రాజకీయ ప్రస్థానం

మల్లాడి గొప్ప విద్యావేత్త కాదు. జ్ఞానం పుస్తకాలనుంచే రాదు. పుస్తకాల్లో రాని ఎన్నో అనుభవాలు జనం దగ్గర వుంటాయి. వారితో మమేకం అయిన వారు ఆ రత్నాలను ఏరుకుంటారు.

నా రాజకీయ జీవితాన్ని గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. అప్పట్లో నాకు రాజకీయాల మీద అవగాహన తక్కువగా వుండేది. అంత ఉత్సాహం కూడా చూపించేవాడిని కాదు. అదో అందమైన ప్రపంచం. ఎంత వున్నా, లేకపోయినా, స్నేహితులతో సరదాగా గడిచిపోయింది. 20 సూత్రాల పథకం లాంటి వాటి ద్వారా ఇందిరాగాంధీ పేదల కష్టాలు తీరుస్తున్నారనిపించేది. తను మంచి చేయాలనుకున్నప్పుడు ఎంతటి పెదవారినైనా ఢీకొని ధైర్యంగా పోట్లాడగలరు. అందులోనూ మహిళగా ఇలాంటి పనులు చేయటం నాకు ప్రేరణగా వుండేది.

 

ఆ తర్వాత నా రాజకీయ గురువు రక్ష హరికృష్ణ గారిని దగ్గరగా చూసేవాడ్ని, ఆయన మాటలు విన్నాను. ఆయన ఎప్పుడూ పేదవారు, కార్మికుల సమస్యల మీద పోరాటాలు చేస్తుండేవారు. రిప్రజెంటేషన్ ను

ఎలా ఇవ్వాలి, పేపర్లను ఎలా జాగ్రత్త చేసుకోవాలి పొనుగుమట్ల విష్ణుమూర్తిగార్ని చూసి నేర్చుకున్నాను. నేను ప్రజాప్రతినిధిని కావాలనుకున్నప్పుడు బత్తిన సుబ్బారావు ఎమ్మెల్యేగాను, మంత్రిగాను ఎంతో నిరాడంబరంగా వుండేవారు. ఆయన నిజాయితీగా ప్రజాసేవ ఎలా చేయాలనే అంశం మీద నాకు చెప్పిన మాటల్ని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను.

  • స్పీకర్ జి.ఎం.సి. బాల యోగి గారిని నేను నిశితంగా గమనించాక స్వంత కులానికి చెందిన వారి సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి. ఇతర కులాల వారితో ఎలా మసలుకోవాలి అనేది
  • తెలుసుకున్నాను. పాండిచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేసిన జానకిరామన్గారు అయిదవ తరగతి
  • మాత్రమే చదువుకున్నారు. ఆయన ఎంతో వాస్తవికంగా ఆలోచించేవారు. నిరాడంబరంగా వుండేవారు.

సి. ఎమ్ రంగసామితో కూర్చుని మాట్లాడేటప్పుడు

ప్రజల సమస్యల మీద గాని వారికి కలిగించే సదుపాయాలు గానీ అధికారుల్ని పూర్తిగా వాటిలో లీనం అయ్యేలా చేసే విధానం ఆకర్షణీయంగా వుండేది. కాగితం మీద రాసుకోక పోయినా అవసరమైన సమయంలో చెప్పగల జ్ఞాపకశక్తి ఆయన స్వంతం. ఆయనెంతో నిరాడంబరంగా వుంటారు. ముఖ్యమంత్రి అనే భావం వుండదు. ప్రతి వారికీ సాయం చేయాలనే చూస్తారు. వారి నుంచి చాలా నేర్చుకున్నాను.చిన్న లాయరుగా జీవితాన్ని మొదలు పెట్టి, దేశ రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా రాణించిన నారాయణ స్వామి నాకు గుర్తుంటారు.
  • అప్పటి ముఖ్యమంత్రి వైద్యలింగం తక్కువ నిధులున్నా సమన్వయంతో ప్రభుత్వాన్ని ఎలా7
  • నడపాలి అనే విషయంలో దిట్ట. .  వై.యస్. రాజశేఖరరెడ్డి గారితో నా స్నేహం ఆరు సంవత్స
  • రాలు మాత్రమే. ఆయన నా పట్ల చూపించిన ఆప్యాయత, ప్రేమాభి మానాలు, నాకిచ్చిన గౌరవాన్ని
  • ఎప్పుడూ మరవలేను. ఆంధ్రకూ- యానాంకు మధ్యనున్న ముఖ్యమైన విషయాల్లో ఆయన చొరవ నాతో పాటు యానాం ప్రజలూ మరిచి పోరు.

చంద్రబాబు నాయుడిది వాస్తవ దృష్టి

ఆయన ఐ.ఎ.ఎస్ అధికారులతో ఓ సీ.ఇ. ఓగా వ్యవ
హరించే తీరు నన్ను ఆకర్షిస్తుంది. ఎన్నికల్లో ఓడి పోయినా, పది సంవత్సరాలు పార్టీని నిలబెట్టడం,
కార్యకర్తలను నిలుపుకోవటంలో ఆయన కమిట్ మెంట్, ధైర్యం, ఆధునికంగా వస్తున్న మార్పుల్ని వెంటనే అందుకోవటం చెప్పుకోదగినవి. ఇలాంటి వారు ఎందరో వున్నారు. సందర్భాన్ని బట్టి మననం చేసుకుంటాను.
 
నేను నిజాయితీగా లోన్ తీర్చుకుంటూ క్రమంగా వ్యాపారంలో ఎదిగి ఆర్థికంగా భద్రమైన జీవితం డపాలని వుండేది. అందుకే తరుచుగా నేను అనుకోకుండానే ఈ రాజకీయ రంగంలోకి వచ్చాను అని బుతుంటాను.
 
అనుకోకుండా అనటం ఆ సంఘటన జరగకముందు సబ్సీడీతో కూడిన ఆ లోన్ రావాలంటే ఎమ్మెల్యే గారి సిఫార్స్ కావాలి. ఆయన్ని కలవలేని క్షణం నుండి నా ఆలోచనలు మారాయి. నేను రాజకీయాల్లోకి వాలనుకున్నాను.
 
అప్పటికీ నేను తొందర పడలేదు. రాజకీయాల్లోకి రావాలంటే మెడలో కండువా కప్పించుకోవటం కాదు. నేను కేవలం కార్యకర్త స్థాయిలో మిగిలిపోవాలనుకోలేదు. ఎవరికయినా ఆర్థిక పరిస్థితి బాగుండాలి. మనం ఏ చిన్న పని చేయాలన్నా, ఏ సేవలు చేయాలన్నా మన దగ్గర డబ్బు లేకపోతే సానుభూతి మాత్రం చూపించగలం. ప్రజా జీవితంలో అదొక్కటే చాలదని నాకు అర్థం అయింది.
 
నేను కొంతమందిని గమనించాను. వారు విదేశాల్లో బాగా డబ్బులు సంపాదించిన వారు కావచ్చు, పరిశ్రమలు స్థాపించిన వారు కావచ్చు, వారికి రాజకీయ పదవులు కావాలనిపిస్తుంది. అందుకు వారికుండే కారణాలు వారికి వుంటాయి. ఎన్నికలకు ముందు వారు కార్యకలాపాలు మొదలుపెడతారు.  లివేంద్రాలు, రోగులకు పండ్లు పంచటం లాంటి పనులు చేస్తుంటారు. సీట్ కోసం కోట్లు ఖర్చు చేస్తారు. ఎన్నికల్లో సీటు వచ్చిన దగ్గర్నుండి కోట్లు విరజిమ్ముతారు. ఓడిపోతే మాత్రం తిరిగి పాత వ్యాపార, వ్యవహారాల్లోకి వెళ్తారు. కొంతమంది ఎం. ఎల్. సిలుగా రాజ్యసభ ఎం. పీలుగా ఎన్నికవటానికి ప్రయత్నం చేస్తారు.
 
ఇది కూడా నేను గమనించాను. నా దగ్గర కోట్లు లేవు. నేను వెనకబడిన తరగతికి చెందినవాడిని. ఆర్థికంగా వున్నవాడ్ని కాదు. ప్రజలకు దగ్గరగా, వారిలో ఒకడిగా కనిపించాలి. ప్రజల ఆదరణ పొందాలి. అదొక్కటే మార్గం. సుదీర్ఘకాలం రాజకీయాల్లో వుండాలంటే మాత్రం అగ్రవర్ణాలకయినా, బి.సి.లకైనా,  ళితులకయినా
ఇదే మార్గం. కొందరు పార్టీ పేరు మీద బతకవచ్చు. కొందరికి మినహాయింపులు వుండొచ్చు. నాలాంటి వారికి ఆర్థికంగా బలపడే అవకాశం తక్కువ. అధికారంలోకి వచ్చాక వారు సంపాదించినా, అవి స్వంతానికి తప్ప ప్రజలకు వినియోగించరు. నేను ముందుగా వ్యాపారం మీద దృష్టి సారించాను.
 
మూడు సంవత్సరాల్లో లోన్లు అన్నీ తీర్చేయటమే కాకుండా కారు, పొలాలు కొనుక్కునే స్థితికి రుకున్నాను. అప్పటి నుండి నేను ప్రజా జీవితంలోకి రావాలనుకున్నాను. జున్నూరు భానుమతి గారి ఇంట్లో 1989 డిసెంబర్ 23న ముఖ్యులతో సమావేశం అయ్యాం . నా అభిమతం గురించి చెప్పాను. వాళ్లు నాకు మద్దతు పలికారు. నువ్వు రాజకీయాల్లో రాణించగలవన్నారు.
 
అప్పటి నుంచి నా సేవలు మొదలయ్యాయి. నేను చదువుకునే రోజుల్లోనే నా తోటి విద్యార్థులను కదిలించేవాడ్ని. ఎన్నికలప్పుడు ఉత్సాహంగా పని చేసేవాడ్ని. మేం క్రీడల నిమిత్తం …. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి చాలా తక్కువ డబ్బులు యిచ్చేవారు. అవి ఏ మూలకూ చాలవు, ఇంట్లో తమ పిల్లలకు పది రూపాయలు కూడా యివ్వగలిగిన పరిస్థితి వుండేది కాదు. క్రీడల మీదా, ఇతర రంగాల్లో ఎంత మమకారం వున్నా, ఎంత ప్రతిభ వున్నా మానే సేవారు. వారం
రోజుల పాటు వుండాల్సి వచ్చేది. అప్పుడు నేను కొంతమందికి కొంత నగదు యిచ్చి వారిని తీసుకు వెళ్లేవాడిని. అందులో ఎక్కువమంది యస్.సి, బి.సి విద్యార్థులే.

ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేనూ

 
, నా మిత్ర బృందం ముందుండేవాళ్లం. అవి రోగాలు కావచ్చు. వర్షాలు – తుఫాన్లు కావచ్చు. అవి వచ్చి జన జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు బియ్యం పంచటం, పులిహెూర పొట్లాలు, ఇతర నిత్య జీవితావసర వస్తువులు యిచ్చేవాళ్లం. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కుండలకొద్దీ నీళ్లు మోసేవాళ్లం. లోతట్టు ప్రాంతాల్లో ఇంజన్లు పెట్టి తోడించేవాడిని. బాధితులకు వీలయినంత సహాయం చేయటంతో ఓ సంవత్సర కాలంలోనే నన్ను తమ నాయకుడిగా గుర్తించటం మొదలయింది.
 
అప్పటి ఎమ్మెల్యే వెలగా రాజేశ్వరరావు గారు పాండిచ్చేరిలోనే వుండేవారు. ముఖ్యమంత్రులు, మంత్రులు వచ్చినప్పుడు వారితో పాటు ఆయన అతిధిగా వచ్చేవారు. వారు జరిపే సమావేశాలకు వంద లోపు జనం మాత్రమే వుండేవారు. ప్రభుత్వం అంటేనే ఆలస్యంగా పనులు జరుగుతాయి. తుఫాన్లు పంట నష్టాలను అంచనా వేయటానికి వచ్చేటప్పటికే కొంత స్థిమిత పడుంటారు. అందుకే వందల కోట్ల నష్టం
 
జరిగితే వారు విదిలించేది తక్కువ. అందుకే ప్రత్యక్షంగా మేం కనిపిస్తున్నాం. మాకు అధికారం లేదు. అధికారంలో వున్న ప్రజాప్రతినిధి అందుబాటులో వుండేవారు కాదు. ఈ తేడా వారి మనసుల్లోకి చొచ్చుకు పోయింది. అయితే ఈ మూడు సంవత్సరాల్లో నా సంపాదన వెనక్కి మళ్లింది. పొలాలు అమ్మాను. అసలు నేను సంపాదించుకున్నది ఇందుకే. ఇలా ఎందుకు చేస్తున్నావని నా భార్య అడగలేదు. నాతో పాటు ఇంకొందరు నాతో ముందుకు వచ్చారు. ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్లు ఖర్చు పెట్టేవారు. | రక్ష హరికృష్ణ గారి నేతృత్వంలో కాంగ్రెసేతర ప్రతిపక్షాలూ, ప్రజా సంఘాలతో, యానాం పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేసాం. అక్కడ నుండి అనేకానేక సమస్యల మీద పని చేసాం. 260 మంది పేదల ప్రతినిధులతో చలో పాండిచ్చేరి ఉద్యమం నడిపాం. అధికారంలో వున్న వారిని ఊపిరి తీసుకోనివ్వ లేదు. ఈ సమస్యలన్నిటిలోనూ నేను చురుగ్గా పని చేసాను.
 
నేను కార్మికుల సమస్యల మీద మాట్లాడేవాడిని. నేను మా గురువు రక్ష హరికృష్ణ, విష్ణుమూర్తి రీజెన్సీ కార్మికుల పక్షం. అప్పటి ప్రజా ప్రతినిధి మేనేజిమెంట్ పక్షం. యాజమాన్యానికి అనుకూలంగా కార్మిక సంఘాన్ని తన సామాజిక వర్గం వారితో చీల్చి ఒప్పందం చేయించారు.
1990 ఎన్నికల్లో రక్ష హరికృష్ణగారు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అదే సంవత్సరం చివర్లో ప్రభుత్వం పడిపోయింది. 1991లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో హరికృష్ణగారు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన నిరాశ పడిపోయి.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories