మల్లాడి రాజకీయ ప్రస్థానం గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు.

అత్యంత సాధారణ వ్యక్తిగా జీవితాన్ని మొదలు పెట్టి , అసాధారణ విజయాలను సాధించాడు . అవన్నీ వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదు . తను పుట్టి , పెరిగిన ఊరుకి లభించినవి. ఇక్కడ సామాన్యులకి లభించినవి. రేపు సాధించబోయే విజయాలకు పునాది యానాంలో అతను వేసాడు. రాబోయే తరాలకు‘ ల్లాడి’ తెలియకపోవచ్చు. యానాం చరిత్ర చదివితే మాత్రం వారు అతని జ్ఞాపకాల ముందు శిరసు వంచుతారు. ఇది అతిశయోక్తి కాదు.

మల్లాడి రాజకీయ ప్రస్థానం గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. 

1996లో ఎం . ఎల్ . ఎ పదవిని చేపట్టి అంచెలంచెలుగా క్యాబినెట్ స్థాయి మంత్రిగా ఎదగటం ఓ ఎత్తు . అధికారంలో వున్నా , ప్రతిపక్షంలో వున్నా మరిచిపోని అంశాల్లో క్రీడలు ఒకటి . “ నేను క్రీడాకారుడ్ని . ఆటలు అంటేనే కృషి , పట్టుదల , విజయం కోసం తపన , దీక్ష , జీవితంలో వచ్చే “చిన్న సమస్యలకు కుంగిపోయే వారు చాలామంది వుంటారు . నిజమైన క్రీడాకారులు అలా వుండరు . వారి ప్రయాణంలో ఓటమి ముఖ్యమైనది . అది క్షణంలో వెయ్యో వంతులో ఫలితాన్ని మారుస్తుంది . బాధ కలుగుతుంది . తిరిగి విజయం కోసం పరుగులు తీయాలి . ఏదీ యిక్కడ శాశ్వతం కాదు అనేది క్రీడల ద్వారా అనుభవంలోకి వస్తుంది .
ప్రపంచంలో ఏ రంగంలో అయినా ఎదుగుదలకు అడ్డంకి ఆర్థిక పరిస్థితే . తొలి రోజుల్లో మన గమనాన్ని నిర్దేశించేది అదే . అందరూ వీటిని అధిగమించలేరు . అందుకే ‘ యానాం ‘ ని క్రీడా పట్టణంగా మార్చాలనుకున్నాను . అందుకు కృషి మొదలు పెట్టాను అంటారు మల్లాడి . హైదరాబాద్‌లో 1997లో దక్షిణ భారత రాష్ట్రాల ప్రజా ప్రతినిధులకు క్రీడోత్సవాలు జరిగాయి . ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు , పుదుచ్చేరి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు . అందులో 100 , 200 , 400 మీటర్ల పరుగు పందాల్లోనూ , లాంగ్ జంప్ , షాట్ పుట్ పోటీల్లో మల్లాడి బంగారు పతకాలు సాధించటమే కాకుండా ‘ ఓవరల్ ఛాంపియన్ ‘ గా విజేతలయ్యారు .

వాలీబాల్ చరిత్రలోనే సువర్ణాధ్యాయంగా పేర్కొనే సంఘటన ఇది . 

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా మాణిక్యాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు భారతదేశ వాలీబాల్ సమాఖ్య ఆధ్వర్యంలో ‘ ఇండియన్ వాలీ లీగ్ – 2011 ‘ ని నాలుగు స్థాయిలలో బెంగళూర్ , చెన్నై , యానాం , హైదరాబాద్‌లలో నిర్వహించారు . ఇందులో ఆరు ఫ్రాంఛైజీలు వున్నాయి . చెన్నై సైకర్స్ , కర్ణాటక బుల్స్ , కేరళ కిల్లర్స్ , హైదరాబాద్ ఛాలెంజర్స్ , మల్లాడి నేత్రుత్వంలో యానాం టైగర్స్ వున్నాయి . మూడవ స్థాయి పోటీ వై . ఎస్ . ఆర్ . ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించారు . 
ఈ లీగ్ పోటీలలో యానాం టైగర్స్ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది . ఇందుకు కారకుడైన మల్లాడి క్రీడాకారులకు స్ఫూర్తిని అందించారు . పరుగుపందెం , లాంగ్ జంప్ , హైజంప్ , షాట్ పుట్ల్ని నిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ మల్లాడి జీవితాన్ని , ఆయన ఆచరణనీ ప్రతిబింబిస్తున్నాయి . రాజకీయాల్లోనూ ఇవి ఆయనకు ఆదర్శం అయ్యాయి . 1996కి ముందు మూడు దశాబ్దాలకు పైగా అభిరుచి వుండి కూడా , ఎలాంటి అవకాశాలు , వసతులు , ప్రోత్సాహం లేక ఆటగాళ్లు ఎన్నో యిబ్బందులు పడ్డారు . తమ ఆసక్తులను చంపుకున్నారు . 
రెండు దశాబ్దాల్లో అనూహ్యమైన మార్పులు జరిగాయి . మెట్టూరు ఉన్నత పాఠశాలలో సువిశాలమైన క్రీడామైదానం , గిరియాంపేటలో 400మీటర్ల రన్నింగ్ ట్రాక్ , ఇండోర్ స్టేడియం , దరియాలతిప్ప , సావిత్రి నగర్ ప్రాంతాల్లోనూ కనకాల పేటలో ఇండోర్ స్టేడియమ్స్ , క్రీడా మైదానాలు , క్రీడా ట్రాక్టు కోట్లాది రూపాయలతో సమకూర్చారు .
కోట్లాది రూపాయల నిధులతో జి . ఎం . సి . బాలయోగి క్రీడా ప్రాంగణాన్ని ఆధునీకరించి బాస్కెట్ బాల్ , ఫటీబాల్ , టెన్నీస్ , వాలీబాల్ , కోకో కోర్టుల సముదాయం ఏర్పరిచారు .
డాక్టర్ వై . యస్ . రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ స్థాయి ఇండోర్ స్టేడియం , స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలకు 20 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి . దీనిని క్రీడా కాంప్లెక్స్ గా మార్చారు . క్రీడాకారులకు అటు చదువులు ఇటు ఆటల మీద సమయం వినియోగించటానికి , అన్ని ఆధునిక వసతులతో స్పోర్ట్స్ హాస్టల్ నిర్మాణం జరిగింది . కారైకాల్ , మాహే లలో లేని విధంగా యానాంలో ప్రత్యేక కోచ్‌లను క్రీడామంత్రిగా వున్నప్పుడు నియమించారు .
క్రీడాకారులందరినీ ఒక తాటిపైకి తేవటానికి క్రీడా క్లబ్‌లను స్థాపించారు . 1998లోనే ‘ యానాం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డెవలప్ మెంట్ అథారిటీ ‘ పేరుతో క్రీడా సంస్థ ఏర్పాటయింది . ఒకప్పుడు యానాం క్రీడాకారులు ఆంధ్రా ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది . ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండే కాకుండా ఇతర దేశాల క్రీడాకారులు యానాం వస్తున్నారు . జిల్లా , రాష్ట్ర సౌత్‌జోన్ , జాతీయ , అంతర్జాతీయ క్రీడా పోటీలను యానాంలో నిర్వహిస్తున్నారు .
ఇంతకుముందు పేర్కొన్నవే కాకుండా చదరంగం , కోకో , వాలీబాల్ , బాస్కెట్ బాల్ , షటిల్ , బాల్ బ్యాడ్ మింటన్ , అథ్లెటిక్స్‌లో ఎన్నో విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు , వీటిని ఇక్కడి క్రీడాకారులు సద్వినియోగం చేసుకుంటున్నారు . వివిధ స్థాయిల్లో రాణిస్తున్నారు . ఇండియన్ వాలీబాల్ టీమ్‌లో ప్లేయర్‌గా పాకలపాటి శ్రీకాంత్ ,
ఇండియన్ జూనియర్ బాస్కెట్ బాల్ టీమ్‌లో ప్లేయర్‌గా కనకాల సురేష్ , రక్ష హరికృష్ట జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పబ్బినీడి శేఖర్ , మల్లాడి తేజ , రోళ్ల దుర్గారావు లాంటివారు అగ్రభాగంలో నిలిచారు . 
యానాంకి పేరు తెచ్చిన , విశేష ప్రతిభావంతుల్ని , వృద్ద క్రీడాకారుల్ని మల్లాడి సారధ్యంలో పని చేస్తున్న యానాం వృద్ధాశ్రమం ద్వారా సముచితంగా సత్కరించటంతోపాటు ఆర్థికసాయం , ప్రయాణ ఖర్చులు , క్రీడా దుస్తులు , పౌష్టికాహారం సమకూర్చుతున్నారు . వేసవిలో అన్ని క్రీడాంశాల్లో చిన్నారులకు శిక్షణా తరగతులు , వ్యాయామ ఉపాధ్యాయులు , కోచ్‌ల నియామకాలు జరిగాయి . పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు రాష్ట్ర , జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో కోచ్‌లుగా వ్యవహరించిన ఘనత యానాంకి దక్కింది .

మల్లాడి క్రీడా స్ఫూర్తిని గుర్తించిన అప్పటి పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం పుదుచ్చేరి మంత్రివర్గంలో ప్రత్యేకంగా మల్లాడి కోసమే క్రీడలు. 

యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖను , గవర్నర్ ద్వారా జీ . ఓ . జారీ చేయించి ఆ రెండు శాఖలను సైతం మల్లాడికి అప్పగించారు . క్రీడాశాఖమంత్రిగా మల్లాడి పని చేయటం అద్భుత విశేషం . అప్పుడు క్రీడాకారుల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలను ఇప్పటికీ అమలు చేయించటం గొప్ప విషయం . ఒక్కసారి యానాం దర్శిస్తే ఎవరయినా ఇక్కడ ఏం జరిగిందో , ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూడవచ్చు . అందుకే క్రీడాకారులు మల్లాడిని సదా స్మరిస్తుంటారు . “ ఆకాశం నీ హద్దురా , అవకాశం వదలొద్దురా ” అని క్రీడాకారుల చెవి దగ్గర అనుక్షణం మల్లాడి పాడుతున్నట్లు వుంటుంది .

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories