ తిరిగి వాటిని కొన్నారు . నెల రోజుల పాటు అంతా చీకటి . అప్పుడు అనుకున్నాను . యానాంలో కరెంట్ ఉత్పత్తికి అవకాశం లేదు . బయట నుంచి తెచ్చుకోవాలి . అందుకు చేయాల్సింది చాలా వుంది . ముందు యానాంని కరెంట్ పోని ఊరుగా మార్చాలి . అంతేకాదు రానున్న దశాబ్దాలకు సరిపోయేంత విద్యుత్ ని ఏర్పరుచుకోవాలి అని . మనం ఎన్నో అనుకుంటాం . అవన్నీ వెంట వెంటనే.
[4:29 PM, 9/11/2019] Sam👨🏼‍🚀: 120 ) కుదరవు . ఏం చేయాలన్నా ముందు నిధులు కావాలి . అంతేకాదు పక్కవారి నుండి అనేక అభ్యంతరాలు వుంటాయి . వారి అవసరాలుంటాయి . ఇవన్నీ సమన్వయం చేసుకోవాలి . అందుకు నా వంతు కృషి మొదలయింది ” ముందుగా పడిపోయిన , వంగిపోయిన స్తంభాలను , అలానే విద్యుత్ లైన్లను పునరుద్దరించారు . రామచంద్రపురం నుంచి వచ్చే 33 / 11 కె . వి లైన్ కోసం బోనం గార్డెన్ లోని సబ్ స్టేషన్ ని నిలిపివేసి కొత్త నిర్మాణం జరిపారు . కాకినాడ సామర్లకోట మీదుగా మెట్టకూరు వచ్చే 132 / 11 కె . వి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం జరిపారు . 2009వ సంవత్సరంలో యానాం శివారు ప్రాంతమైన దొమ్మేటి పేట సమీపంలో రూ ! తొమ్మిది కోట్ల నలభై లక్షలతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించారు . 33 / 11కె . వి సామర్థ్యంతో స్థాపించిన ఈ సబ్ స్టేషన్ ఇక్కడి పరిసరప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్ కొరతను తీర్చింది . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అనేక చర్చలు చేసి యానాం ప్రత్యేకత దృష్ట్యా , ఎలాంటి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ ని అందించటానికి మల్లాడి చర్యలు తీసుకున్నారు . దొమ్మేటిపేట , సావిత్రి నగర్ , గిరియాం పేట , దరియాల తిప్పలాంటి మారుమూల ప్రాంతాలతో పాటు కొత్తగా ఏర్పడిన కాలనీలన్నింటకి విద్యుత్ వెలుగులు ప్రసరించటం వెనక మల్లాడి నిరంతర కృషి వుంది . దీంతోపాటు ప్రతి గ్రామంలోనూ వీధి దీపాలు , హైమాస్ట్ దీపాలను ఏర్పాటు చేస్తారు . యానాంలో ఇరవై మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగించుకునే అవకాశం వుంది . . ఇప్పుడు మన జీవితంలోకి అనేక కొత్త ఉపకరణాలు వచ్చాయి . అవి వంట చేసుకోవటం నుండి మొదలై వినోదం , విశ్రాంతి తీసుకునే వరకు . ఒకప్పుడు విసనకర్రల నుండి ఫ్యాన్లు , ఆ తర్వాత ఎయిర్ కండిషనర్ల వరకు ఆధునికత వచ్చింది . అయితే అవన్నీ విలాసాలుగా మారాయి . కొద్దిమందికి మాత్రం పరిమితం అయ్యాయి . యానాంలో మధ్యతరగతి వారికి మాత్రమే కాదు కింది తరగతుల వారు నేను . . నా ప్రజలు . . నా యానాం

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories