సమ్మె సందర్భంగా పోలీసు స్టేషన్ ముందు కార్మికులు ఆందోళన చేస్తున్నారు.

కొత్తగా వచ్చిన రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి జవహర్ మేనేజ్మెంట్ కి 2 కార్మికులకు గాని నచ్చచెప్పలేకపోయాడు . అందువల్ల ఇద్దరి మధ్య వైషమ్యాలు రేగాయి . సమస్య పెద్దదయింది . ఆంధ్రా నుండి మాజీ ఎమ్మెల్యే , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు , ఎం . ఓ . హర్షకుమార్ గార్లు కార్మికుల పక్షాన వున్నారు . అక్కడ కొంతమంది రెచ్చగొట్టే ప్రకటనలు చేసారు . ఇక్కడి ఎడ్మినిస్ట్రేషన్ వీటిని సీరియస్గా తీసుకోలేదు . కనీసం ప్రభుత్వానికి తెలియచేయలేదు .నేను జనవరి 10న చైనా పర్యటనకు వెళ్లి 23న ఢిల్లీ వచ్చి పనులు ముగించుకుని 27వ తేదీ ఉదయం 4 గం” లకు పుదుచ్చేరి చేరుకున్నాను .

సమ్మె సందర్భంగా పోలీసు స్టేషన్ ముందు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 

వారి నాయకుడు మురళీమోహన్ కి అకస్మాత్తుగా ఆరోగ్యంలో మార్పు వచ్చింది . వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్తాం అన్నారు కొందరు. వారిలో వారికి తీవ్ర వాదోపవాదాలు జరుగుతుండటం వల్ల ఆలస్యం అయింది. చివరి నిముషంలో తీసుకు వెళ్లినప్పటికి మురళీమోహన్ చనిపోయారు . ఇంక ధ్వంసం మొదలయింది . ఫ్యాక్టరీ, ఊరు , కాలేజ్ , ఫర్నిచర్ అంతా విధ్వంసం. కె. సి. చంద్రశేఖర్ ని హత్య చేసారు . నాయుడిగారితో నేను మాట్లాడి చాలా కాలం అయింది. అప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి కే . సి . చంద్రశేఖర్ ని చంపేస్తారు అని చెప్పారు . ఆయన కుటుంబానికి అన్యాయం జరిగిపోయింది . యానాంలో ఉద్రేకాలు అరుపులకీ , నిరసనలకి మాత్రమే పరిమితంగా వుంటాయి. ఈ సంఘటనలో బయటి శక్తులు , రౌడీలు ప్రవేశించారు . జరగరానిది జరిగిపోయింది. 27 రాత్రికి నేను యానాం వచ్చాను . జరిగిన విషయాలు అడిగి . తెలుసుకున్నాను.
కె.సి. చంద్రశేఖర్ కి సంతాప సభ పెట్టి యానాంకి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుని నివాళులందించాం . కొందరు మేం తిండిగింజలు లేక అల్లాడిపోతున్నాం అన్నారు . వెంటనే మా నాయకులు అందర్నీ పిలిచి సమావేశం అయ్యాం . 2 , 000 రూపాయల చొప్పున 1960 మంది కార్మికులకు అప్పటికప్పుడు అందచేసాం. పాఠశాలలు , కాలేజీల్లో ధ్వంసమైన ఫర్మిచర్ చోటులో విద్యార్థులకు , ఉపాధ్యాయ సిబ్బందికి కొత్తవి తయారు చేయించాను . కొంతమంది తీసుకు పోయిన వస్తు సామగ్రిని వెనక్కి తెప్పించాం . ఇది రెండు రాష్ట్రాల సమస్య గావున ఈ మొత్తం సంఘటనల మీద C.B.I ఎంక్వైరీ జరపమని మరుసటి రోజే విజ్ఞాపన పత్రాన్ని పంపించాను . నాయుడుగారి కుటుంబంతో నాకున్న స్నేహ సంబంధాల వల్ల ఫ్యాక్టరీని తిరిగి తెరిపించటానికి, కార్మికులకు న్యాయం జరగటానికి ప్రయత్నాలు చేసాను.. ఈ సమస్య అందరిదీ .

అందుకే అన్ని కమ్యూనిటీల వారిని రెండు బస్సుల్లో నాయుడిగారి దగ్గరకు తీసుకు వెళ్లాను. 

వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి . వ్యాపారాలన్నీ కుంటు పడ్డాయని వివరంగా చెప్పాను . ఆయన ఋణాల్లో 50 % తగ్గించమన్నారు . ఒన్ టైమ్ సెటిల్ మెంట్ , రుణాల చెల్లింపు వాయిదా – టాక్స్ హాలీడే లాంటివి అడిగారు . నేను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాను . ఫ్యాక్టరీకి లా కౌట్ ప్రకటించారు . కార్మికులు-మేనేజ్ మెంట్ కోర్టుకెళ్లారు. ప్రభుత్వం లాకౌట్ ఎత్తేయమని చెప్పింది . ప్రభుత్వం చెప్పినా ఇరుపక్షాల్లోనూ పట్టు విడుపులు లేవు . నేను మేనేజిమెంట్స్ తీసుకుని పుదుచ్చేరి-ఢిల్లీ చుట్టూ తిరిగాను . కేంద్రమంత్రి నారాయణస్వామి , గవర్నర్ , చీఫ్ సెక్రటరీలను కలిసాను . అనేకసార్లు అసెంబ్లీలో ఈ అంశం లేవనెత్తాను . చర్చలు జరిగాయి . అయినా ఎలాంటి మార్పు లేదు .కె .సి.చంద్రశేఖర్ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదు . నేను బాధపడి దూరంగా వున్నాను .
[ఈ సంఘటన తర్వాత ముఖ్యమంత్రి రంగసామి యానాం వచ్చారు . గవర్నర్తో . పాటు , ఎం . పి . హర్షకుమార్ వెలగా రాజేశ్వరరావులు కార్మికుల పక్షాన, కమ్యూనిస్టులు, కార్మికులు వారిని కలిసారు, ముఖ్యమంత్రి మీటింగ్ పెడతానన్నారు పెట్టలేదు. లేబరు-కమీషనరు యాజమాన్యాన్ని , కార్మికులను పిలిపించి సమావేశం ఏర్పాటుచేసారు . కార్మికులు ఫ్యాక్టరీని తెరవమని కోరగా యాజమాన్యం తెరవలేమని చెప్పేసారు. 2014లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి . వెలగా రాజేశ్వరరావు , షీ విష్ణుమూర్తిగార్లు, ఇంకా మరికొంత మంది స్థానిక నాయకులు ఎన్నికల య్యాక రీజెన్సీ ఫ్యాక్టరీని తెరిపిస్తామని బకాయిలు మొత్తం చెల్లించేలా చూస్తామని N . R . కాంగ్రెస్ తరపున ప్రచారం చేసి ఓట్లు వేయించు కున్నారు-కార్మికులతో , IE 20 నెలలు గడిచిపోయాయి . ఎలాంటి మార్పూ లేదు . 
ఇప్పటికయినా ఫ్యాక్టరీ తెరిపించండి లేదా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేయండి అనేది నా డిమాండ్ నేను ఇప్పటికీ అడుగుతున్నాను. 
ఈ నెలాఖరు 29 (ఫిబ్రవరి 2016) దాకా ఇరుపక్షాలతో చర్చలకు సమయం వుంది. ముఖ్యమంత్రిగారూ మీరు చిత్తశుద్దిగా ప్రయత్నం చేసి ఈ సమస్య పరిష్కరించండి. ఇదంతా నా మనస్సాక్షిగా, చిత్తశుద్ధితో చెప్పాను. ‘రీజెన్సీ’ విషయంలో నేను ఎటు పక్కకి చేరకుండా, నా నుండి ఎలాంటి తప్పు జరగకుండా నా వ్యతిరేకుల నుండి నిరాధారమైన ఆరోపణలను ఎదుర్కున్నాను. ఇది యానాంకి మచ్చ మాత్రమే.

CONCLUSION:

వ్యక్తిగతంగానూ నాకో విషాద అనుభవం , కె . సి . చంద్రశేఖర్ నాకు మంచి మిత్రుడు . కార్మికుల శ్రేయోభిలాషి , కార్మికులు యానాంలో భాగంగా వున్నారు . వారి జీవితాలు అల్లకల్లోలంగా వున్నాయి . ఇవన్నీ నన్ను కుదిపేస్తుంటాయి . చివరిగా నేను చెప్పేది ఒకటే . నేను ఈ మచ్చను తొలగించే ప్రయత్నం చేయటానికి ఎప్పుడూ ముందుంటాను . 

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories