మల్లాడి వెన్నెముకలు దేశానికి రైతు వెన్నెముక అంటాం. అందరికీ అన్నం పెట్టే వారిగా రైతులను , కీర్తిస్తాం .

ప్రోత్సాహకాలు : నేను ఎమ్మేల్యేగా ఎన్నిక కాక ముందు ‘ యానాం’ కి నీళ్లు లేవు . కరెంట్ లేదు. గుడిసెలతో వుంది. ఎక్కడ చూసినా అపరిశుభ్రత . అందరికీ అన్ని సదుపాయాలు కల్పించాలి. ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లాలి. యానాంని గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయికి తీసుకువెళ్లాలి. పక్కవారికంటే ఎక్కువ సౌకర్యాలు వుండాలి. ఇదీ నా ఆలోచన. ముందు పేదవారి తక్షణ సమస్యల్ని పరిష్కరించాక అభివృద్ధి, యానాంని టూరిస్ట్ కేంద్రంగా మార్చే కార్యక్రమం తీసుకున్నాను. అలా చేసి వుండకపోతే నేను కూడా సంపన్నుల కోసమే పని చేస్తున్నాను అనే భావం పేదవారిలో బలపడేది . 

మల్లాడి వెన్నెముకలు దేశానికి రైతు వెన్నెముక అంటాం . అందరికీ అన్నం పెట్టే వారిగా రైతులను , కీర్తిస్తాం.

మనం నాలుగు ముద్దలు తింటున్నప్పుడు మాత్రం రైతు గుర్తుకి రాడు. అదో విషాదం . మనం మట్టి వాసన గురించి కవిత్వాలు చదువుతాం. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు సంతాపం ప్రకటిస్తాం . ప్రభుత్వాలు రైతు సంక్షేమం గురించి గొప్ప మాటలు చెబుతాయి. ఇవన్నీ ఆచరణలో జరుగుతున్నాయా అనేది రైతులు మాత్రమే కాదు – అన్నం తింటున్న వారందరూ ఆలోచించాలి.
మల్లాడి వ్యవసాయం గురించి రకరకాల అభిప్రాయాలు రాజకీయ నాయకుల్లోనూ , మేధావుల్లోనూ వున్నాయి. ‘ వ్యవసాయం దండగ ‘ అని ఎవరన్నా అంటున్నారంటే వారి దృష్టిలో నగరీకరణ, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇలాంటివి వుంటాయి . ఆ రంగాల నుండి ఆదాయం సమకూర్చుకుంటే ఎంత ఖర్చయినా విదేశాల నుండి తిండి ధాన్యాల నుండి ఏదయినా దిగుమతి చేసుకోవచ్చు అంటారు. నిరంతరం అతివృష్టి, అనా వృష్టిలాంటివి, తుఫాన్లు పంటలను నాశనం చేస్తుంటాయి. ఆ రకంగా వ్యవసాయం జూదంగా మారిపో యింది అనుకుంటారు . మన దేశంలో నూటికి డెభైమందికి పైగా భూమిని నమ్ముకుని బతుకుతున్నారు . అలాగే నేను . . నా ప్రజలు . . నా యానాం

ఈ రోజున ఎత్తయిన భవనాలు కట్టవచ్చు . పరిశ్రమలు పెరగవచ్చు వాటికి ముడి సరుకులు భూమి నుండే వస్తాయి . 

ఉల్లిపాయ, కందిపప్పు ధరలు పెరిగినప్పుడు షేర్ మార్కెట్లు కుప్పకూలాయి. – ప్రభుత్వాలు మారిపోయాయి. జనం అల్లాడిపోయారు . విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికప్పుడు పంటలు వేయాల్సి వచ్చింది . అదీ వ్యవసాయానికి వున్న శక్తి . అది రైతులనే దెబ్బ కొట్టదు. తిండి తినే ప్రతి వారినీ వణికిస్తుంది అనే మల్లాడి అభిప్రాయంలో అక్షర సత్యం వుంది. అప్పటిదాకా సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. అసలు యానాంలో వున్న భూమి స్వల్పం . 
అందులోనూ అనేక సమస్యలు. అసలు వ్యవసాయం అనేది అత్యంత భారీ పరిశ్రమలాంటిది . విత్తనాల దగ్గర్నుండి పంట ఇంటికి చేరే వరకూ సుదీర్ఘ క్రమం వుంది. అందుకే జరగవలసిన పనులన్నింటినీ ఆకళింపు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి అన్ని రకాల వ్యవసాయపు పనులు చేసిన అనుభవం మల్లాడికి వుంది. అందులోని యిబ్బందులు ఆయనకు తెలుసు . సముద్ర తీరప్రాంతం కావటంతో చవుడు భూములుం టాయి . పంటలు పండే భూముల్లో కూడా మిగతా ప్రాంతంలో వచ్చే దిగుబడి రాదు . దరియాలతిప్పలో ఐలెండ్ భూమి నెంబర్ 3లో 191 ఎకరాలు వుంది . 
వాటిని రెండు పంటలు పండించే భూములుగా మార్చటంలోనే మల్లాడి నైపుణ్యం అర్థం అవుతుంది . ఇదంతా ఆయన చలవే అంటారు యస్ . సి . రైతులు . అనేక చోట్ల ఇలాంటి భూములకు పట్టాలు యిచ్చి ఇన్ని వందల , వేల ఎకరాలు యిచ్చాం అని ప్రభుత్వాలు లెక్కలు చెబుతుంటాయి తప్ప తర్వాత పట్టించుకోరు. అవి సాగుకి పనికిరాక అయిన కాడికి అమ్ముకుంటారు లబ్దిదారులు. ఎప్పుడన్నా సెజుల లాంటివి వస్తే వివాదాలు ముసురుకుంటాయి. ఈ భూములను రైతుకి ఎకరం చొప్పున యస్. సి.లకు పట్టాలు యిప్పించింది మల్లాడే. అప్పుడు ఇక్కడ పంటలు పండించటం అసాధ్యం అని అందరూ అనుకున్నారు . 
వెంటనే ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి . పంట కాల్వలు తవ్వారు . అలాగే చెరువులు తవ్వారు . మోటార్ల ద్వారా సాగునీరు తోడించారు . పాండిచ్చేరి నుండి ప్రొక్లెయిన్లు తెప్పించారు . ఎత్తు పల్లాలను సరి చేసారు . దరియాల తిప్పలోని ఊట కాలువను బాగు చేయించారు . ఇక్కడే కాదు యానాంలోని అన్ని పంటకాలవలకు , ఊట కాలవలకు రాయి పేర్చటంతో వ్యవసాయానికి మేలు జరిగింది . అలా యానాం భూములు సస్యశ్యామలం అయ్యాయి . నేను . . నా ప్రజలు . . నా యానాం

ఇప్పుడు అక్కడ ఎకరానికి ముపై బస్తాల ధాన్యం పండుతుంది . అపరాలూ పండిస్తున్నారు. 

1 . 40 , కోట్లతో పంట భూములలోకి ఉప్పు నీరు వెళ్లకుండా రక్షణ గట్లు , రివిట్జెంట్ పనులు చేపట్టారు . ఈ భూముల్లో కొబ్బరి మొక్కలు , సరివి మొక్కలు పెంచటం కోసం సబ్సిడీ మొక్కలు సరఫరా చేయించారు . ఈ భూముల్లోకి రోడ్లు ఏర్పాటు చేయటానికి నిధులు కేటాయించారు . పంట నష్టం వచ్చినప్పుడు హెక్టారుకు 20 వేల రూపాయలు నష్ట పరిహారం కింద చెల్లించారు . ఆంధ్రప్రదేశ్ అధికారులతో సంప్రదించి దరియాల తిప్ప ఆయకట్టులో రెండవ పంటకు అధికారంగా ప్రతి ఏటా నీరు అందించే ఏర్పాటు చేశారు . ఈ విషయంలో రైతుల కంటే మల్లాడి ఎక్కువ ఆరాటపడ్డారు .

 రైతు తత్వం అలానే వుంటుంది . . ఫ్రెంచి కెనాల్ ప్రవాహం మెల్లగా వుండేది . దాని వేగం పెంచటాని

కి ఆంధ్రా కాలువలను కూడా బాగు చేయాలి . ఆ పనీ తన భుజాన వేసుకున్నారు . ఇప్పుడు ఎక్కడ చూసినా విత్తనాలు పెద్ద సమస్య . నకిలీ విత్తనాల వలన , సమయానికి రైతులకు విత్తనాలు అందించలేకపోవటం వల్ల రైతులు కుదేలు అవుతున్నారు . అందుకోసం మినీ అగ్రికల్చర్ ఫామ్ ఏర్పాటు చేసి వరి విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు . ఇక్కడ మేలు రకం విత్తనాల నుండి కొబ్బరి మొక్కల దాకా అభివృద్ధి చేసి సబ్సిడీ మీద ఇస్తున్నారు . 

ఒకప్పుడు వ్యవసాయరంగంలో స్త్రీలు ముఖ్య పాత్ర పోషించారు.

తర్వాత నాట్లు వేయడం , కలుపు తీయటం లాంటి పనులకు పరిమితం అవటం వేరే సంగతి . ఇప్పుడు తిరిగి మహిళలకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల మీద అవగాహన కల్పించాలి . అందుకోసం రైతు విజ్ఞాన యాత్రల్లో వారిని పాల్గొనేలా చేసారు . అలాగే రైతులకు కూడా వ్యవసాయంలో ఆధునికంగా వస్తున్న మార్పుల గురించి , ఆ పద్దతుల అమలుకు శిక్షణ యిప్పించారు . అధిక దిగుబడితో పాటు , నేలను మరింత సారవంతం చేసుకోవాలి . నేను . . నా ప్రజలు . . నా యానాం
‘ ఆత్మ ‘ అనే ప్రాజెక్టును అదే సంవత్సరం నెలకొల్పారు . ఇది కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేదే . ఇలా వ్యవసాయానికి చెందిన అన్ని రకాల అనుబంధ శాఖలన్నీ ఒక చోట కేంద్రీకరించేలా , తద్వారా సమన్వయం చేసుకునేలా చేయగలిగారు . కేవలం పంటలు పండించటమే కాదు . నీటి కోతను నివారించటానికి అడవులు పెంచాలి . మడ అడవులను సంరక్షించుకునే కార్యక్రమం అదే . ఇందుకు మరో బోటు వుంది . సిబ్బంది వున్నారు . అలాగే ఎరువులు , పురుగు మందులు లాంటి వాటి మీద యస్ . 

సిలకు 75 శాతం ఇతరులకు 50 శాతం రాయితీలు కల్పించారు . 

పుదుచ్చేరి ప్రభుత్వం వరి పండించే రైతులకు ప్రోత్సాహంగా హెక్టారుకు నాలుగు వేల రూపాయలు ఇస్తుంది . పంట ఏ కారణం వల్ల నష్టపోయినా హెక్టారుకు 20 వేల రూపాయలు ఇస్తారు . రైతులతో పాటు ఎప్పుడూ కూలీలు వుంటారు . వారి సమస్యలు ముఖ్యం . రైతు కూలీ బీమా పథకం కూడా మల్లాడి పదవిలోకి వచ్చాక సాధ్యం అయింది . ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు దెబ్బతిన్నా మల్లాది వెంటనే కార్య రంగంలోకి దూకుతారు . ఇలాంటి వాటిని పట్టించుకోక రైతు మానాన రైతుని వదిలేస్తే అటు ఆత్మహత్యలు చేసుకోవటమో , లేదా వ్యవసాయ రంగం మీద మక్కువ తుడిచి పెట్టుకుపోవటమో జరుగుతుంది . ఇటీవల కొన్ని జిల్లాల్లో క్రాఫ్ హాలీడే ‘ ని ప్రకటించటం రానున్న ప్రమాదానికి సూచన . 
ఇది ప్రకృతి విలయాల కంటే భయంకరమైన పరిణామం అవుతుంది . ఎందుకు పంటలు పండించాలి అని రైతు అనుకుంటే జరిగేది ఏంటో ఆలోచించుకోవాలి . అందుకే మల్లాడి ఇలా అంటారు . “ మనకు వున్న భూమి తక్కువ . అందులో వ్యవసాయ భూమి మరీ తక్కువ . అందుకే సూది మొన మోపినంత భూమి కూడా మనకు అపురూపమే . 

Conclusion :

వానంటూ కురవని ఎడారుల్లో నీటి చుక్కకి ఎంత విలువ వుంటుందో ఇదీ అంతే . అందుకే సిబ్బందికి చెబుతుంటాను . యానాంలో 622 మంది రైతులు వున్నారు . మీ సిబ్బంది 60 మంది వున్నారు . ఒక్కొక్కరు పది మంది రైతుల కోసం సిన్సియర్ గా పనిచేస్తే ఉన్న భూమిలోనే మనం స్వయం సమృద్ధి సాధించగలం.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories